sex
సెక్స్ ఆస్వాదించాలంటే.. ఒకరికి ఆశ ఉంటే సరిపోదు. ఇద్దరికీ.. కలయిక పట్ల ఆసక్తి ఉండాలి. ఒకవేళ మీకు ఆస్తిగా ఉండి.. మీ భార్యకు లేకపోతే.. ? మీరు బలవంత పెట్టినా.. ఆమె ఆమడ దూరం జరుగుతూ.. ఆ టాపిక్ ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా..? ఇలా ఎందుకు చేస్తోంది అనే అనుమానం మీకు కలిగిందా..? భార్య అలా.. భర్తతో కలయికను ఇష్టపడకపోవడానికి కూడా కారణం ఉందట. వారు శృంగారం పట్ల ఆసక్తి లేకుండా పోవడానికి కారణమేంటో నిపుణులు వివరిస్తున్నారు.
post sex blues
భాగస్వాములందరికీ ఒకే రకమైన లిబిడో ఉండదు. కొంతమందికి ఎక్కువ సెక్స్ డ్రైవ్ ఉంటుంది, అయితే వారి భాగస్వామి తక్కువగా ఉండొచ్చు. మీ భార్య సెక్స్ పట్ల అంతగా ఆసక్తి చూపకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. మీరు ఎంత సెక్స్ చేయాలనుకుంటున్నారో మీ భార్య అర్థం చేసుకోకపోవచ్చు. కాబట్టి, దానిని ఆమెకు తెలియజేయండి. మీరు ఎందుకు అంతలా ఆసక్తి చూపిస్తున్నారో చెబితే.. ఆమె అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
post sex blues
కొందరు మహిళలు.. ఒత్తిడి, ఆందోళనలను ఎక్కువగా తీసుకోలేరు. మీ భార్య కూడా అదే ఒత్తిడిలో ఉండి ఉండొచ్చు. అలా ఒత్తిడిగా ఉన్న సమయంలో.. వారు కలయికలో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేరు. లేదంటే.. మీరు ఒత్తిడి చేయడం వల్ల వారు కలయికలో పాల్గొన్నా.. మీకు పెద్దగా తృప్తి లభించకపోవచ్చు. కాబట్టి.. ముందుగా.. ఆమెకు ఉన్న ఒత్తిడి తగ్గించే పని మీరు చేయాలి. అలా చేయడం వల్ల.. ఒత్తిడి తొలగి వారు మీతో సరదాగా గడిపే అవకాశం ఉంది.
post sex blues
పై రెండు కారణాలు కాకపోతే.. లోపం మీలోనే ఉంది. అంటే.. మీరు ఆమెతో సరైన కనెక్షన్ ఏర్పరుచుకోలేదని అర్థం. మీ మనసు ఆమెకు అర్థం కాకున్నా.. మీతో సరైన కనెక్షన్ లేకున్నా.. ఆమె మీ నుంచి దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంుటంది. చాలా మంది మహిళలు.. ఎమోషనల్ బాండింగ్ ఉంటేనే కలయికను ఇష్టపడతారు.
post sex blues
అలా కాదు.. మా ఇద్దరి మధ్య బాండింగ్ కూడా బాగానే ఉంది.. అయినా నా భార్య దూరం పెడుతుంది అంటే... మీ వైవాహిక జీవితంలో ఆమెకు ఏవైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోండి. మీ భార్యతో మనసు విప్పి మాట్లాడి.. ఆమె ఎలాంటి సమస్య ఎదుర్కుంటుందో తెలుసుకోండి. వారితో కమ్యూనికేషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి. ఈ సమస్య తీరితే.. వారు మీతో మళ్లీ సరదాగా ఉండే అవకాశం ఉంది.
post sex blues
ఈ కారణం కూడా కాదు అంటే.. మీ భార్య తన శరీరం గురించి అసురక్షితంగా ఉన్నందున సెక్స్‌లో పాల్గొనడానికి నిరాకరిస్తూ ఉండవచ్చు. ఆమె మాతృత్వం ఆమెను ప్రభావితం చేయవచ్చు లేదా ఆమె తన శరీరంతో మంచి సంబంధాలు కలిగి ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాలలో, ఆమెను మంచిగా, సౌకర్యవంతంగా, ప్రత్యేకంగా భావించేలా చేయడం ఆమె భర్తగా మీ బాధ్యత.