వేలానికి ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన కానుకలు... కోట్లు పలుకుతున్న అథ్లెట్ల రాకెట్స్, జావెలిన్ త్రో...

First Published Sep 18, 2021, 10:31 AM IST

టోక్యో ఒలింపిక్స్‌లో, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లు, ప్రధాని నరేంద్ర మోదీకి తమ ఎక్విప్‌మెంట్స్‌ను కానుకగా ఇచ్చారు. నీరజ్ చోప్రా స్వర్ణం సాధించేందుకు ఉపయోగించిన జావెలిన్ త్రో, పీవీ సింధు కాంస్యం గెలిచిన మ్యాచ్‌లో వాడిన షెటిల్ రాకెట్... భారత ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇచ్చారు. 

నీరజ్ చోప్రా, పీవీ సింధులతో పాటు పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన సుమిత్ అంటిల్ జావెలిన్ త్రో, అవనీ లేఖరా వేసుకున్న టీ షర్ట్... ఇలా భారత ప్రధాని అందుకున్న కానుకలను ఆన్‌లైన్ ద్వారా వేలానికి పెట్టింది ప్రభుత్వం. 

నీరజ్ చోప్రా జావెలిన్ త్రో, సుమిత్ అంటిల్ జావెలిన్ త్రోలకి బేస్ ప్రైజ్‌ రూ.కోటి రూపాయలు కాగా... షూటర్ అవనీ లేఖరా వేసుకున్న టీ షర్టుకి బేస్ ప్రైజ్‌ రూ.15 లక్షలు, బాక్సర్ లవ్‌లీనా బాక్సింగ్ గ్లవ్స్‌కి రూ.80 లక్షలుగా నిర్ణయించారు. అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్ల ఆటోగ్రాఫ్ చేసిన కండువాకి రూ.90 లక్షల బేస్ ప్రైజ్ నిర్ణయించారు. 

వీటిలో ఇప్పటికే పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ కృష్ణ నగర్, రెండు మెడల్స్ సాధించిన యతిరాజ్ వాడిన బ్యాడ్మింటన్ రాకెట్లకు ఇప్పటికే రూ.10 కోట్లకు పైగా బిడ్ రావడం విశేషం...  కృష్ణ నగర్ రాకెట్‌‌కి బేస్ ప్రైజ్ రూ.80 లక్షలు కాగా, యతిరాజ్ రాకెట్‌కి రూ.50 లక్షలు...

ఒలింపిక్స్‌లో ఫెన్సింగ్‌లో భారత్ తరుపున ప్రాతినిథ్యం వహించిన మొట్టమొదటి మహిళా అథ్లెట్‌గా రికార్డు క్రియేట్ చేసిన సీఏ భవానీ దేవీ ఉపయోగించిన ఫెన్స్‌కి బేస్ ప్రైజ్ రూ.60 లక్షలుగా నిర్ణయించగా, ఇప్పటికే రూ.10 కోట్లకు పైగా బిడ్ వచ్చింది. 

భారత ప్రభుత్వం, సంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధర్వంలో ఈ ఈ-వేలం నిర్వహిస్తున్నాం. ఇందులో భారత ప్రధానికి వచ్చిన బహుమతులు, మెమొంటోలు వేలానికి ఉంటాయి. భారత టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లు ఇచ్చిన బహుమతులతో పాటు అయోధ్య రామ మందిరం మోడల్స్‌తో పాటు పెయింటింగ్స్ వంటి ఎన్నో వేలానికి ఉంటాయి...’ అని ప్రకటనలో తెలిపింది మంత్రిత్వ శాఖ...

ఈ వేలంలో 1300 వస్తువులు వేలానికి ఉండగా, వీటి అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని నమమి గంగా మిషన్‌ని ఉపయోగిస్తారు. అక్టోబర్ 7 వరకూ ఈ వేలం జరుగుతుందని, ఆసక్తి ఉన్నవారు ఈమెయిల్ ద్వారా బెడ్ వేయవచ్చిన తెలియచేశారు అధికారులు..

click me!