పెయిన్ ఫుల్ సెక్స్.. ఆ క్యాన్సరే కారణమా?

First Published Jan 10, 2024, 1:52 PM IST

జనవరి సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ నెల. గర్భాశయ క్యాన్సర్ ను నుంచి బయటపడాలంటే.. దాని ప్రారంభ లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. 
 

ఆడవాళ్లు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు కుటుంబ బాధ్యతలో ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. దీనివల్లే ఆడవాళ్లకు ఎన్నో సమస్యలు ముదిరినంకనే బయటపడతాయి. ఈ రోజుల్లో చాలా మంది ఆడవారు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ స్త్రీ పునరుత్పత్తి అవయవాలను ప్రభావితం చేస్తాయి. ఇది మూడవ దశకు వచ్చినప్పుడే గుర్తించబడుతుంది. ఈ దశలో వ్యాధి నయం కాదు. అందుకే ఈ లక్షణాలను ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. జనవరి మాసం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి అవగాహన కల్పించే మాసం. ఈ సందర్భంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 

cervical cancer

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అవగాహన నెల 

జనవరి సర్వైకల్ క్యాన్సర్ అవేర్ నెస్ నెల. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అవగాహన నెలను సంవత్సరంలో మొదటి నెలలో అంటే జనవరి నెలలో జరుపుకుంటారు. ఇది గర్భాశయ క్యాన్సర్ గురించి తెలుసుకోవడానికి, దానిని నివారణా చిట్కాలను తెలియచేస్తుంది. 

Cervical Cancer

గర్భాశయ క్యాన్సర్ కు కారణాలేంటి? 

గర్భాశయ ముఖద్వార కణాలు ప్రభావితమైనప్పుడు గర్భాశయ క్యాన్సర్ వస్తుంది. గర్భాశయం యోనిని కలుపుతుంది. ఈ క్యాన్సర్ గర్భాశయం లోపలి కణజాలాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రాశయం, యోని, పురీషనాళానికి వ్యాపిస్తుంది. గర్భాశయ క్యాన్సర్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ సంక్రమణ వల్ల సంభవిస్తుంది. వ్యాక్సిన్లతో దీన్ని నివారించొచ్చు.
 

Image: Getty Images

హెచ్ పీవీ గర్భాశయ క్యాన్సర్ కు కారణమవుతుంది

గర్భాశయ క్యాన్సర్ కణజాలాలలో అసాధారణ మార్పులతో ప్రారంభమవుతుంది.అయితే గర్భాశయ క్యాన్సర్ చాలా కేసులు హెచ్పివి సంక్రమణతో సంబంధం కలిగి ఉంటాయి. గర్భాశయ క్యాన్సర్ నెమ్మదిగా పెరుగుతుంది. అందుకే ఇది ప్రాణాంతక సమస్యగా మారడానికి ముందు దానిని గుర్తించి చికిత్స తీసుకోవాలి. 65 ఏండ్లు పైబడినప్పుడు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. గర్బాశయ క్యాన్సర్ లక్షణాలు ఇలా ఉంటాయి..
 

Pain During Sex

బాధాకరమైన సెక్స్

అసాధారణ యోని రక్తస్రావం గర్బాశయ  ముఖద్వార క్యాన్సర్ మొదటి లక్షణం. సెక్స్ తర్వాత నొప్పి ఎక్కువగా ఉండటమే కాకుండా రక్తస్రావం కూడా ఎక్కువగానే ఉంటుంది. పీరియడ్స్ సమయంలో, రుతువిరతి తర్వాత లేదా కటి పరీక్ష తర్వాత అసాధారణమైన యోని ఉత్సర్గ,  రక్త ప్రవాహం ఎక్కువగా, బలమైన వాసన వంటివి గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు కావొచ్చు.
 

కటి ప్రాంతం నొప్పి

గర్భాశయ క్యాన్సర్ కొన్నిసార్లు కటి ప్రాంతంలో నొప్పి, ఒత్తిడి లేదా బరువును కలిగిస్తుంది. ప్రారంభ దశ కణితితో సంబంధం ఉన్న ఏదైనా అసౌకర్యం తేలికపాటి లేదా సాధారణ సమస్యగా అనిపించొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. 
 

మూత్ర విసర్జనలో ఇబ్బంది

క్యాన్సర్ గర్భాశయం,  దాని చుట్టుపక్కల కణజాలాలు, అవయవాలకు వ్యాపిస్తే.. ఇది అనేక ఇతర లక్షణాలను కలిగిస్తుంది. మూత్రంలో రక్తంతో పాటుగా తరచుగా మూత్రవిసర్జన కూడా ఉండొచ్చు. ఈ క్యాన్సర్ వల్ల మూత్ర విసర్జనపై నియంత్రణ ఉండదు.
 

Cervical cancer

ఎముక నొప్పి

నిరంతరం ఎముక నొప్పి ఉంటే అది కూడా గర్భాశయ క్యాన్సర్ లక్షణం కావొచ్చు. అలాగే పాదాలలో వాపు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం కూడా దీని లక్షణాలే కావొచ్చంటున్నారు నిపుణులు. 

మూత్రపిండాల సమస్య

గర్భాశయ క్యాన్సర్ స్టేజ్ పెరిగితే కిడ్నీ డ్యామేజ్ అవుతుందనే భయం కూడా ఉంటుంది. అలసట, వెన్నునొప్పి, కడుపు నొప్పి కూడా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కు సంకేతం కావొచ్చంటున్నారు నిపునులు.
 

డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి?

రుతువిరతి తర్వాత రక్తస్రావం రావడం మంచిది కాదు. ఒకవేళ మీకు ఇలా అయితే వీలైనంత త్వరగా హాస్పటల్ కు వెళ్లండి. ముఖ్యంగా బ్లీడింగ్ ఎక్కువగా వస్తే ఆలస్యం చేయకుండా హాస్పటల్ కు వెళ్లడం మంచిది.

click me!