Telugu

Beauty Tips: శనగపిండి vs పసుపు.. ముఖానికి ఏది మంచిది ?

Telugu

శనగపిండి ప్రయోజనాలు

శనగ పిండి సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. చర్మం నుండి మొండిగా ఉన్న మురికిని తొలగిస్తుంది. ఇందులో ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలుండటం వల్ల చర్మం పైన ఉన్న మృతకణాల పొరను తొలగిస్తుంది.

Image credits: Freepik
Telugu

ఇలా వాడితే..

శనగపిండిని క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జిడ్డును తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: pinterest
Telugu

పసుపు ప్రయోజనాలు

పసుపులో ఉండే అలెర్జీ నిరోధక లక్షణాలు మచ్చలు, మొటిమలను నయం చేయడంలో సహాయపడతాయి. పసుపు, తేనె కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది, మచ్చలు తగ్గుతాయి.

Image credits: freepik
Telugu

వృద్ధాప్యానికి చెక్

పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడతాయి, అలాగే వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. పసుపు  చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: social media
Telugu

ఏది బెస్ట్?

మీకు జిడ్డు చర్మం ఉంటే లేదా డీప్ క్లెన్సింగ్ అవసరమైతే శనగపిండి మంచి పరిష్కారం. శనగ పిండి చాలా మంచి క్లెన్సర్ అయినందున చర్మం నుంచి జిడ్డును నియంత్రిస్తుంది.

Image credits: pinterest
Telugu

పసుపును ఇలా వాడితే..

మొటిమలు, మచ్చలు, నల్లటి మచ్చలు, వాపు వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి పసుపు ఉపయోగించవచ్చు. పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి, 

Image credits: Social Media
Telugu

మొటిమలు, ముడతలకు చెక్

పెరుగు, శనగపిండి, పసుపు మూడు కలిసి ప్యాక్‌లా చేసుకుని ముఖానికి, చర్మానికి పట్టించడం వల్ల సౌందర్యం పెరుగుతుంది. చర్మంపై చేరే బ్యాక్టీరియాను నాశనం చేసి, చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది.

Image credits: Freepik

High Cholesterol: ఈ లక్షణాలు మీలో ఉంటే.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే !

Skin Care: ఈ టిప్స్ చాలు.. వర్షాకాలంలో నిగనిగలాడే చర్మం మీ సొంతం..

Fatty Liver: ఫ్యాటీ లివర్ ను తగ్గించే సూపర్ డ్రింక్స్ ఇవే..

Jeera Water : ఉదయాన్నే జీరా నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?