విశాఖపట్టణంలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా: ఏపీ రాజధానిపై జగన్ సంచలనం

Published : Mar 05, 2024, 01:18 PM IST
విశాఖపట్టణంలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా: ఏపీ రాజధానిపై జగన్ సంచలనం

సారాంశం

విశాఖపట్టణం రాజధాని విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  ఇవాళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

విశాఖపట్టణం:ఎన్నికల తర్వాత తాను విశాఖపట్టణంలోనే ఉంటానని ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఈ దఫా  విశాఖపట్టణంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని  జగన్ ప్రకటించారు.

చెన్నై, హైద్రాబాద్ లకు ధీటుగా  విశాఖపట్టణాన్ని అభివృద్ది చేస్తానని  జగన్ చెప్పారు.విశాఖ అభివృద్దిపై పదేళ్ల ప్రణాళిక ఉందని ఆయన తెలిపారు.విశాఖపట్టణం అభివృద్దికి ఆచరణాత్మక ప్రణాళిక అవసరమన్నారు.విశాఖపట్టణం అభివృద్దిని ఒక్క ప్రభుత్వమే చేయలేదన్నారు.విశాఖపట్టణం అభివృద్దికి కేంద్రం సహకారం అవసరమని  జగన్ చెప్పారు.విశాఖపట్టణం అభివృద్దికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య నమూనా అవసరమన్నారు.సమిష్టిగా కృషి చేస్తేనే చెన్నై, హైద్రాబాద్ కు ధీటుగా విశాఖపట్టణం మారుతుందన్నారు.విజన్ వైజాగ్  పేరిట 28 పేజీల సంపుటిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  మంగళవారంనాడు  విశాఖపట్టణంలో విడుదల చేశారు.

also read:టీడీపీలో చేరుతా:వైఎస్ఆర్‌సీపీకి గుమ్మనూరు జయరాం రాజీనామా

అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టాలన్నారు. అయితే రానున్న 20 ఏళ్లలో ఈ ఖర్చు  రూ. 10 నుండి  15 లక్షల కోట్లు అవుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. విశాఖపట్టణానికి బేసిక్ ఇన్ ఫ్రా ఉందన్నారు.కాస్త మెరుగులు దిద్దితే  విశాఖపట్టణం మంచి రాజధాని అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

also read:కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవినీతి బంధం: సంగారెడ్డి బీజేపీ సభలో మోడీ

అమరావతి సహా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని జగన్ స్పష్టం చేశారు.అందుకే అమరావతిని శాసనరాజధానిగా ప్రకటించినట్టుగా ఆయన చెప్పారు.కర్నూల్ ను న్యాయ రాజధానిగా ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీ వర్శిటీ ఇక్కడికి రావాలని జగన్ కోరారు. అత్యాధునిక సాంకేతికపై ఇక్కడ బోదన జరగాల్సిన అవసరాన్ని జగన్ నొక్కి చెప్పారు.

also read:హైద్రాబాద్‌లో ఏవియేషన్ సెంటర్‌తో ఉపాధి: సంగారెడ్డిలో రూ. 7,200 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించిన మోడీ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా నిర్మాణం అవుతుందన్నారు.భోగాపురానికి ఆరులేన్ల బీచ్ కారిడార్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. విశాఖలో ఐకానిక్ సచివాలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉద్యోగులు విశాఖకు వస్తే మొత్తం మార్పు కనిపిస్తుందని జగన్ చెప్పారు.అప్పుడు దేశం మొత్తం ఏపీ వైపే చేస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం