ప్రతి 15 రోజులకోసారి పీరియడ్స్ ఎందుకొస్తాయి?

First Published | Apr 21, 2024, 10:45 AM IST

చాలా మందికి నెలకు మాత్రమే పీరియడ్స్ వస్తుంటాయి. కానీ కొంతమందికి మాత్రం ప్రతి 15 రోజులకోసారి మాత్రమే పీరియడ్స్ వస్తుంటాయి. ఇలా ఎందుకు అవుతుందో తెలుసా? 
 

periods

నెలకు రెండుసార్లు పీరియడ్స్  ఎందుకు? 

మహిళల జీవిత దశను 3 భాగాలుగా విభజిస్తారు. ఒకటి కౌమారదశ, పునరుత్పత్తి,పెరిమెనోపాజ్. ఈ మూడు దశల్లోనూ హార్మోన్ల అసమతుల్యత ఉంటుంది. దీనివల్లే ఇలా నెలకు 2 సార్లు పీరియడ్స్ వస్తుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

కౌమారదశలో హార్మోన్లు

కౌమారదశలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంటుంది. దీనివల్ల అపరిపక్వ హార్మోన్లతో పాటుగా రక్తహీనత సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. వీటివల్ల కూడా పీరియడ్స్ నెలకు రెండు సార్లు వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos


periods

పునరుత్పత్తి దశ 

ఈ సమయంలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే పునరుత్పత్తి దశలో హార్మోన్ల అసమతుల్యతతో పాటు, గర్భాశయంలో చిన్న చిన్న గడ్డలు ఏర్పడుతుంటాయి. వీటివల్ల నెలకు రెండు సార్లు పీరియడ్స్ వస్తుంటాయని నిపుణులు అంటున్నారు. ఈ గడ్డలను ఎండోమెట్రియం ఫోలికల్స్ అంటారు.

ఫైబ్రాయిడ్ లు 

కొంతమంది ఆడవారికి గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఉంటాయి. వీటివల్ల ఇలాంటి వారికి నెలకు రెండు సార్లు పీరియడ్స్ వస్తుంటాయి. ఇది కాకుండా నోటి గర్భనిరోధకాలను ఉపయోగించడం వల్ల కూడా ప్రతి 15 రోజులకోసారి పీరియడ్స్ వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. 
 

పెరిమెనోపాజ్ వయస్సు 

పెరిమెనోపాజ్ వయస్సులో ఈస్ట్రోజెన్ స్థాయిలు బాగా పడిపోతాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ లేకపోవడం వల్ల మిగిలిన హార్మోన్ల స్థాయి కూడా తగ్గడం మొదలవుతుంది. ఇది వారిలో ఒత్తిడిని పెంచుతుంది. అలాగే దీని వల్ల మహిళలకు నెలకు రెండుసార్లు రక్తస్రావం అవుతుంది. 

 15 రోజుల్లో పీరియడ్స్ రావడం వల్ల కలిగే నష్టాలు? 

ఆడవాళ్లకు నెలకు రెండు సార్లు పీరియడ్స్ రావడం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. దీనివల్ల అలసట, తలనొప్పి, బలహీనత, శ్వాస సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇది అండోత్సర్గమును కూడా ప్రభావితం చేస్తుంది. అలాగే  గర్భం దాల్చడంలో ఇబ్బందిని కలిగిస్తుంది.

click me!