మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో కొందరు దర్శకులు, రచయితలు కీలకం అని చెప్పొచ్చు. చిరంజీవికి ఎక్కువ హిట్స్ ఇచ్చిన దర్శకుల్లో కోదండరామిరెడ్డి, రాఘవేంద్ర రావు ప్రధానంగా ఉంటారు. రచయితల్లో అయితే పరుచూరి బ్రదర్స్ అనే చెప్పాలి. చిరంజీవి కెరీర్ మలుపు తిరగడానికి ప్రాణం పోసిన రచయితలు పరుచూరి బ్రదర్స్. ఖైదీ చిత్రంతో వీరి కాంబినేషన్ మొదలయింది.
ఆ తర్వాత కొండవీటి దొంగ, అడవి దొంగ, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు నుంచి మొన్నటి సైరా వరకు చిరంజీవి, పరుచూరి బ్రదర్స్ ది తిరుగులేని కాంబినేషన్. దీనితో చిరంజీవి కెరీర్ లో పరుచూరి బ్రదర్స్ కీలకంగా మారారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్, ఇమేజ్ ని బాగా అర్థం చేసుకున్న రచయితలు వీళ్ళు. అందుకే సింక్ అంతబాగా కుదిరింది.
Mohan Babu
అయితే పరుచూరి బ్రదర్స్ జీవితాల్లో కూడా విషాదాలు ఉన్నాయి. పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు క్యాన్సర్ కారణంగా చిన్న వయసులోనే మరణించారు. ఆ సమయంలో ఆయన డిప్రెషన్ లోకి వెళ్లారట. ఒకవైపు వృత్తి, మరోవైపు కొడుకు లేదనే బాధతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఉపశమనం కోసం సిగరెట్స్ విపరీతంగా కాల్చడం అలవాటు చేసుకున్నారు. ఈ విషయం చిరంజీవి దృష్టికి వచ్చింది.
వెంటనే చిరంజీవి పరుచూరి బ్రదర్స్ ఇంటికి వెళ్లారు. ఓ ఈవెంట్ లో చిరంజీవి ఈ విషయాలని చెప్పారు. చిరంజీవి వెళ్ళినప్పుడు కూడానా పరుచూరి వెంకటేశ్వర రావు సిగరెట్ కాల్చుతున్నారు. నీ బిడ్డ క్యాన్సర్ తో మరణించాడు. క్యాన్సర్ కి ప్రధానమైన కారణాలలో సిగరెట్ కూడా ఒకటి. కొడుకుపై బాధతో సిగరెట్స్ కి బానిసైతే ఎలా ? నీ అవసరం చిత్ర పరిశ్రమకి ఉంది. మీరు పదికాలాలు ఆరోగ్యంగా ఉండాలి.. సిగరెట్ మానేయండి అని చిరంజీవి చెప్పారు.
Paruchuri Venkateswararao
చిరంజీవి అంతటివాడు చెబితే తిరుగు ఉంటుందా.. ఇప్పుడే మానేస్తున్నా అని చేతిలో ఉన్న సిగరెట్ ని యాష్ ట్రే లో పడేశారట. ఆ విధంగా చిరంజీవి పరుచూరి వెంకటేశ్వరరావు చేత చిరు సిగరెట్ మాన్పించారు. చిరంజీవి, పరుచూరి బ్రదర్స్ మధ్య అంత మంచి రిలేషన్ ఉంది. అందుకే పరుచూరి బ్రదర్స్ కూడా పదే పదే చిరంజీవి చిత్రాలని గుర్తు చేసుకుంటుంటారు.