రామ్ చరణ్ - రవితేజ్ కాంబినేషన్ లో మిస్ అయిన భారీ మల్టీ స్టారర్...? కారణం ఆ హీరోనేనా..?

First Published | Nov 28, 2024, 10:12 AM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోల కాంబినేషన్ లో ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలు వచ్చాయి.. వస్తునే ఉన్నాయి. అయితే ఎన్నో సినిమాలు మిస్ అయినవి కూడా ఉన్నాయి. వాటిలో రవితేజ రామ్ చరణ్ కాంబోలో  ఓ సినిమా మిస్ అయ్యిందని మీకు తెలుసా..? 

టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో మల్టీ స్టారర్ సూపర్ హిట్ అయ్యాయి. స్టార్ హీరోలు..సూపర్ స్టార్లు కూడా మల్టీ స్టారర్స్ లో నటించి మెప్పించారు. మరికొన్ని మల్టీ స్టారర్ మూవీస్ ప్రపోజల్స్ లో ఉన్నాయి. మరికొన్ని మాత్రం రూమర్స్ గానే నిలుస్తున్నాయి. ఇంకొన్ని మల్టీ స్టారర్ మూవీస్ మాత్రం చేయబోయి మిస్ అయ్యాయి. అలాంటి వాటిలో రవితేజ్, రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీ కూడా ఒకటి. 

Also Read: రజినీకాంత్ తల్లిగా ఆరాధించే ఈ చిన్నారి ఎవరో తెలుసా ?

Ram Charan

రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఇమేజ్ తో ఇండస్ట్రీకి వచ్చినా.. ఆయన సొంతగా ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. తన తండ్రి చిరంజీవి టాలీవుడ్ కే పరిమితం అయితే.. తాను మాత్రం పాన్ఇండియాను ఆకర్శిచాడు. ఆస్కార్ రేంజ్ కు వెళ్లాడు.

ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దుమ్ము రేపడానికి రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. ఇక తన కెరీర్ లో ఆర్ఆర్ఆర్ తప్పించి ఇంకేవి మల్టీ స్టారర్ సినిమాలు చేయలేదు చరణ్. అయితే గతంలో  రవితేజ కాంబినేషన్ లో మాత్రం  రావాల్సిన ఒక భారీ మల్టీస్టారర్ సినిమా మిస్ అయిందట. 

Also Read: పృథ్వీ‌తో అర్ధరాత్రి తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పిన విష్ణుప్రియ, మాజీ ప్రియుడిని మళ్ళీ ప్రేమిస్తుందా..?


ఇక రవితేజ  మాత్రం అరవై ఏళ్లకు అతి దగ్గరలో ఉన్నా కూడా ఏమాత్రం తగ్గది లేదంటున్నాడు. ఫిట్ నెస్ విషయంలో కాని.. డాన్స్ విషయంలో కాని ఎక్కడా వెనకడుకు వేయడం లేదు రవితేజ. అంతే కాదు హిట్..ప్లాప్ సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు మాస్ మహారాజ్. ప్లాప్ లు వచ్చినప్పుడు క్రుగిపోకుండా.. హిట్ వస్తే ఎగిరిపడకుండా.. కెరీర్ ను బ్యాలన్స్ చేసుకుంటూ సాగుతున్నాడు. 

Also Read: ధనుష్ - ఐశ్వర్య విడాకులపై కోర్టు ఫైనల్ తీర్పు. ఏమయ్యిందంటే..?

ఈక్రమంలో ఈ ఇద్దరు స్టార్ హీరోల కాంబోలో మల్టీ స్టారర్ మిస్ అయ్యిందట. ఇద్దరు హీరోలు వడివడిగా.. వేరే హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేసినవారే అయితే బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన బోల్ బచ్చన్ సినిమాని తెలుగులో రవితేజ, రామ్ చరణ్ లను హీరోలుగా పెట్టి చేద్దామనే ఆలోచన చేశారట కొంత మంది  ప్రొడ్యూసర్స్. 

Also Read:అఖిల్ పెళ్లికి, వైస్ ఎస్ జగన్ కు సంబంధం ఏంటి..?

అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఒకటి జరిగింది. ఆసినిమా రైట్స్ ను  అనుకోకుండా స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు  తీసుకోవడం దాంతో వెంకటేష్ రామ్ లను పెట్టి ఈ సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమానే మసాలా. కాని ఈసినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోకపోగా.. ఇరిటేట్ చేసిందని చెప్పాలి. రామ్ డ్యూయల్ రోల్ చేసిన ఈసినిమా ను రవితేజ్, రామ్ చరణ్ లు చేయకపోవడమే మంచిదయ్యిందని ప్యాన్స్ అంటున్నారు. 

Also Read: 47 ఏళ్లకు పెళ్లి చేసుకున్న సుబ్బరాజు , అమ్మాయి ఎవరో తెలుసా..?

అయితే ఎనర్జిటిక్ స్టార్స్ గా పేరున్న వీళ్ళ కాంబోలో ఒక సినిమా మిస్ అయిందనే బాధను కూడా వెలిబుచుతున్నారు. మరి ఇప్పటికైనా వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలని యావత్ తెలుగు సినిమా అభిమానులంతా కోరుకుంటున్నారు. మరి తొందర్లోనే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ పలువురు దర్శకులు తెలియజేస్తున్నారు…

Also Read:పవన్ కళ్యాణ్ ఇంట్లో పెత్తనం ఎవరిదో తెలుసా..? పవర్ స్టార్ ను కూడా కంట్రోల్ చేసే ఆ లేడీ ఎరంటే..?

Latest Videos

click me!