బరువైన తొలడలతో బోలెడు లాభాలు.. ఆడవారి తొడల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..

First Published Apr 25, 2023, 11:31 AM IST

బరువైన, పెద్ద తొడలు ఆడవారికి అస్సలు ఇష్టం ఉండదు. వాటిని తగ్గించుకునేందుకు కొంతమంది ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ.. ఈ తొడలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. 

వృద్ధాప్యం వల్ల మహిళల శరీరంలోని కొన్ని భాగాలలో కొవ్వు ఎక్కువగా, వేగంగా పేరుకుపోతుంది. అయితే శరీరంలోని వివిధ భాగాలలో అదనపు కొవ్వు పేరుకుపోవడం మహిళలు, పురుషులు ఇద్దరిలో ఉంటుంది. కానీ స్త్రీలు , పురుషులలో కొవ్వు పెరగడంలో కొన్ని ఆసక్తికరమైన తేడాలున్నాయంటున్నారు నిపుణులు. మహిళల్లో హార్మోన్ల మార్పుల వల్ల తొడలు, తుంటి భాగంలో ఎక్కువ లావుగా కనిపిస్తుంది. పురుషుల్లో అయితే పొట్ట పెరుగుతుంది. కానీ తొడలు లేదా తుంటిపై పేరుకుపోయిన ఈ కొవ్వు ఆరోగ్యానికి చెడ్డదేం కాదన్న ముచ్చట మీకు తెలుసా? మహిళల తొడల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసుకుందాం.
 

పురుషుల కంటే మహిళలకు ఎక్కువ కొవ్వు ఉంటుంది

సైంటిఫిక్ అమెరికన్ ప్రకారం.. మహిళల శరీరంలో కొవ్వు శాతం పురుషుల కంటే ఎక్కువగా ఉంటుంది. 25 సంవత్సరాల వయస్సులో ఆరోగ్యకరమైన బరువు ఉన్న మహిళలు పురుషుల కంటే దాదాపు రెట్టింపు కొవ్వును కలిగుంటారు. పుట్టినప్పటి నుంచి ఆరు సంవత్సరాల వయస్సు వరకు బాలురు, బాలికలలో కొవ్వు కణాల సంఖ్య, పరిమాణం మూడు రెట్లు పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు సమాన పరిమాణంలో పెరగడం ప్రారంభమవుతుంది.

ఈ అధ్యయనంలో 35 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సున్న 2,816 మంది పురుషులు, మహిళలు పాల్గొన్నారు. వీరికి ఎలాంటి గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ లేవు. దీని ప్రకారం తొడలు బరువుగా ఉన్నవారిలో గుండెజబ్బులు, అకాల మరణం వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని తేలింది.

తొడ సార్కోఫెరెన్స్ 62 సెంటీమీటర్లు ఉంటే అత్యంత రక్షణాత్మకంగా పరిగణించబడుతుంది. 2009లో మరో అధ్యయనం జరిగింది. ఇందులో 60 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న 4,170 మంది పురుషులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. బరువు తక్కువగా ఉండేవారు గుండె జబ్బులతో బాధపడుతున్నారు.
 

అతిపెద్దవి తొడ ఎముకలు, కండరాలు

తొడ కండరాలు శరీరంలో అతిపెద్దవి. వీటి సాయంతోనే మన శరీర బరువును మెయింటైన్ చేస్తాం. తొడలు మీ గ్లూట్స్ నుంచి మీ మోకాళ్ల వరకు విస్తరించి ఉంటాయి. హెల్త్ హార్వర్డ్ ప్రకారం.. మీ తొడ బరువు పెరగడానికి ఈస్ట్రోజెన్ ప్రధాన కారణం. నిజానికి ఇది ఒక రకమైన హార్మోన్. మహిళల్లో కొవ్వు కణాలను పెంచడానికి ఈ హార్మోన్ పనిచేస్తుంది. దీనివల్ల మొటిమలు, తొడల చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఒక పరిశోధన ప్రకారం.. యుక్తవయస్సు ప్రారంభంలో స్త్రీ హార్మోన్ల స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. శరీరంలో కొవ్వు కణాల పరిమాణం ఎనిమిదేళ్ల వయస్సు నుంచి పురుషుల కంటే మహిళల్లో వేగంగా పెరగడం ప్రారంభిస్తుంది. బరువైన తొడల వల్ల ఆడవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

దిగువ శరీరాన్ని బలోపేతం చేస్తుంది

లింగం, వంశపారంపర్యం, వయస్సు, కొన్నిసార్లు ఆహారం కూడా మీ తొడలు హెవీగా ఉండటానికి కారణమవుతాయి. దీని వల్ల మీ శరీరంలో కొవ్వు కరగడానికి బదలు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది కింది శరీరాన్ని బలోపేతం చేస్తుంది.
 

heart health

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

యునైటెడ్ కింగ్ డమ్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, చర్చిల్ హాస్పిటల్ పరిశోధకులు ఒక నివేదికను ప్రచురించారు. దీని ప్రకారం.. శరీరంలోని ఇతర భాగాల కంటే తొడలు లేదా పిరుదుల బరువు ఎక్కువగా ఉండే వారికి డయాబెటిస్, గుండె జబ్బులు, అనేక ఇతర సమస్యలొచ్చే ప్రమాదం తక్కువగా ఉంది. 
 

గర్భధారణ సమయంలో సహాయపడుతుంది

గర్భధారణ సమయంలో మహిళల బరువు ప్రతి నెలా పెరగడం ప్రారంభమవుతుంది. అయితే పెద్ద తొడలు తమ శరీర బరువును మోయడానికి సహాయపడతాయి. అంతేకాదు మీరు బేబీబంప్ తో పెద్దగా ఇబ్బంది పడరు. 
 

డెలివరీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ సపోర్ట్

డెలివరీ సమయంలో హెవీ తొడలు ఎంతో సహాయపడతాయి. పెద్ద తొడలు సాధారణ డెలివరీకి సహాయపడతాయి. అలాగే గర్భధారణ తర్వాత మీ శరీరం బలహీనపడటం ప్రారంభించినప్పుడు.. అవి మీ దిగువ శరీరానికి మద్దతునిస్తాయి. భారీ తొడలు మీ శరీరాన్ని మోయడానికి కూడా సహాయపడతాయి.

తొడలు బలంగా ఉండాలంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలి?

మార్నింగ్ వాక్,  రన్నింగ్ లేదా సైక్లింగ్ తొడలను బలంగా ఉంచేందుకు సహాయపడతాయి. 

ప్రతిరోజూ కాసేపు స్క్వాట్స్ చేయడం వల్ల తొడల కండరాల కదలికకు దారితీస్తుంది. దీనివల్ల ఎక్కువ సేపు కూర్చున్న తర్వాత కూడా అవి దృఢంగా ఉంటాయి. 

స్టెప్ క్లైంబింగ్ మీ తొడలను కూడా బలంగా చేస్తుంది.

click me!