విశాఖ ఉత్సవ్: పక్కా నాన్ లోకల్, దేవిశ్రీ ప్రసాద్ పాటకు పంట

First Published Dec 20, 2019, 5:03 PM IST

విశాఖ ఉత్సవ్ ప్రారంభానికి ముందే వివాదానికి దారితీసింది. తెలంగాణకు చెందిన దేవిశ్రీ ప్రసాద్ తో  మ్యూజికల్ ఆర్కెస్ట్రాను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడమే ఈ వివాదానికి కారణమయ్యింది.  

విశాఖపట్నం: విశాఖ ఉత్సవ్ మీద వివాదం చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి. లోకల్, నాన్ లోకల్ వివాదం రగులుకునే ప్రమాదం ఉంది. ఈ నెల 28వ తేదీ నుంచి రెండు రోజుల పాటు విశాఖ ఉత్సవ్ జరగనుంది. స్టాళ్ల నిర్వహణ, విశాఖ వైభవం, విశాఖ అందాలు, పరిసర ప్రాంతాల్లోని దేవాలయ నిర్మాణాల నుమానులు, సెంట్రల్ పార్కులో ఫ్లవర్ షో వంటివాటి విషయంలో అధికారులు తలమునకలై ఉన్నారు.
undefined
విశాఖ ఉత్సవ్ లో మ్యాజికల్ ఆర్కెస్ట్రాను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ద్వారా నిర్వహించాలని చూస్తున్నట్లు సమాచారం. ఆయన సత్యం కుమారుడనే విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ తెలంగాణకు చెందినవారు కావడంతో స్థానికులు తీవ్రమైన అభ్యంతరం తెలిపే అవకాశాలున్నట్లు స్థానికంగా మీడియాలో వార్తలు వచ్చాయి.
undefined
స్థానిక కళాకారులను విస్మరించి, దేవిశ్రీ ప్రసాద్ కు పట్టం కడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు రెమ్యునరేషన్ కింద రూ. 70 లక్షలు ముట్టజెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తం చెల్లించి స్థానికేతరుడైన దేవిశ్రీ ప్రసాద్ ను రప్పించాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
undefined
గత విశాఖ ఉత్సవాల మాదిరిగానే ఈసారి ఉత్సవాలను కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయనే మాట వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు చెందిన గంటా శ్రీనివాస రావు మంత్రిగా ఉండడం వల్ల ఆయన చెప్పినట్లే అన్నీ చేయాల్సి వచ్చిందని అంటున్నారు. స్థానిక కళాకారులను విస్మరించి హైదరాబాదుకు చెందిన రాక్ మ్యూజిక్ బ్యాండ్ ను తెప్పించి గంటా విమర్శలను ఎదుర్కున్నారు.
undefined
ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస రావు కూడా గంటా బాటలోనే నడుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవలి భిమిలీ ఉత్సవంలో కూడా అదే కనిపించింది. పెద్ద మొత్తం చెల్లించి దేవిశ్రీ ప్రసాద్ బృందాన్ని రప్పించే కన్నా రోషన్ లాల్ వంటి స్థానిక ఆర్కెస్ట్రాలకు అవకాశం ఇస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకు లక్ష రూపాయలు వెచ్చిస్తే సరిపోతుందని అంటున్నారు. అయితే, ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి నిర్ణయాలు ఏవీ జరగలేదని అధికారులు అంటున్నారు.
undefined
click me!