థైరాయిడ్ ఉన్నవారు ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Oct 2, 2024, 12:56 PM IST

ఈ రోజుల్లో చిన్న వయసులోనే థైరాయిడ్ సమస్య వస్తుంది. అయితే ఈ థైరాయిడ్ ప్రెగ్నెన్సీ టైంలో తల్లీ, బిడ్డ ఇద్దరిపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే గర్భిణులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


గర్భంతో ఉన్నవారు ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నవారు. ఎందుకంటే ఈ థైరాయిడ్ ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో సమస్యలు వచ్చేలా చేస్తుంది. థైరాయిడే కదా అని లైట్ తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ మెదడు, నాడీ వ్యవస్థ దెబ్బతిని, గర్భస్రావం జరిగే అవకాశం ఉంది. అందుకే థైరాయిడ్ ఉన్న గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ప్రెగ్నెన్సీ టైంలో  థైరాయిడ్ ప్రభావాలు

ఎవ్వరికైనా ప్రెగ్నెన్సీ సమయంలో బాగా అలసటగా అనిపిస్తుంది. ఇది సర్వ సాధారణం. ఈ అలసట నుంచి బయటపడాలంటే మాత్రం మీరు మంచి పోషకాహారం ఖచ్చితంగా తినాలంటారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ డ్యామేజ్ తగ్గాలంటే మీరు అయోడిన్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో అయోడిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే అయోడిన్ తక్కువగా ఉన్న ఆహారం మీ పరిస్థితిని అదుపులో ఉంచడానికి సమాయపడుతుంది. హాస్పటల్ కు వెళ్లినప్పుడు కూడా ఎక్కువ కారం, ఉప్పును తినకూడదని డాక్టర్లు చెప్పడం వినే ఉంటారు. అలాగే థైరాయిడ్ ఉన్న గర్భిణీలు గ్రీన్ వెజిటేబుల్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే సొరకాయను ఎక్కువగా తినాలి. 

థైరాయిడ్ వల్ల గర్భిణులకు వచ్చే సమస్యలు 

Latest Videos

undefined

ప్రెగ్నెన్సీ టైంలో అలసటగా, బలహీనంగా అనిపించడం సర్వ సాధారణం. అయినప్పటికీ.. థైరాయిడ్ గ్రంధి దెబ్బతింటే హైపోథైరాయిడిజం మరింత ఎక్కువ అవుతుంది. దీనివల్ల మీ అలసట మరింత పెరిగిపోతుంది. అలాగే మీ మానసిక స్థితి కూడా బలహీనంగా మారుతుంది. 

సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా బరువు పెరుగుతారు. అయినప్పటకీ ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అధిక బరువు మీ జీవక్రియను ప్రభావితం చేయడమే కాకుండా.. మీరు తినే ఆహారాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 

ప్రెగ్నెన్సీ టైం లో థైరాయిడ్ గ్రంథి దెబ్బతిన్నప్పుడు మీకు విపరీతమైన మలబద్దకం సమస్య వస్తుంది. థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మీకు గట్ కు సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తాయి. 

ఇకపోతే థైరాయిడ్ వల్ల చాలా మంది ఆడవారికి ప్రెగ్నెన్సీ టైంలో హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటుగా థైరాయిడ్ గ్రంథి దెబ్బతినడం వల్ల మీ జుట్టు పెరగడం కూడా చాలా వరకు ఆగిపోతుంది. ఈ సమయంలో మీకు హెయిర్ పాల్, డ్రై హెయిర్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా నిరాశ, మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిలో మీరు ఏ ఒక్కదాన్ని అనుభవించినా వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. 

ప్రెగ్నెన్సీ టైంలో  థైరాయిడ్‌ను కంట్రోల్ చేయడానికి సహాయపడే ఆహారాలు

అయోడిన్-రిచ్ ఫుడ్స్: థైరాయిడ్ ఉన్నవారికి అయోడిన్ చాలా అవసరం. ఇది పాల ఉత్పత్తులు, గుడ్లు, పౌల్ట్రీ, సీఫుడ్, మాంసం, అయోడైజ్డ్ ఉప్పులో పుష్కలంగా ఉంటుంది. ఈ అయోడిన్ థైరాయిడ్ హార్మోన్లను తయారు చేయడానికి ఎంతో అవసరమైన ఖనిజం. శరీరంలో అయోడిన్ లోపిస్తే మీకు హైపోథైరాయిడిజం వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే శిశువుకు పాల నుంచి అయోడిన్ అందుతుంది. అందుకే తల్లులు అయోడిన్ లోపం లేకుండా చూసుకోవాలి. 

మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు: థైరాయిడ్ సమస్య ఉన్న గర్భిణులకు మెగ్నీషియం కూడా చాలా అవసరం. ఇది ఎక్కువగా క్యారెట్లు, ఆకుకూరలు, క్యారెట్లు, బచ్చలికూర, పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉంటుంది. ఈ మెగ్నీషియం థైరాయిడ్ హార్మోన్లను మితంగా ఉత్పత్తి చేసేలా చేస్తుంది. 

పండ్లు: గర్భిణులు ఖచ్చితంగా తాజా పండ్లను, డ్రై ఫ్రూట్స్ ను ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయి. అందుకే ప్రెగ్నెన్సీ టైంలో బెర్రీలు, యాపిల్స్, అరటిపండ్లు, ద్రాక్ష, సిట్రస్ పండ్లు, పైనాపిల్స్ వంటి పండ్లను రోజూ తినండి. 

ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు: హైపో థైరాయిడిజం వల్ల కండరాల నష్టం ఎక్కువగా జరుగుతుంది. అందుకే ప్రెగ్నెన్సీ టైంలో గుడ్లు, మాంసం, చేపలు, పౌల్ట్రీ వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ ను ఖచ్చితంగా తినండి. ఇవి మీ కండరాలను బలంగా ఉంచుతాయి. అలాగే మీ శరీరంలో ఎనర్జీ లెవెల్స్ ను పెంచడానికి సహాయపడతాయి. ఈ ఫుడ్స్ లో అయోడిన్ మెండుగా ఉంటుంది. అందుకే వీటిని లిమిట్ లో తీసుకోవడం అవసరం. 

తృణధాన్యాలు: ప్రెగ్నెన్సీ సమయంలో హైపోథైరాయిడిజం సాధారణ లక్షణాలలో మలబద్ధకం సమస్య ఒకటి.  కడుపుతో ఉన్నప్పుడు తృణధాన్యాలు ఎక్కువగా ఉండే ఫుడ్ ను తినాలి. ఎందుకంటే వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. ఇందుకోసం మీరు ఓట్స్ లేదా క్వినోవాతో పాటు కూరగాయలతో కలిపి బ్రౌన్ రైస్ ను తినొచ్చు. 

పాల ఉత్పత్తులు: పాల ఉత్పత్తుల్లో కాల్షియం కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే కొబ్బరి పాలు, జున్ను, జీడిపప్పు, కొబ్బరి పెరుగు, బాదం పాలు లేదా తియ్యని పెరుగు వంటి వాటిని మీ రోజువారి ఆహారంలో చేర్చండి. అలాగే టమాటాల, క్యాప్సికం, మెంతికూర వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా మీ రోజువారి ఆహారంలో చేర్చండి. 

click me!