Dhoni's Parents చెపాక్‌లో ధోనీ పేరెంట్స్.. ఇదే ఆఖరి ఐపీఎల్ అని సిగ్నల్ ఇచ్చేశాడా?

MS Dhoni's Parents Watch CSK vs DC IPL 2025 : సాధారణంగా ధోనీ క్రికెట్ ఆడుతుంటే అతడి తల్లిదండ్రులు ఎప్పుడూ మైదానంలో కనిపించిన దాఖలాల్లేవు. కానీ చెన్నైలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో తొలిసారి వాళ్లు కనిపించారు. దాంతో ఇది ధోనీ చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాలు మొదలయ్యాయి. 

MS ధోనీ తల్లిదండ్రులు

తొలిసారి ధోనీ తల్లిదండ్రులు ఐపీఎల్ మ్యాచ్ లో ప్రేక్షకుల గ్యాలరీలో కనిపించారు. తమ కుమారుడు ఆడుతుంటే కళ్లారా వీక్షించారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ లో పరాజయం పాలైంది. ఆడిన 3 మ్యాచ్‌లలో ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి 2 మ్యాచ్‌లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇది CSK అభిమానులకే కాకుండా ధోనీ అభిమానులకు కూడా నిరాశ కలిగించింది.

తొలిసారి వచ్చారు

ప్రస్తుతం చెన్నై కోట అని పిలిచే ఎంఏ చిదంబరం స్టేడియంలో  చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ చూడటానికి సినిమా ప్రముఖులు రావడం సాధారణం. కానీ, ధోనీ తల్లిదండ్రులు తొలిసారిగా మ్యాచ్ చూడటానికి వచ్చారు. ఇదే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది.


MS ధోనీ కూతురు

ఎంఎస్ ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకి సింగ్ తొలిసారి మైదానానికి రావడంతో ధోనీకి ఇదే చివరి సీజన్ కావొచ్చు అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంఎస్ ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకి సింగ్ ఇద్దరూ చెపాక్ వచ్చి తన కొడుకు ధోనీ ఆడుతుంటే చూసి సంతోషించారు. కొన్ని సీజన్లను మినహాయిస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ బ్రాండ్‌గా ఉన్నాడు. ధోనీ కారణంగా CSK జట్టు కూడా తమకు గుర్తింపు తెచ్చుకుంది. ఈ మ్యాచ్ లో ధోనీ కూతురు కూడా సందడి చేసింది.

43 ఏళ్ల ధోనీ

ప్రస్తుతం ధోనీకి  43 ఏళ్లు. 2008 నుంచి ఐపీఎల్ సిరీస్‌లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు ధోనీ 268 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో మొత్తం 5293 పరుగులు చేశాడు. అంతేకాకుండా, అత్యధికంగా 84* పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ధోనీ 2008 నుంచి 2025 వరకు 262 మ్యాచ్‌లు ఆడాడు.  

రిటైర్మెంట్

CSK జట్టు తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా, ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా CSK జట్టు 5 సార్లు ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ధోనీ వయసు కారణంగా ప్రతి సీజన్‌లోనూ అతను ఎప్పుడు రిటైర్ అవుతాడనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు అతని నాన్న, అమ్మ CSK, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ చూడటానికి రావడం ఊహకు మరింత బలాన్నిచ్చింది.

Latest Videos

click me!