మెగా పవర్ స్టార్ రాంచరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. సంక్రాంతికి జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ రెండు పాటలు, టీజర్ విడులయ్యాయి. టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే పాన్ ఇండియా స్థాయిలో రాణించాలి అంటే ఈ హంగామా సరిపోదు. దీనితో చిత్ర యూనిట్ నెమ్మదిగా ప్రొమోషన్స్ జోరు పెంచుతున్నారు.