పాప్ సింగర్ రిహన్నా పేరు ఈ మధ్యకాలంలో బాగా వినపడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేయగా.. వారికి ఈ పాప్ సింగర్ రహన్నా మద్దతు తెలిపింది.
undefined
ఆ విషయంలోనే మొదట భారత్ లో ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ఆమె గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఔత్సాహికులు సోషల్ మీడియాలో ఆమె గురించి వెతకడం మొదలుపెట్టారు.
undefined
ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఆమె చేసిన ఓ పని ప్రస్తుతం తీవ్ర దుమారం రేపింది. ఆమె టాప్ లెస్ గా ఫోటోలకు ఫోజులిస్తూ దిగిన ఫోటోలే అందుకు కారణం కావడం గమనార్హం.
undefined
తాజాగా ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి తీవ్ర వివాదానికి దారితీసింది. తన లోదుస్తుల బ్రాండ్ Savage X Fenty కోసం గణేష్ లాకెట్టు కలిగిన నెక్లెస్‌ను ధరించిన రిహానా.. సెమీ న్యూడ్‌గా టాప్‌లెస్ ఫొటోకు ఫోజు ఇచ్చింది. ఆ ఫొటోలో రిహానా కేవలం చిన్నపాటి షార్ట్ ధరించి మాత్రమే ధరించి ఉంది.
undefined
ఈ ఫొటో కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్స్ రిహానా తమ మతపరమైన భావాలను రెహానా దెబ్బతీసిందని ట్విట్టర్‌లో కామెంట్‌లు చేస్తున్నారు.
undefined
" హిందూవులు ఎంతో భక్తి భావంతో గణేషుడిని పూజిస్తారు. ప్రతి ఏడాది గణేష్ నవరాత్రులు జరుపుకుంటారు. అలాంటి గణేషుడి ప్రతిమను లాక్‌ట్‌లా ధరించి.. ఇలాంటి పని చేయడం ద్వారా కొన్ని కోట్ల మంది మనోభావాలను రిహానా దెబ్బతీసింది" అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.
undefined
మరో నెటిజన్ స్పందిస్తూ.. "ఆమె బ్రాండ్ ప్రచారం కోసం మా మనోభావాలను కించపరిచేలా వ్యవహరించం సిగ్గుచేటు" అని కామెంట్ చేశారు.
undefined
బీజేపీ నాయకుడు రామ్ కదమ్ కూడా రిహానా ఫొటోపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. " మన హిందూ దేవుడు గణేష్ దేవుడి లాకెట్ ధరించి రిహానా నీచపు పని చేసింది. ఇది రిహానాకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల, సమస్యలపై ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఈ ఫొటో బహిర్గతం చేస్తోంది. కనీసం ఇప్పటికైనా రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఆమె నుంచి సాయం తీసుకోవడం మానేస్తారని ఆశిస్తున్నాను" అని రామ్ కదమ్ పేర్కొన్నారు.
undefined