డబుల్ సెంచరీతో దుమ్మురేపిన‌ వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఆర్య‌వీర్

First Published | Nov 21, 2024, 10:44 PM IST

Virender Sehwag's son double century :  టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ డబుల్ సెంచరీ (200*) సాధించాడు. 34 ఫోర్లు, 2 సిక్సర్లతో ఢిల్లీ తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
 

Virender Sehwag's son Aaryavir slams double century

Virender Sehwag's son double century : వీరేంద్ర సెహ్వాగ్.. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. ఢాషింగ్ ఓపెన‌ర్ గా టీమిండియా త‌ర‌ఫున అద్భుత‌మైన ఇన్నింగ్స్ ల‌ను ఆడాడు. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌పై త‌న బ్యాట్ తో విరుచుకుప‌డుతూ అనేక విజ‌యాలు అందించాడు. తండ్రి బాట‌లోనే ఇప్పుడు జూనియ‌ర్ సెహ్వాగ్ కూడా అద్భుత‌మైన ఇన్నింగ్స్ ల‌ను ఆడ‌టం మొద‌లు పెట్టాడు. సెహ్వాగ్ కొడుకు ఆర్య‌వీర్ డ‌బుబ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. 

Aaryavir sehwag

డబుల్ సెంచరీ రికార్డు పుస్తకాన్ని తెరిస్తే.. సెహ్వాగ్ రికార్డులు టాప్ లో కనిపిస్తున్నాయి. సెహ్వాగ్ అంటే ప్రపంచవ్యాప్తంగా బౌలర్లు భయపడే బ్యాట‌ర్. ఇప్పుడు అతని బాటలోనే అతని కొడుకు కూడా నడుస్తున్నాడు. సెహ్వాగ్ కొడుకు కూడా డబుల్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. కొడుకు ఆర్యవీర్‌కు కూడా ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ల‌ను ఆడ‌టం ఇష్టమని చెబుతూ కూచ్ బెహార్ ట్రోఫీ టోర్నమెంట్‌లో తన డ‌బుల్ సెంచ‌రీ ఇన్నింగ్స్ తో నిరూపించాడు. 

Latest Videos


Virender Sehwag's son Aaryavir slams double century

17 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ కొట్టిన ఆర్య‌వీర్ 

భార‌త ఢాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ వయసు 17 ఏళ్లు మాత్రమే. అతను 18 అక్టోబర్ 2007 న జన్మించాడు. దిగ్గజ బ్యాట‌ర్ సెహ్వాగ్ ను ద‌గ్గ‌ర‌గా చూసి పెరిగిన ఆర్యవీర్ త‌న తండ్రి ఆట‌తీరును అందిపుచ్చుకున్నాడు. నవంబర్ 21న షిల్లాంగ్‌లోని MCA క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆర్యవీర్ డబుల్ సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. మేఘాలయ బౌలర్లపై విరుచుకుప‌డ్డాడు. 229 బంతుల్లో ఆర్యవీర్ 200* పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అత‌ని డబుల్ సెంచ‌రీ ఇన్నింగ్స్ లో 2 సిక్సర్లు, 34 ఫోర్లు బాదాడు. 

cricket virender sehwag

ఢిల్లీకి సూప‌ర్ ఇన్నింగ్స్

ఆర్యవీర్ మారథాన్ ఇన్నింగ్స్‌తో మేఘాలయపై ఢిల్లీ టీమ్ మెరుగైన స్థానంలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి 468 పరుగులు చేసింది. మేఘాలయ జట్టు ఇప్పటి వరకు ఢిల్లీ కంటే 208 పరుగుల వెనుకబడి ఉంది. గత నెలలో సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ వినూ మన్కడ్ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 ప‌రుగులు చేసి ఫిఫ్టీకి 1 పరుగు దూరంలో ఔట్ అయ్యాడు. కానీ, ఇప్పుడు డబుల్ సెంచరీ మోత మోగించాడు.

ఆర్యవీర్ గురించి సెహ్వాగ్ ఏం చెప్పాడు?

సెహ్వాగ్ కొన్నాళ్ల క్రితం తన కొడుకు ఆర్యవీర్ గురించి మాట్లాడాడు. తన కుమారులిద్దరూ తమ కెరీర్‌ను ఎంచుకోవడానికి స్వేచ్ఛగా ఉన్నారనీ, క్రికెటర్లు కావాలనే ఒత్తిడి లేదని అతను స్పష్టంగా చెప్పాడు. సెహ్వాగ్ మాత్రమే కాదు, వెటరన్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ సహా కొంతమంది క్రికెటర్ల కుమారులు క్రికెట్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. సచిన్ కుమారుడు అర్జున్ కూడా గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే.

click me!