విశాఖలో ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు: గాలింపు చర్యలు

By narsimha lodeFirst Published Apr 3, 2024, 7:48 AM IST
Highlights

చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించడం లేదు. దీంతో  కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

విశాఖపట్టణం: చేపల వేటకు వెళ్లిన  ఆరుగురు మత్స్యకారుల నుండి ఎలాంటి సమాచారం లేకపోవడంతో  కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగురు మత్య్సకారుల కోసం  గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో చోటు చేసుకుంది.

విశాఖపట్టణం చేపలరేవు నుండి ఆరుగురు మత్స్యకారులు  చేపల వేటకు వెళ్లారు.సోమవారం నాడు రాత్రి తర్వాత మత్స్యకారుల నుండి  కుటుంబ సభ్యులకు సమాచారం రాలేదు.దీంతో  బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.  ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే  ఆచూకీ గల్లంతైన  మత్స్యకారుల కోసం  అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఫైబర్ బోటులో  కారి చిన్నారావు,  కారి నరేంద్ర,  వాసుపల్లి అప్పన్న, కారి చిన సత్తెయ్య, మైలపల్లి మహేష్,  వాసుపల్లి అప్పన్న ఈ నెల 1వ తేదీన  చేపల వేటకు బయలు దేరారు. సోమవారం నాడు రాత్రి  కుటుంబ సభ్యులతో మత్స్యకారులు ఫోన్ లో మాట్లాడారు. ఈ నెల  2వ తేదీన   మత్స్యకారులు  ఒడ్డుకు చేరుకోవాల్సి ఉంది.  అయితే  మత్స్యకారుల నుండి సమాచారం రాలేదు. ఒడ్డుకు చేరలేదు. దీంతో మత్స్యకారులు మత్స్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ మేరకు కోస్టుగార్డుకు చెందిన రెండు నౌకలు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.  

మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపును  మరింత ముమ్మరం చేస్తామని  అధికారులు ప్రకటించారు. మంగళవారం నాడు సాయంత్రం వరకు  మత్స్యకారుల ఆచూకీ లభ్యం కాలేదు. ఇవాళ ఉదయం నుండి మత్స్యకారుల ఆచూకీ  కోసం  గాలింపు చర్యలు ప్రారంభించనున్నారు. 

 

click me!