మహానటిని చెడగొట్టేశారు కదరా.. కీర్తిసురేష్‌ని ఇలా ఎప్పుడు చూసి ఉండరు!

First Published | Nov 24, 2024, 10:06 AM IST

మహానటిగా తెలుగు, తమిళ ఆడియెన్స్ ని అలరించిన కీర్తి సురేష్‌ ఒక్కసారిగా తనలోని మార్పుని బయటపెట్టింది. నయా అవతార్‌లో షాకిస్తుంది. 
 

కీర్తిసురేష్‌ అంటే `మహానటి`నే గుర్తుకు వస్తుంది. మహానటి సావిత్రిగా ఆమె వెండితెరపై చేసిన మ్యాజిక్ అలాంటిది. ఈ తరానికి సావిత్రి అంటే కీర్తిసురేష్‌ గుర్తుకు వస్తుంటుంది. అంతగా తనదైన నటనతో మాయ చేసిన కీర్తిసురేష్‌కి ఆ మూవీ తర్వాత సరైన హిట్‌ పడలేదు.

లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేసింది, అయినా సక్సెస్‌ రాలేదు. కమర్షియల్‌ సినిమాలు చేసింది అయినా పేరు రాలేదు. వరుసగా పరాజయాలే చవిచూస్తుంది. నానితో కలిసి నటించిన `దసరా` మూవీ మాత్రమే హిట్‌ అయ్యింది. కానీ అది నాని అకౌంట్‌లోకి వెళ్లింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో ఊరమాస్‌ మూవీస్‌, రా అండ్‌ రస్టిక్‌ చిత్రాలు కూడా చేసింది కీర్తిసురేష్‌. అయినా నో యూజ్‌. దీంతో ఇప్పుడు బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. నెవర్‌ బిఫోర్‌ అనేలా కనిపించి షాకిస్తుంది.

కీర్తి సురేష్‌ కొత్త లుక్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇందులో కీర్తి లుక్‌, డ్రెస్‌ని చూస్తే మాత్రం మతిపోవాల్సిందే. ఆమె అభిమానుల హార్ట్ బ్రేక్‌ కావాల్సిందే. అంతగా కొత్త అవతార్‌లో మైండ్‌ బ్లాక్ చేస్తుంది కీర్తిసురేష్‌. 
 


కీర్తిసురేష్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `బేబీ జాన్` అనే సినిమాలో నటిస్తుంది. వరుణ్‌ ధావన్‌ ఇందులో హీరో. కలీస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ తమిళంలో విజయ్‌ హీరోగా వచ్చిన `థెరి`కి రీమేక్‌. అయితే బాలీవుడ్‌ స్టయిల్‌లో మార్పులు చేసి చేస్తున్నారట. ఈ మూవీ ద్వారా బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది కీర్తిసురేష్‌. హిందీలోకి వెళితే హీరోయిన్‌ గ్లామర్‌ పరంగా గేట్లు ఎత్తేస్తారు అంటారు. ఇప్పుడు కీర్తి సురేష్‌ విషయంలోనూ అదే జరిగింది. 
 

తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్‌ రిలీజ్ అయ్యింది. `నైనా మటక్కా` అంటూ సాగే పాట ఇప్పుడు యూట్యూబ్‌ని ఊపేస్తుంది. దీని క్లిప్స్ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. కానీ పాట బాగుందని కాదు, కీర్తి సురేష్‌ లుక్స్ విషయంలో. ఆమె ఇందులో కనిపించిన తీరు చూస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే. బాలీవుడ్‌ గ్లామర్‌ బ్యూటీస్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా కనిపించింది కీర్తి. ఇన్నాళ్లు ట్రెడిషనల్‌ లుక్లో మెరిసింది. తనపై ఒక రకమైన గౌరవాన్ని ఏర్పర్చుకుంది.

కానీ ఈ సినిమాలో మాత్రం గ్లామర్‌కి అన్ని గేట్లు ఎత్తేసింది. తనలోని గ్లామర్‌ కోణాన్ని బోల్డ్ గా ఆవిష్కరించింది. పీలికల్లాంటి దుస్తుల్లో కీర్తిసురేష్‌ని చూస్తే ఫ్యాన్స్ హర్ట్ కావడం ఖాయం. దీంతో ఆమె లుక్స్ నెటిజన్లు స్పందిస్తున్నారు. మీమర్స్ రెచ్చిపోతున్నారు. బాలీవుడ్‌ వెళ్తే అంతే మహానటి అయినా మారిపోవాల్సిందే అని కొందరు, పాపం మహానటి చెడగొట్టారు కదరా అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ వైరల్‌ చేస్తున్నారు. 
 

అయితే కాలం మారిపోతుంది. హీరోయిన్లకి లాంగ్‌ రన్‌ కావాలంటే, పాన్‌ ఇండియా రేంజ్‌లో రాణించాలంటే ఇలాంటి గ్లామర్ గేట్లు ఎత్తేయడం సాధారణమే. ముఖ్యంగా బాలీవుడ్‌లో రాణించాలంటే ఈ పని చేయాల్సిందే. కీర్తి సురేష్‌ కూడా తన కట్టుబాట్లని బ్రేక్‌ చేసిందని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.

కమర్షియల్‌ హీరోయిన్‌గా నిరూపించుకునేందుకు తాను ఈ ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఆమె విమర్శలు ఎదుర్కొంటుంది. ఫలితం బాగుంటే ఈ విమర్శలు పక్కకు వెళ్లాయి, లేదంటే దారుణంగా ట్రోలింగ్‌ తప్పదు. అంతకు ముందు రష్మిక మందన్నా కూడా టాలీవుడ్‌లో కొంత పద్ధతిగానే కనిపించింది. బాలీవుడ్‌లోకి వెళ్లాక అన్ని రకాలుగా ఓపెన్‌ అయిపోయింది.

ఇప్పుడు రష్మికనే కీర్తిసురేష్‌ ఫాలో అవుతుందనిపిస్తుంది. అయితే రష్మిక అక్కడ సక్సెస్‌ అయ్యింది. దీంతో ఆమెకి కామన్‌ అయ్యింది. మరీ కీర్తిసురేష్‌ సక్సెస్ అవుతుందా అనేది చూడాలి. `బేబీ జాన్‌` మూవీ డిసెంబర్‌ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. 
 

కీర్తిసురేష్‌ ప్రస్తుతం `బేబీ జాన్‌`తోపాటు తమిళంలో `రివాల్వర్‌ రీటా`, `కన్నివేడి` చిత్రాల్లో నటిస్తుంది. తెలుగులో ఈ అమ్మడికి సినిమాలు లేకపోవడం గమనార్హం. చివరగా ఆమె `భోళా శంకర్‌`లో నటించింది. అయితే ఇందులో చిరంజీవికి చెల్లిగా చేసింది. అంతేకాదు అంతకు ముందు కోలీవుడ్‌లో రజనీకాంత్‌కి చెల్లిగా చేసింది. ఇది ఆమె కెరీర్ పై ప్రభావం చూపిస్తుందని, ఆమెకి వస్తున్న ఆఫర్లు, ఆమె చేస్తున్న సినిమాలని బట్టి తెలుస్తుంది. 

read more:శోభన్‌బాబుని అమ్మాయిలు ఎందుకు ఇష్టపడతారో తెలుసా?.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణంరాజు, కృష్ణలకు ఉన్న తేడా అదే

also read: మెకానిక్‌ రాకీ, జీబ్రా, దేవకీ నందన వాసుదేవ ఫస్ట్ డే కలెక్షన్లు.. పాపం మహేష్‌ అల్లుడి సినిమా పరిస్థితి దారుణం
 

Latest Videos

click me!