School Holidays
SChool Holidays : ఈ సంవత్సరం విద్యార్ధులకు భారీగా సెలవులు వచ్చాయి. న్యూ ఇయర్, సంక్రాంతితో ప్రారంభమైన ఈ సెలవుల పరంపర ఇంకా కొనసాగుతూనే వుంది. పబ్లిక్ హాలిడేస్ కు తోడు భారీ వర్షాలు, వరదలు, బంద్ ల కారణంగా అదనపు సెలవులు వచ్చాయి. ఇక ప్రతినెలా నాలుగైదు ఆదివారాలు వుండనే వున్నాయి. ఈ సెలవులు చాలవన్నట్లు ఇయర్ ఎండింగ్ లో కూడా భారీగా సెలవులు వస్తున్నాయి. ఇది స్కూల్ విద్యార్థులు ఆనందంతో ఎగిరి గంతులేసే వార్త.
ఇప్పటికే 2024 సంవత్సరంలో 11 నెలలు గడిసిపోయినట్లే. ఇక మిగిలింది ఒకే ఒక నెల డిసెంబర్. ఈ డిసెంబర్ లోనూ విద్యాసంస్థలకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఈ నెలలో విద్యార్థులకు ఏడెనిమిది సెలవులు వస్తున్నాయి. ఇలా డిసెంబర్ సెలవులతో ఇట్టే గడిచిపోయేలా వుంది.
School Holiday
డిసెంబర్ 2024 లో సెలవులే సెలవులు :
సెలవు అన్న మాట వింటే ఉద్యోగులకే పట్టరాని ఆనందం వస్తుంది.. అలాంటిది విద్యార్థుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలవులు వస్తే హాయిగా ఇంట్లో వుండొచ్చని, స్నేహితులతో సరదాగా ఆడుకోవచ్చని ప్రతి స్టూడెంట్ కోరుకుంటారు. వారు ఆనందించేలా ఈ డిసెంబర్ భారీ సెలవులను మోసుకువచ్చింది.
వచ్చే నెలలో క్రిస్టియన్స్ ఎంతో సంబరంగా జరుపుకునే క్రిస్మస్ పండగ వుంది. కాబట్టి ఇరు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు రెండుమూడు రోజులు సెలవు వచ్చే అవకాశం వుంది.డిసెంబర్ 25న క్రిస్మస్... ఆ రోజు ఎలాగూ సెలవు వుంటుంది. ఆ తర్వాతి రోజు కూడా సెలవు ఇచ్చారు.ఇక క్రిస్మస్ ముందురోజు అంటే 24న ఈవ్ సందర్భంగా ఐచ్చిక సెలవు వుంటుంది... కొన్ని స్కూల్స్ ఆ రోజు హాఫ్ డే సెలవు ఇస్తారు. మొత్తంగా క్రిస్మస్ పండక్కి మూడురోజుల సెలవు వస్తుంది.
ఇక ఈ నెలలో ఐదు ఆదివారాలు (డిసెంబర్ 1,8,15,22,29), ఓ రెండో శనివారం (డిసెంబర్ 14) కలుపుకుంటే ఆరు రోజులు స్కూల్స్ నడవవు. ఈ క్రిస్మస్ హాలిడేస్ ను కలుపుకుంటే మొత్తం నెలలో 9 రోజులు సెలవులే వుంటాయి. ఒకవేళ ప్రస్తుత ఫెంగల్ తుఫాను ప్రభావంతో డిసెంబర్ లో కూడా భారీ వర్షాలు కురిస్తే మరిన్నిసెలవులు వచ్చే అవకాశం వుంది.
ఇక క్రిస్టియన్ మిషనరీ విద్యాసంస్థల క్రిస్మస్ సెలవులు భారీగా వుంటాయి. మిషనరీ పాఠశాలలకు 5 రోజుల క్రిస్మస్ సెలవులను ప్రకటించింది విద్యా శాఖ. అంటే డిసెంబర్ 23 నుండి 27 వరకు సెలవులు ఇచ్చారు. అంటే డిసెంబర్ లో మిషనరీ విద్యాసంస్థలకు 11 రోజుల సెలవులు రానున్నాయి. (5 క్రిస్మస్ సెలవులు, 5 ఆదివారాలు, 1 రెండో శనివారం).
School Holiday
నవంబర్ 29న సెలవు?
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారుతోంది. ఇది తుఫానుగా మారి ఏపీతో పాటు తమిళనాడు, అండమాన్ నికోబార్ పై విరుచుకుపడుతుందని ఐఎండి హెచ్చరించింది.
ఈ ఫెంగల్ తుఫాను ప్రభావంలో ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. ఏపీలోని కోస్తాంద్ర, రాయలసీమ జిల్లాలపైనా ఈ తుఫాను ప్రభావం వుంటుందని... పలుచోట్ల మోస్తరు నుండి భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరిస్తున్నారు. నవంబర్ 29న అంటే రేపు శుక్రవారం ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో వర్ష తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం వుంది.
ఇప్పటికే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురిసే అవకాశం వున్న జిల్లాల అధికారులను అప్రమత్తం చేసారు. జిల్లాల మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో వుండాలని... సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నది పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివాసముండే ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వం సూచించింది.
School Holiday
తమిళనాడులో వరుస సెలవులు :
ఫెంగల్ తుఫాను తమిళనాడుపై విరుచుకుపడుతోంది. కడలూరు, తిరువారూర్, నాగపట్టినం, మయిలాడుతురై, కారైకల్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్ష తీవ్రత ఎక్కువగా వున్న ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలు, వరద పరిస్థితి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు.
గత మంగళవారం (నవంబర్ 26) నుండి వర్షాలు మొదలయ్యాయి. భారీ వర్షాలు కురిస్తున్న పలు ప్రాంతాల్లో నవంబర్ 27,28 తేదీల్లో సెలవులు ఇచ్చారు. ఈ తుఫాను ప్రభావంతో మరో రెండ్రోజులు వర్షాలు దంచికొట్టే అవకాశాలున్నాయి... దీంతో అప్పటివరకు ఈ సెలవులు ఇలాగే కొనసాగే అవకాశం వుంది.