Jaat Collections: `జాట్` డే 3 కలెక్షన్లు, సన్నీ డియోల్ మూవీకి సీన్‌ రివర్స్

Jaat 3 Days Collections:   సన్నీ డియోల్ హీరోగా నటించిన'జాట్' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కాస్త తగ్గినా, మూడో రోజు మాత్రం బాగా కలెక్ట్ చేసింది. మాస్‌ ఆడియెన్స్ కి ఎక్కడంతో నెమ్మదిగా వసూళ్లు పుంజుకుంటున్నారు. మూడో రోజు భారీగా వసూళ్లు పెరిగాయి. మరి మూడు రోజుల్లో ఈ మూవీ ఎంత వసూలు చేసిందంటే?

jaat movie day 3 collections sunny deol film box office earnings in telugu arj
Jaat Collections

Jaat 3 Days Collections:  'జాట్' కలెక్షన్లు మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు 26.32 శాతం పడిపోయాయి. కానీ మూడో రోజు మళ్లీ పుంజుకుంది.

jaat movie day 3 collections sunny deol film box office earnings in telugu arj
Jaat Collections

ట్రేడ్ ట్రాకర్ వెబ్‌సైట్ Sacnilk.com రిపోర్ట్ ప్రకారం 'జాట్' మూడు రోజుల్లో దాదాపు 26.50 కోట్లు కలెక్ట్ చేసింది.ఇది గ్రాస్‌ కలెక్షన్లు.


Jaat Collections

ఈ రిపోర్ట్ ప్రకారం సినిమా మూడో రోజు దాదాపు 10 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది రెండో రోజు కంటే 42.85 శాతం ఎక్కువ. మొదటి రోజు కంటే 5.26 శాతం ఎక్కువ.

Jaat Collections

రిపోర్ట్స్ ప్రకారం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'జాట్' సినిమాను దాదాపు 100 కోట్లతో నిర్మించారు.

Jaat Collections

సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో 32 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ మూవీకి కాస్త డల్‌గానే కలెక్షన్లు ఉన్నాయి. మూడు రోజుల్లో అక్కడ సుమారు ఐదు కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తుంది. 

Jaat Collections

సన్నీ డియోల్‌ గత మూవీ `గదర్‌ 2` బాక్సాఫీసుని షేక్‌ చేసింది.  ఇది ఫైనల్‌గా రూ.691కోట్లు వసూలు చేసింది. మొదటి రోజే ఏకంగా రూ.40కోట్లు రాబట్టింది. కానీ `జాట్‌` మూడు రోజుల్లో కూడా నలభై కోట్ల మార్క్ ని దాటలేదు. ఆదివారం కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. సోమవారం నుంచి సినిమా నిలబడుతుందా? లేదా అనేదాని మీద ఈ మూవీ రిజల్ట్ ఆధార పడి ఉంది. టీమ్‌ వంద కోట్లు ఆశిస్తున్నారు. కానీ ఇలానే కొనసాగితే మాత్రం కష్టమనే చెప్పాలి. ఈ మూవీ వంద కోట్లు వసూలు చేసినా ఫెయిల్యూర్‌ జాబితాలోకే వెళ్తుంది. 

Jaat Collections

'జాట్' సినిమాలో సన్నీ డియోల్ మొదటిసారి 'పుష్ప' లాంటి సినిమాలు తీసిన మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి పనిచేశాడు. సినిమాలో సన్నీ డియోల్‌తో పాటు రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ తదితరులు నటించారు.

read  more: అల్లు అర్జున్‌ కటౌట్‌పై అల్లు అరవింద్‌ సెటైర్లు, సొంత కొడుకునే అంత మాట అన్నాడా? `ఆర్య` వెనుక క్రేజీ స్టోరీ

also read: సుమనే మెగాస్టార్‌, చిరంజీవితో పోటీపై స్టార్‌ యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్

Latest Videos

vuukle one pixel image
click me!