ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ కు ఫైనల్ మెగా చీఫ్ కోసం.. పెద్ద యుద్దమే స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. అందులో భాగంగా చీఫ్ కంటెండర్ కాంపిటేషన్ జరిగింది. అందులో గెలిచిన వారికి.. హౌస్ లో ఉన్నవారికి అందరికి కలిపి.. అదిరిపోయే టాస్క్ లు స్టార్ట్ అయ్యాయి. ఇక గేమ్ చివరకు వస్తుంది అనుకుంటున్న టైమ్ లో కూడా గొడవలు తప్పడంలేదు.
అందలోను ఎమోషన్స్ ను, కోపాన్ని కంట్రోల్ చేసుకుని తెలివిగా ఆడాల్సిన టైమ్ లో కాస్త లూజ్ అవుతున్నారు కంటెస్టెంట్లు. అటు పృధ్వీ, ఇటు గౌతమ్ మరోసారి వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నువ్వా నేనా అనే మాటల కూడా కాదు.. ఏం పీక్కుంటావు అనే విషయం దగ్గరకు వచ్చింది. అసలు వీరి గొడవ చాలా సిల్లీ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యింది.