Anti Aging: ఇవి రోజూ తింటే.. మీ వయసు పదేళ్లు తగ్గడం ఖాయం..!

Published : Jun 12, 2025, 03:35 PM IST

మన వయసు పెరుగుతుంటే చర్మానికి కొల్లాజెన్, హైఅలురోనిక్ ఆమ్లం పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. దీని కారణంగానే మన ముఖంలో వృద్ధాప్య ఛాయలు కనపడతాయి.

PREV
17
యవ్వనంగా మారేదెలా?

వయసు పెరుగుతున్న కొద్దీ.. ముఖంలో ముడతలు రావడం చాలా సహజం. వయసు పెరిగిపోతుంటే, అందం తగ్గిపోతుంటే.. ఎవరికైనా బాధగానే ఉంటుంది. తగ్గిన అందాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది మేకప్ మీద ఆధారపడుతూ ఉంటారు. మేకప్ మన ముఖం ముడతలు బాగానే కవర్ చేస్తుంది.. కానీ, అది శాశ్వతం కాదు. మేకప్ తుడిచేస్తే పోతుంది. ఇక కాస్త డబ్బు ఎక్కువ ఉన్నారు ఖరీదైన ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు. కానీ, అవేమీ లేకుండానే మనం యవ్వనంగా మెరిసిపోవచ్చు. దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా...

27
యవ్వనంగా మార్చే చిట్కాలు..

మన వయసు పెరుగుతుంటే చర్మానికి కొల్లాజెన్, హైఅలురోనిక్ ఆమ్లం పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. దీని కారణంగానే మన ముఖంలో వృద్ధాప్య ఛాయలు కనపడతాయి.మనం కనుక రెగ్యులర్ గా కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం మొదలుపెడితే... ముఖంపై ముడతలు మాయం అవుతాయి. మన అందాన్ని పెంచే ఆహారాలు ఇవే..

37
ఎర్ర ద్రాక్ష

ఎర్ర ద్రాక్ష...

ఎర్ర ద్రాక్ష పండ్లు, లేదా తక్కువ మొత్తంలో రెడ్ వైన్ తీసుకుంటే అందంగా మెరిసిపోవచ్చు. వీటిలో రెస్వెరాట్రాల్ వంటి ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు.. ముఖంలో గ్లో తీసుకురావడంలో సహాయపడతాయి.

47
సిట్రస్ పండ్లు (నారింజ, నిమ్మకాయలు)

నారింజ ,నిమ్మకాయలు వంటి పండ్లలో నరింగెనిన్ ,హెస్పెరిడిన్ వంటి ఫ్లేవనాయిడ్లు ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.ఈ సిట్రస్ పండ్లు చర్మానికి మంచివి. సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఈ రకమైన పండ్లు చర్మం స్థితిస్థాపకతను పెంచుతాయి. దీంతో యవ్వనంగా కనిపిస్తారు.

57
యాపిల్

యాపిల్స్‌లో క్వెర్సెటిన్ ఉంటుంది, ఇది ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఆపిల్ తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది. ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. యాపిల్స్ లో ఉండే విటమిన్లు, ఖనిజాలు ముడతలను తగ్గించడంతో పాటు, డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించడంలో సహాయం చేస్తాయి.

67
డార్క్ చాక్లెట్‌...

మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టపడితే, ఇది శుభవార్త. ఇందులో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి, ఇవి మెదడు, రక్త ప్రసరణ,రక్తపోటుకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో అధిక కోకో కంటెంట్ ఉండేలా చూసుకోండి. డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షిస్తుంది. ఇది చర్మాన్ని కూడా అందంగా చేస్తుంది.

77
బెర్రీలు..

పండ్లలోని సహజ చక్కెరలు,ఇతర ముఖ్యమైన పోషకాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. బెర్రీలు విటమిన్ సి కి గొప్ప మూలం, దీనిని తరచుగా యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో ఉపయోగిస్తారు.బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, బ్లాక్‌బెర్రీస్ ,రాస్ప్బెర్రీస్ వంటి పండ్లు చర్మ వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. అవి గుండె ఆరోగ్యానికి మంచివి.మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్‌లను కూడా నివారిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories