IND vs AUS: ఆస్ట్రేలియాతో బిగ్ ఫైట్ కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్

First Published | Nov 21, 2024, 10:07 PM IST

IND vs AUS - Rohit Sharma : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ క్ర‌మంలో ఆస్ట్రేలియాలతో బిగ్ ఫైట్ కు ముందు వ‌రుస‌గా భార‌త్ కు బ్యాడ్ న్యూస్ లు అందుతూ వ‌చ్చాయి. అయితే, ఇప్పుడు బిగ్ గుడ్ న్యూస్ వ‌చ్చింది. 
 

IND vs AUS - Rohit Sharma : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ లో నవంబర్ 22న పెర్త్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ బిగ్ ఫైట్ కు ఇరు జ‌ట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇదే క్ర‌మంలో ఇండియా స్క్వాడ్ నుండి ఒకదాని తర్వాత మరొకటి చేదు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు భారత జట్టుకు శుభవార్త వ‌చ్చింది. కీల‌క ప్లేయ‌ర్లు దూరం అయ్యార‌నే వార్త‌ల మ‌ధ్య కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు సంబంధించి బిగ్ అప్ డేట్ వ‌చ్చింది. 

కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. రోహిత్ గైర్హాజరీలో పెర్త్ టెస్టుకు జట్టు కమాండ్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చేతిలో ఉంటుంది. అయితే తదుపరి మ్యాచ్‌కు ముందు రోహిత్ శ‌ర్మ టీమ్ తో చేరుతాడ‌ని స‌మాచారం. 

Rohit Sharma Press

రోహిత్ ఎప్పుడు జ‌ట్టుతో చేరుతాడు?

పెర్త్ టెస్టు సందర్భంగా రోహిత్ శర్మ జట్టుతో ఉంటాడు. క్రిక్‌బజ్‌లోని ఒక నివేదిక ప్రకారం, కెప్టెన్ రోహిత్ ఆస్ట్రేలియాకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను నవంబర్ 24న జట్టులో చేరే అవకాశం ఉంది. హిట్ మ్యాన్ తన రెండో బిడ్డకు జన్మనిచ్చిన కారణంగా పెర్త్ టెస్టుకు దూరమయ్యాడు. డిసెంబర్ 6-10 తేదీల్లో అడిలైడ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తో భార‌త జ‌ట్టుకు కెప్టెన్ గా మ‌ళ్లీ రోహిత్ శ‌ర్మ గ్రౌండ్ లోకి అడుగుపెట్ట‌నున్నాడు.


రోహిత్ శ‌ర్మ‌ ప్రాక్టీస్ మ్యాచ్ 

బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం రోహిత్ శర్మ ముంబైలో ప్రాక్టీస్ చేశాడు, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు రెండో టెస్టులో చేరడానికి ముందు రోహిత్ శర్మ కూడా టీమ్ ఇండియా తరపున ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నాడు. కాన్‌బెర్రాలోని మనుకా ఓవర్‌లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు మ్యాచ్ జరగనుంది. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో భారత సీనియర్ జట్టు త‌ల‌ప‌డ‌నుంది. 

Mohammed Shami-Jasprit Bumrah

మ‌హ్మ‌ద్ షమీ కూడా ఆస్ట్రేలియాకు

భార‌త స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా విలేకరుల సమావేశంలో షమీకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చాడు. అతను మాట్లాడుతూ, 'షమీ భాయ్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అతను ఈ జట్టులో భాగంగా ఉన్నాడు. యాజమాన్యం కూడా వారిపై నిఘా ఉంచుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆశాజనక విషయాలు ఉంటాయి. వాటిని ఆస్ట్రేలియాలో చూస్తారు అని బుమ్రా చెప్పాడు. కాబ‌ట్టి వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ త‌ర్వాత జ‌ట్టుకు దూరంగా ఉన్న ష‌మీ మ‌ళ్లీ జ‌ట్టుతో క‌లిసే అవ‌కాశ‌ముంది.

ఇది గొప్ప గౌర‌వం.. బాధ్య‌త :  బుమ్రా 

రోహిత్ శ‌ర్మ తొలి టెస్టుకు అందుబాటులో లేక‌పోవ‌డంతో పెర్త్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా భారత్‌కు నాయకత్వం వహిస్తాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని భావిస్తున్నారు. మ్యాచ్ సిమ్యులేషన్ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు నెం.3 శుభ్‌మాన్ గిల్ ఎడమ బొటన వేలికి గాయం కావడంతో సిరీస్‌లోని మొదటి టెస్ట్‌కు దూరం కానున్నాడ‌ని స‌మాచారం. 

తొలి టెస్టు సందర్భంగా బుమ్రా జట్టును నడిపించడం గురించి మాట్లాడుతూ.. ఇది గొప్ప‌ గౌరవం.. ఎంతో బాధ్య‌త‌యుత‌మైన‌ద‌ని చెప్పాడు. “ఇది ఒక గౌరవం. నాకంటూ ఓ స్టయిల్ ఉంది. విరాట్ (కోహ్లీ) వేరు, రోహిత్ వేరు. నాకు నా స్వంత మార్గం ఉంది. ఇది ఒక విశేషం. నేను దానిని ఒక స్థానంగా తీసుకోను. నేను బాధ్యత తీసుకోవడాన్ని ఇష్టపడతాను. గతంలో రోహిత్‌తో మాట్లాడాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జట్టును నడిపించడంపై కొంచెం స్పష్టత వచ్చింది' అని బుమ్రా అన్నాడు.

Latest Videos

click me!