Sabarimala: శబరిమల కేరళలోని పతనంతిట్ట జిల్లాలో కొండపై ఉంటుంది. ఈ పవిత్రమైన ఆలయం చుట్టూ అందమైన 18 కొండలు ఉన్నాయి. ఈ ఆలయం దేవుడు అయ్యప్పస్వామికి అంకితం చేయబడింది. ఇక్కడకు వెళ్లిన భక్తుల కోరికలు ఖచ్చితంగా తీరుతాయనే నమ్మకం ఉంది. అందుకే ఈ ఆలయానికి ప్రతి ఏడాది కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటుగా ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు సందర్శిస్తుంటారు. ఈ ఆలయాన్ని నవంబరు నుంచి డిసెంబరు వరకు సందర్శించొచ్చు. ఈ సమయంలో మండలపూజ ఉంటుంది. అలాగే జనవరి 14న అంటే మకర సంక్రాంతి, ఏప్రిల్ 14న అంటే మహాశివ సంక్రాంతి, ప్రతి మలయాళ మాసంలో మొదటి ఐదు రోజులు మాత్రమే అయ్యప్పస్వామికి పూజలు చేసేందుకు ఆలయాన్ని తెరుస్తారు.