ముఖం అందంగా, కాంతివంతంగా ఉండడానికి అమ్మాయిలు చేయని ప్రయత్నాలు ఉండవు. అందం కోసం రకరకాల బ్యూటీ ప్రోడక్టులు వాడుతూనే ఉంటారు. కానీ ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో కూడా ముఖాన్నిఅందంగా మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ చూద్దాం.
బంగాళదుంప చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్ సి, బి, ఇతర ఖనిజాలు ముఖంపై మచ్చలను తగ్గించడానికి, చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి సహాయపడతాయి. ముఖానికి బంగాళాదుంపను ఎలా వాడాలి? దీంతో ఏ పదార్థాలు కలిపి ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
26
బంగాళాదుంప, నిమ్మరసం ఫేస్ ప్యాక్
బంగాళదుంప, నిమ్మరసం కలిపిన మిశ్రమం.. మొటిమలు, గాయాల మచ్చలు, ఇతర సమస్యలకు మంచి పరిష్కారం. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ చర్మాన్ని తెల్లగా చేసే గుణాలను కలిగి ఉంటుంది.
బంగాళదుంప రసం 1/2 టీస్పూన్, నిమ్మరసం 1/2 టీస్పూన్ తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని దూదితో ముఖం, మెడకి రాసుకోవాలి. 15-20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
36
బంగాళదుంప, తేనె ఫేస్ ప్యాక్
బంగాళదుంప, తేనె మిశ్రమం చర్మానికి తేమను అందిస్తుంది. మృదువుగా చేస్తుంది. సహజ కాంతినిస్తుంది. తేనెలో బాక్టీరియా నిరోధక, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
1 టేబుల్ స్పూన్ బంగాళాదుంప రసానికి 1 టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకి రాసి మెల్లగా మసాజ్ చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
బంగాళదుంప, పసుపు మిశ్రమం చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ కోసం 1 టేబుల్ స్పూన్ బంగాళదుంప రసంలో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకి రాసుకోవాలి. 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి 1-2 సార్లు చేస్తే ముఖం బంగారంలా మెరిసిపోతుంది.
56
శనగపిండి, బంగాళదుంప, పసుపు ఫేస్ ప్యాక్
శనగపిండి మంచి స్క్రబ్‌గా పనిచేస్తుంది. ఇది చర్మంలోని అదనపు నూనెను, మృత కణాలను తొలగిస్తుంది. చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ కోసం 2 టేబుల్ స్పూన్ల బంగాళదుంప రసం, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, చిటికెడు పసుపు తీసుకోవాలి. అన్ని పదార్థాలను కలిపి గట్టి పేస్ట్‌లా చేయాలి. కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకోవచ్చు. ఈ పేస్ట్‌ని ముఖం, మెడకి రాసి 20-25 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే చర్మం శుభ్రంగా, కాంతివంతంగా మారుతుంది.
66
డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే?
కళ్ల కింద నల్లటి వలయాలు, వాపు తగ్గడానికి బంగాళాదుంప చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, చల్లబరిచే లక్షణాలు దీనికి సహాయపడతాయి. ఫ్రిజ్‌లో ఉంచిన చల్లటి బంగాళదుంపను పలుచటి ముక్కలుగా కోయాలి. ఈ ముక్కలను కళ్ల కింద 15-20 నిమిషాలు ఉంచాలి. లేదా బంగాళాదుంప రసం తీసుకుని దూదిని అందులో ముంచి.. కళ్ల కింద ఉంచాలి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ లేదా రోజు మార్చి రోజు చేస్తే డార్క్ సర్కిల్స్, వాపు తగ్గుతాయి.