White Hair: ఉసిరికాయ పొడిలో ఇదొక్కటి కలిపి రాసినా, తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారడం పక్కా..!

Published : Jun 12, 2025, 10:53 AM IST

ఆయుర్వేదం మన జీవితంపై చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆయుర్వేదంతో అవ్వనిది అంటూ ఏదీ లేదు. దీని సహాయంతో మనం జుట్టును నల్లగా మార్చడమే కాదు,జుట్టును మరింత బలంగా, మందంగా, పట్టుకుచ్చులా మెరిసేలా చేసుకోవచ్చు.

PREV
16
grey hair

వయసు 30 దాటింది అంటే చాలు.. మెల్లగా తెల్ల వెంట్రుకలు కనిపించడం మొదలుపెడతాయి. ఈ మధ్య అయితే.. అంతకంటే చిన్న పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. ఇలా వైట్ హెయిర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. సరైన పోషకాహారం తినకపోవడం, కాలుష్యం, కెమికల్స్ ఉండే ఉత్పత్తులు వాడటం..కూడా చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి కారణం అవుతున్నాయి. కానీ, ఈ గ్రే హెయిర్ రావడానికి ఎవరికీ నచ్చదు. ఎంత సేపటికీ వాటిని కనిపించకుండా ఎలా కవర్ చేయాలా అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. దాని కోసం మార్కెట్లో దొరికే హెయిర్ డై , కలర్, హెన్నా లాంటివి వాడేస్తూ ఉంటారు.కానీ.. అవి మహా అంటే వారం రోజులు జుట్టును నల్లగా ఉంచుతాయి. తర్వాత మళ్లీ కలర్ పోతుంది. అంతేకాదు.. ఈ కెమిక్సల్ ఉండే హెయిర్ కలర్స్ వాడితే జుట్టు మరింత డ్యామేజ్ అవుతుంది. బలహీనంగా మారుతుంది. అలా కాకుండా.. సహజంగా మన తెల్ల జుట్టును మళ్లీ పూర్తిగా నల్లగా మార్చేయవచ్చు. ఇప్పుడిప్పుడే తెల్ల వెంట్రుకలు రావడం మొదలుపెట్టిన వారికి ఈ రెమిడీ చాలా బాగా పని చేస్తుంది. మరి, అదెలాగో తెలుసుకుందామా..

26
Hair colour

ఆయుర్వేదం మన జీవితంపై చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆయుర్వేదంతో అవ్వనిది అంటూ ఏదీ లేదు. దీని సహాయంతో మనం జుట్టును నల్లగా మార్చడమే కాదు,జుట్టును మరింత బలంగా, మందంగా, పట్టుకుచ్చులా మెరిసేలా చేసుకోవచ్చు.

36
1.ఉసిరి-బ్రింగ్ రాజ్ నూనెతో తెల్ల జుట్టుకు చెక్...

ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఉసిరికాయ మన తెల్ల జుట్టు సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది. అంతేకాదు.. బ్రింగ్ రాజ్ కూడా తెల్ల జుట్టు సమస్యను తగ్గిస్తుంది. మనకు ఈ వైట్ హెయిర్ రావద్దు అంటే.. మెలనిన్ ఉత్పత్తి సరిగా జరగాలి. అది బృంగ్ రాజ్ తో సాధ్యం అవుతుంది. ఈ రెండూ కలిపి నూనె తయారు చేసి జుట్టుకు రాయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ జుట్టు నల్లగా మారుతుంది.

46
ఉసిరి నూనె

ఈ నూనె ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...

ఉసిరికాయ పొడి - 2 టీస్పూన్లు

భ్రింగ్‌రాజ్ పొడి - 2 టీస్పూన్లు

కొబ్బరి నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఇక్కడ మీరు కావాలంటే కొబ్బరి నూనెకు బదులు నువ్వుల నూనె వాడొచ్చు.

ముందుగా, గ్యాస్ మీద పాన్ ఉంచి వేడి చేయండి.ఇప్పుడు దానికి నూనె, ఉసిరి పొడి, భ్రింగ్‌రాజ్ పొడి వేసి తక్కువ మంట మీద 5-7 నిమిషాలు మరిగించాలి. ఈ నూనె మరిగిన తర్వాత ఆ నూనెను చల్లబరచాలి. దీనిని మీరు ఏదైనా గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ నూనెను ఎప్పుడు కావాలి అంటే అప్పుడు.. కొద్దిగా వేడి చేసి జుట్టుకు, తలకు రాసి మసాజ్ చేస్తే సరిపోతుంది. రాత్రిపూట ఈ నూనెను రాసి.. మరుసటి రోజు ఉదయాన్నే.. షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు ఈ నూనె వాడినా.. తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది.

56
కరివేపాకు నూనెతో తెల్ల జుట్టు సమస్యకు చెక్..

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కరివేపాకుతో జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడతాయి.

కరివేపాకు నూనె ఎలా తయారు చేయాలి?

కరివేపాకు- 10-15

కొబ్బరి నూనె - 4 టేబుల్ స్పూన్లు

ముందుగా, ఒక పాన్ తీసుకొని దానిలో కొబ్బరి నూనెను వేడి చేసి, తరువాత కరివేపాకు వేయండి.ఆకులు నల్లగా మారే వరకు మరిగించాలి.ఎందుకంటే అవి వాటి పోషకాలను నూనెలోకి విడుదల చేస్తాయి.తర్వాత నూనెను చల్లపరచాలి. తర్వాత కంటైనర్ లో స్టోర్ చేయాలి. తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు తలకు,జుట్టుకు రాసి మంచిగా మసాజ్ చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు ఈ నూనె రాసినా తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది.

66
హెన్నా-ఇండిగో నేచురల్ హెయిర్ డై

హెన్నా జుట్టును కండిషన్ చేస్తుంది.బలపరుస్తుంది, ఇండిగో సహజ రంగుగా పనిచేస్తుంది. తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చడానికి సహాయపడుతుంది.

హెన్నా పౌడర్ - 4 టీస్పూన్లు

ఇండిగో పౌడర్ - 4 టీస్పూన్లు

గూస్బెర్రీ పౌడర్ - 1 టీస్పూన్

కాఫీ పౌడర్ - 1 టీస్పూన్

నీరు - అవసరమైన విధంగా

హెన్నా-ఇండిగో డైని ఎలా తయారు చేయాలి?

రంగును తయారు చేయడానికి, మొదట హెన్నా పౌడర్‌ను వేడి నీటితో కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఆపై 4-6 గంటలు అలాగే ఉంచండి.

దీని తర్వాత, మీ జుట్టును కడగడానికి 2 గంటల ముందు మీ జుట్టుకు హెన్నా పేస్ట్ అప్లై చేసి, ఆపై మీ జుట్టును కడగాలి.

అదేవిధంగా, ఇండిగో పౌడర్‌ను వేసి, వేడి నీటితో కలిపి మందపాటి పేస్ట్ లాగా చేసి, ఆపై మీ జుట్టుకు అప్లై చేయండి. రెండు గంటల తర్వాత హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories