ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలే నడుస్తుంది. ఈ మేరకు బిగ్ బాస్ టాస్క్స్ నిర్వహిస్తున్నారు. గత సీజన్లో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వారి సమక్షంలో టాస్క్స్ నిర్వహిస్తున్నారు. నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా వారికి బిగ్ బాస్ ఇవ్వడం విశేషం.
దీనిలో భాగంగా అఖిల్ సార్థక్- అలేఖ్య హారిక, మానస్-ప్రియాంక జైన్, పునర్నవి-వితిక షేరు వచ్చారు. టికెట్ టు ఫినాలే గెలిచిన కంటెస్టెంట్ నేరుగా ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. మొదటి ఫైనలిస్ట్ అవుతాడు. టికెట్ టు ఫినాలే రేస్ ఉత్కంఠగా సాగుతుంది. మరోవైపు ఎలిమినేషన్ టెన్షన్ ఉంది.
Bigg boss telugu 8
13వ వారానికి గాను నబీల్, పృథ్వి, విష్ణుప్రియ, నిఖిల్, ప్రేరణ, అవినాష్, టేస్టీ తేజ, గౌతమ్ నామినేట్ అయ్యారు. రోహిణి మెగా చీఫ్ కావడంతో ఆమెను ఎవరూ నామినేట్ చేయలేదు. రోహిణికి మినహాయింపు దక్కింది. ఈ వారం ఇంటిని వీడేది ఎవరనే ఉత్కంఠ నెలకొంది. ఓటింగ్ కి ఇంకా ఒక రోజు సమయం మాత్రమే ఉంది. మొదటి రోజు నుండి టాప్ లో ట్రెండ్ అవుతున్న గౌతమ్.. తన హవా కొనసాగితున్నాడట. అతడికే అత్యధిక శాతం ఓట్లు పోల్ అయ్యాయట
గౌతమ్ తర్వాత రెండో స్థానంలో ప్రేరణ ఉన్నట్లు సమాచారం. ప్రేరణ కూడా డే వన్ నుండి సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. ఇక నిఖిల్ మూడో స్థానంలో ఉన్నాడు. కాగా టైటిల్ ఫేవరేట్ అంటూ ప్రచారం అవుతున్న నిఖిల్ మూడో స్థానానికి పరిమితం కావడం ఊహించని పరిణామం. ఇక టేస్టీ తేజ నాలుగో స్థానంలో ఉన్నాడట.
Bigg boss telugu 8
ఐదో స్థానంలో అవినాష్, ఆరో స్థానంలో నబీల్, ఏడో స్థానంలో పృథ్వి, ఎనిమిదో స్థానంలో విష్ణుప్రియ ఉన్నారట. లేటెస్ట్ ఓటింగ్ రిజల్ట్ ప్రకారం విష్ణప్రియ, పృథ్విలలో ఒకరు ఎలిమినేట్ కావాలి. డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. వీరిద్దరూ బయటకు వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు అవినాష్, విష్ణుప్రియ, పృథ్విలలో ఇద్దరు ఎలిమినేట్ కానున్నారని సోషల్ మీడియా టాక్. టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన విష్ణుప్రియ ఓటింగ్ లో దారుణంగా వెనకబడింది.
అయితే ఇది అనధికారిక ఓటింగ్ మాత్రమే. స్టార్ మా ఓటింగ్ లెక్కలు వెల్లడించరు. ఈ క్రమంలో మీడియా పోల్స్ కి వ్యతిరేకమైన రిజల్ట్స్ వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి చివరి నిమిషం వరకు బిగ్ బాస్ ఇంటిని వీడేది ఎవరో అంచనా వేయడం కష్టమే..