Kanguva, Suriya, OTT release
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తమిళ మాస్ డైరెక్టర్ శివతో కలిసి తెరకెక్కించిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా రూపొందించారు. ఈ చిత్రంలో లాంగ్ హెయిర్‌తో సూర్య ఇంటెన్స్ గెటప్‍తో ఉన్నారు. ఓ తెగకు నాయకుడిగా ఆయన కనపడ్డారు.
బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా క్రూరంగా భయంకరమైన పాత్ర చేసారు. అద్భుతమైన విజువల్స్, డైరెక్టర్ శివ టేకింగ్, భారీ యాక్షన్ సీక్వెన్స్, సూర్య, బాబీ డియోల్ సూపర్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కంగువ మేకింగ్ పరంగా మంచి మార్కులే వేయించుకుంది. అయితే సినిమా కథ పరంగా బాగా నాశిరకంగా ఉందని రివ్యూలు వచ్చాయి. నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఈ క్రమంలో ఓటిటి రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూడటం మొదలెట్టారు. ఆ వివరాలు చూద్దాం.
Actor Suriya starrer Kanguva
నవంబరు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కంగువా మూవీ.. మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దాంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర వసూళ్లని రాబట్టలేకపోయింది. మరో ప్రక్క ఇప్పటికే ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
అంతేకాకుండా కంగువా సినిమా నుంచి 12 నిమిషాల్ని మేకర్స్ ట్రిమ్ చేశారు. అయితే కంగువా కొత్త వెర్షన్ ని ఎవరూ పట్టించుకోలేదు. అయితే.. అప్పటికే నెగటివ్ మౌత్ టాక్‌తో ఉన్న ఈ మూవీ మళ్లీ పుంజుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు ప్లాన్ చేసారు. అయితే.. ఓటీటీలో ఆ 12 నిమిషాలు ట్రిమ్ చేసిన సీన్స్ ఉంటాయో లేదో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడం లేదు.
Actor Suriya starrer Kanguva
అందుతున్న సమాచారం మేరకు కంగువా చిత్రం అమేజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సౌతిండియన్ లాంగ్వేజ్ లు అన్నిటిలోనూ రిలీజ్ చేస్తారు. అఫీషియల్ ఎనౌన్సమెంట్ త్వరలో రాబోతోందని తెలుస్తోంది. రూ.350 కోట్లతో తెరకెక్కిన ఈ కంగువా సినిమా.. సూర్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రం.
కంగువా సినిమా విడుదలకి ముందు తమిళ్ బాహుబలి అంటూ చెన్నై మీడియా తెగ ఊదరగొట్టింది. అంతేకాదు.. రూ.2,000 కోట్లు వసూళ్లు రాబడుతుందంటూ ప్రొడ్యూసర్ కె.ఇ.జ్ఞానవేల్ రాజా బాహాటంగా ప్రకటించాడు. దాంతో సినిమాపై అంచనాలు పతాక స్థాయికి చేరిపోగా.. కథ, కథనం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. దాంతో రిలీజ్ రోజే పెద్ద ఎత్తున కంగువాపై ట్రోల్స్ నడిచాయి.
Kanguva
కంగువాపై తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. అలానే తమిళనాడులోనూ ఈ సినిమా మెప్పించలేకపోయింది. సినిమాకి ఇలా రోజు వ్యవధిలో కలెక్షన్లు పడిపోవడానికి కారణం నెగటివ్ రివ్యూస్ అని భావించిన.. తమిళనాడులోని నిర్మాతలు, థియేటర్ల యజమానులు.. థియేటర్ల వద్ద రివ్యూస్ చెప్పడాన్ని నిషేధించారు.
పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం ఈ స్దాయిలో ఫ్లాఫ్ అవటం నిర్మాతలకు నిద్రపట్టని పరిస్దితి తెలుస్తోంది. ఈ సిట్యువేషన్ లో ఓ ప్రక్కన ఈ సినిమా రివ్యూలపై విరుచుకుపడుతున్నారు.
Kanguva
మరో ప్రక్క సూర్య భార్య జ్యోతిక సైతం మూవీలోని తప్పిదాల్ని అంగీకరించింది. అదే సమయంలో ఇప్పుడు కో ప్రొడ్యూసర్ ధనుంజయన్ ఈ సినిమాని కొందరు కావాలని ఫ్లాఫ్ చేసారని చెప్పుకొచ్చారు. కంగువా సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. ఇప్పటికే సూర్య అభిమానులు అతనిపై గుర్రుగా ఉన్నారు.
సినిమాలోని పాటలకే కాదు పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోరు కూడా నాసిరకంగా ఉందని కామెంట్స్ చేసారు. దాంతో థియేటర్లలో సౌండ్ రెండు పాయింట్లు తగ్గించాలని నిర్మాత సలహా కూడా ఇచ్చారు.