ట్రయల్ రూంలో ట్రంప్ నాపై అత్యాచారం చేశాడు.. వెలుగులోకి మరో రేప్ కేసు...

By SumaBala BukkaFirst Published Apr 27, 2023, 9:19 AM IST
Highlights

డొనాల్డ్ ట్రంప్ తన మీద అత్యాచారం చేశాడని రచయిత ఈ జీన్ కారొల్ ఆరోపించారు. తాను ఎంత మొత్తుకున్నా వినలేదని తెలిపారు. దీంతో తాను చాలా నష్టపోయానని అంటున్నారు. 

న్యూయార్క్ :  అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  బరుసకేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఒక కేసు నుంచి విముక్తి లభించింది అనుకుంటే మరో కేసు మెడకు చుట్టుకుంటుంది.  76 ఏళ్ల వయసులో ఆయనను అత్యాచార కేసులు వెంటాడుతున్నాయి.  యవ్వనంలో చేసిన తప్పులు ప్రస్తుతం పాములై పగ తీర్చుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.  అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కారోల్ (79) తాజాగా డోనాల్డ్ ట్రంప్ మీద అత్యాచార ఫిర్యాదు చేసింది. 

1996లో ట్రంప్ తన మీద లైంగిక దాడి చేశాడని ఆరోపణలు చేస్తుంది. . మనహోటల్ లోని ఓ డిపార్ట్మెంటల్ స్టోర్ లో 1996లో డోనాల్డ్ ట్రంప్ జీన్ కారొల్ కు ఎదురయ్యారు. తన స్నేహితురాలైనా మరో మహిళకి లోదుస్తులను బహుమతిగా ఇవ్వాలని దానికోసం తన సలహా కావాలని అడిగారు. ట్రంప్ అదంతా సరదాగా అడగడంతో అతనికి సహాయం చేసే ఉద్దేశంతో ఆమె అతనితోపాటు ఆరో ఫ్లోర్ కి వెళ్ళింది.

 వీరు వెళ్లేసరికి సదర సెక్షన్ లో ఎవరూ లేరు. ఆ సమయంలో దుస్తులు మార్చుకునే  ట్రయల్ రూంలోకి వచ్చిన  డోనాల్డ్ ట్రంప్ జీన్ కారోల్ మీద అత్యాచారానికి పాల్పడ్డాడు.  అని ఆమె తరపు న్యాయవాది చెబుతున్నారు.  అయితే అప్పట్లో అత్యాచార బాధితురాలుగా తనను తాను చూసుకోవడం ఇష్టపడని కారొల్..  దీంతోపాటు ఆ ఘటనతో షాక్ లో ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని న్యాయవాది చెప్పుకొచ్చారు. 

పెంపుడు కుక్క విశ్వాసం.. తన యజమానికి సరిపోయే కిడ్నీ దాతను కనిపెట్టింది.. ప్రాణాలు కాపాడింది..

దాదాపు 30 ఏళ్ల క్రితం డొనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారం చేశాడని ఒక రచయిత బుధవారం ఆరోపించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఆమెపై దాడి చేసి, దాని గురించి అబద్ధం చెప్పాడో లేదో తెలుసుకోవడానికి సివిల్ విచారణ చేయించాలని కోరారు."డోనాల్డ్ ట్రంప్ నాపై అత్యాచారం చేశాడు కాబట్టే.. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేను దాని గురించి వ్రాసినప్పుడు, అతను అది అబద్ధం అని చెప్పాడు. అలా జరగలేదని చెప్పాడు"  అని జీన్ కారోల్ మాన్హాటన్లోని ఫెడరల్ కోర్టులో న్యాయమూర్తులతో తెలిపారు. 

కారోల్, ఎల్లే మ్యాగజైన్ మాజీ కాలమిస్ట్, ఆమె దావా 1995 చివరలో లేదా 1996 ప్రారంభంలో బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మాన్ డిపార్ట్‌మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. అప్పట్లో తాను దీనిమీద మాట్లాడితే.. ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో తన రేప్ క్లెయిమ్‌ను బూటకం, అబద్ధం  "పూర్తి కాన్ జాబ్" అని పిలవడం ద్వారా తన పరువు తీశారని... ఆమె తను ఆ "రకం" కాదని, అందుకే తన పరువు, ప్రతిష్టల్ని తిరిగి పొందడానికే దావా వేసినట్లు కారోల్ చెప్పారు.

ఆమె న్యూయార్క్ అడల్ట్ సర్వైవర్స్ యాక్ట్ కింద కూడా దావా వేయనుంది. ఈ చట్టం ద్వారా ఘటన జరిగిన చాలా కాలం తర్వాత పెద్దలు తమను దుర్వినియోగం చేసిన వారిపై దావా వేయడానికి అనుమతిస్తుంది. ట్రంప్ బుధవారం ట్రూత్ సోషల్‌లో కారోల్ కేసుపై హేళన చేశారు. ఆమె న్యాయవాదిని "రాజకీయ కార్యకర్త" అని ఎద్దేవా చేశారు. అత్యాచారం దావా "ఒక స్కామ్" అన్నారు.

దీనిమీద కారోల్ మాట్లాడుతూ.. ఒపెన్ డ్రెస్సింగ్ రూంలో నా మీద చేసిన అత్యాచారం ‘‘చాలా బాధాకరమైనది.. ఆ తరువాత మళ్లీ నేనుశృంగార జీవితాన్ని పొందలేకపోయాను".. దీనికి తాను తనను తానే నిందించుకున్నానని, తనను ఉద్యోగం నుంచి తొలగిస్తారని, ట్రంప్‌పై ఫిర్యాదు చేస్తే ప్రతీకారం తీర్చుకుంటానని భయపడ్డానని కూడా చెప్పింది.

#MeToo ఉద్యమం నుండి ప్రేరణ పొందిన కారోల్ 2019లో ముందుకు వచ్చారు. దీంతో ట్రంప్  తనమీద వర్బల్ దాడులకు పాల్పడ్డాడని.. దీని వల్ల ఎల్లే తనను తొలగించిందని, 8 మిలియన్ల మంది పాఠకులకు నష్టం వాటిల్లిందని, తాను అబద్ధాలకోరు అని ఇతరులకు నమ్మకం కలిగించిందని ఆమె అన్నారు.

click me!