40 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు చేతులు కలిపారు. ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా రాజకీయాల్లో ఈ పరిణామం ఆసక్తిని కలిగిస్తుంది.
విశాఖపట్టణం:ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో చిరకాల రాజకీయ ప్రత్యర్థులు చేతులు కలిపారు. ఎప్పుడూ ఉప్పు, నిప్పు మాదిరిగా కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులు చేతులు కలిపారు.
శుక్రవారంనాడు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇంటికి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ రావు వచ్చారు. వీరిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నప్పటికి వీరిద్దరూ ప్రత్యర్థులుగా కొనసాగారు.అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుండి జనసేన టిక్కెట్టును కొణతాల రామకృష్ణ దక్కించుకున్నారు.
undefined
also read:భారత జాగృతి సమితి, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం: జీవో నెంబర్ 3 ఏముంది?
గత మాసంలోనే వైఎస్ఆర్‌పీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు దాడి వీరభద్రరావు. అనకాపల్లి అసెంబ్లీ స్థానంలో దాడి వీరభద్రరావు తనయుడు రత్నాకర్ ను బరిలోకి దింపాలని భావించారు.కానీ, తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తుంది. ఈ పొత్తులో భాగంగా అనకాపల్లి నుండి కొణతాల రామకృష్ణను జనసేన బరిలోకి దింపింది. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో కొణతాల రామకృష్ణ ఇవాళ భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో తనకు సహకరించాలని కొణతాల రామకృష్ణ దాడి వీరభద్రరావును కోరారు. ఇందుకు వీరభద్రరావు సానుకూలంగా స్పందించారు.
also read:హైద్రాబాద్ మెట్రో రైలు రెండో దశ: ఎక్కడి నుండి ఎక్కడి వరకు, ఎప్పుడు పూర్తవుతాయంటే?
తెలుగుదేశం సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు గారిని వారి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన అనకాపల్లి జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి శాసనసభ అభ్యర్థి కొణతాల రామకృష్ణ గారు. pic.twitter.com/gEdkaKpg0V
— Konathala Ramakrishna (@KonathalaForAKP)సుమారు 40 ఏళ్ల పాటు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణలు కలుసుకోవడం రాజకీయాల్లో ఆసక్తి పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
also read:ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 100 తగ్గింపు: మోడీ ప్రకటన
తన అనుచరులను దాడి వీరభద్రరావు కొణతాల రామకృష్ణకు పరిచయం చేశారు.ఇద్దరు నేతలు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తమ మధ్య రాజకీయ విభేదాలు మాత్రమే ఉన్నాయని దాడి వీరభద్రరావు చెప్పారు. తమ మధ్య వ్యక్తిగత వైరం లేదని దాడి వీరభద్రరావు స్పష్టం చేశారు.