ఐపీఎల్ అంటేనే ఎప్పుడు, ఏం జరుగుతుందో, ఎవరూ ఊహించలేరు. అద్భుతమైన బ్యాటింగ్, బుల్లెట్లా దూసుకొచ్చిన బంతులతో పాటు అదిరిపోయే క్యాచ్‌లు ప్రేక్షకులను ఎగ్జైట్‌మెంట్‌కు గురి చేస్తాయి. మ్యాచ్‌లో జరిగే ఇలాంటి సంఘటనల కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. తాజాగా సోమవారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాంటి ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది..
ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే స్టేడయంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్ము రేపింది. విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ముంబై ముందు 222 పరుగుల లక్ష్యాన్ని ఉంచిది.
ఇదిలా ఉంటే బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. చివరి ఓవర్లలో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే క్రమంలో రజత్ పాటిదార్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఓ బంతిని వికెట్ల వెనకాల భారీ షాట్ కొట్టాడు. దాదాపు బౌండరీ లైన్ వరకు చేరుకున్న బంతిని వికెట్ కీపర్ ర్యాన్ రికెల్టన్ అద్భుతంగా పట్టుకున్నాడు. రికెల్టన్ ఈ అద్భుతమైన క్యాచ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
WHAT. WAS. THAT? 👀💥
Watch Ryan Rickelton's stunning blinder to dismiss Rajat Patidar 🦅
Scorecard ▶ https://t.co/Arsodkwgqg | | pic.twitter.com/4Jxd3k0gB6
ఇలా వికెట్ కీపర్ చాలా దూరం పరిగెత్తి ఫుల్ లెంగ్త్ డైవ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 32 బంతుల్లో 64 పరుగులు చేసిన రజత్ ఈ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్ బాటపట్టాడు. నిజానికి ఆ రజత్ ఆ సమయంలో అవుట్ కాకపోయి ఉంటే ఆర్సీబీ స్కోర్ మరింత పెరిగి ఉండేదు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.