Spider Twins: ఇటీవల కాలంలో కవలలు పుట్టడం అనేది సర్వసాధారణమైంది. కానీ, ఇండోనేషియాలో మాత్రం అరుదైన అవిభక్త కవలులు జన్మించారు. వారికి మూడు కాళ్లు, నాలుగు చేతులు ఉన్నాయి.
Spider Twins: ఇటీవల కాలంలో కవలలు పుట్టడం అనేది సర్వసాధారణమైంది. కానీ, ఇండోనేషియాలో మాత్రం అరుదైన అవిభక్త కవలులు జన్మించారు. వారికి మూడు కాళ్లు, నాలుగు చేతులు ఉన్నాయి. పిల్లలిద్దరూ కూర్చోలేని విధంగా ఉదర భాగం నుండి ఒకరికొకరు అతుక్కొని పుట్టారు. దీంతో వారు సరిగ్గా పడుకొనులేరు. సరిగ్గా నిలబడను లేరు. వారు ఎటువెళ్లిన సాలెపురుగు లాగా పాకుతు వెళ్లాల్సింది. ఇలాంటి అసాధారణమైన, అవిభక్త కవలలు 2 మిలియన్ (20 లక్షలు) మంది గర్భిణీల్లో ఒకరికి మాత్రమే ఇలాంటి కవలలు పుడుతారని ది అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్ వెల్లడించింది.
అరుదైన ఆపరేషన్..
డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. ఈ అవిభక్త కవలలు 2018లో జన్మించారు. వైద్యుల బృందం శస్త్రచికిత్స చేసి వారి మూడో కాలును తొలగించింది. తుంటి , కటి ఎముకలను సరిచేయడానికి సుదీర్ఘ ఆపరేషన్ జరిపారు. వైద్యుల ప్రకారం.. సాధారణంగా ప్రతి 50 వేల నుండి 2 లక్షల గర్భాలలో ఒక కవలలు పుడుతున్నారు. ఫలదీకరణం చేయబడిన గుడ్డు విడిపోయి రెండు భాగాలుగా అభివృద్ధి చెందినప్పుడు ఇది జరుగుతుంది. గర్భం దాల్చిన ఎనిమిది నుండి 12 రోజుల తర్వాత ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే.. రెండు వేర్వేరు పిండాలు ఒకే దగ్గర అభివృద్ధి చెందడం వల్ల ఇలాంటి కవలలు పుడతారని మరి కొన్ని పరిశోధనల్లో చెబుతున్నాయి.
undefined
ఇస్కియోపాగస్ ట్రైసెప్స్
ఇండోనేషియాలో జన్మించిన ఈ కవలలను ఇస్కియోపాగస్ ట్రైసెప్స్ అని పిలుస్తారు. వారికి నాలుగు చేతులూ పని చేస్తున్నాయి. రెండు కాళ్లు కూడా చురుకుగా ఉన్నాయి. కానీ ఒక్క కాలు మాత్రం సరిగ్గా పనిచేయడం లేదు. అలాగే ఒకరి కిడ్నీ కూడా అభివృద్ధి చెందలేదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వారికి ఇప్పటికే ఇద్దరు సోదరులు, సోదరీమణులు ఉన్నారు. కుటుంబంలో ఎవరికీ జన్యుపరమైన రుగ్మతలు లేవు. గర్భధారణ సమయంలో తల్లికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇటువంటి కేసుల్లో 60% కంటే ఎక్కువ సందర్భాలలో కవలలు చనిపోతారనీ, కానీ ఈ కవలలు డాక్టర్ల అంచనాలను ధిక్కరించి బ్రతికారు. అయినప్పటికీ.. వారి ప్రత్యేకమైన శరీరధర్మ శాస్త్రం కారణంగా వారు పలుసవాలును ఎదుర్కొన్నారు. వారు తమ జీవితంలో మొదటి మూడు సంవత్సరాలు స్వతంత్రంగా కూర్చోలేకపోయారని వైద్యులు వెల్లడించారు.
ప్రపంచంలోనే ఇదొక ప్రత్యేకమైన కేసు
ఇది ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన కేసు అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చిన్నారులకు శస్త్ర చికిత్సకు ఎంత సమయం పట్టిందనే విషయంపై స్పష్టత లేదు. కానీ.. మూడు నెలలు గడిచినా వారిలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు వారు కూర్చోవచ్చు. నిలబడగలరు. 1989లో చైనాలో కూడా ఇలాంటి కవలలు జన్మించారు. వారికి రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నాయి. వైద్యులు 1992లో శస్త్రచికిత్స చేసి ఇద్దరినీ వేరు చేశారు. అప్పటికి వారి వయసు రెండేళ్లు మాత్రమే. ఆపరేషన్ దాదాపు 10 గంటలు పట్టింది. 2011లో పాకిస్థాన్‌లో కూడా ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చింది. ఈ పిల్లలలో ఒకరు చాలా చిన్నగా, బలహీనంగా ఉన్నారు. అలాగే ఒకరి తల చిన్నగా ఉంది.