శివ మూవీ రిలీజ్ అయ్యే వరకు నాగార్జున నటుడిగా గొప్ప పేరు అయితే రాలేదు. కొన్ని హిట్స్ పడుతున్నాయి కానీ నాగేశ్వరావు గారి అబ్బాయి అనే అంచనాలని నాగార్జున అందుకోలేకపోతున్నారు. కమర్షియల్ గా శివ బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ అంతకంటే ముందుగా నటుడిగా నాగార్జునకి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం గీతాంజలి. లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
Nagarjuna Akkineni
తాను నటుడిగా నిరూపించుకోవాలి అంటే మణిరత్నం లాంటి దర్శకుడు అవసరం అని చెప్పి నాగార్జున దాదాపు నెల రోజుల పాటు మణిరత్నం ఇంటి చుట్టూ తిరిగారట. నాగార్జున డెడికేషన్ చూసి సరే నీతో నేను సినిమా చేస్తానని ఒకే చెప్పారు. ఆ విధంగా వాళ్ళిద్దరి కాంబినేషన్ లో గీతాంజలి చిత్రం సెట్ అయింది. ఈ మూవీపై నాగార్జున చాలా ఆశలు పెట్టుకున్నాడు.
Maniratnam
రిలీజ్ అయ్యాక సిటీల్లో కొంతమంది ఆడియన్స్ కి తప్పితే ఈ చిత్రం ఎవ్వరికీ నచ్చలేదు.. రూరల్ ఏరియాల్లో అయితే దారుణమైన టాక్. సినిమా స్లోగా అనిపించడం.. హీరోయినే హీరోతో లేచిపోదాం అని చెప్పడం లాంటివి వర్కౌట్ కాలేదు. దీనితో తన సినిమా ఫ్లాప్ అని నాగార్జున చాలా బాధపడ్డారట. ఇంట్లోనే కూర్చుని ఆవేదన చెందారు. అయితే నాగార్జున సన్నిహితులు కూడా వాస్తవాలు చెబుతూ నాగ్ ని ఓదార్చే ప్రయత్నం చేశారు.
హీరోయిన్.. హీరోతో లేచిపోవడం అని చెప్పే అంశాలు హాలీవుడ్ లో వర్కౌట్ అవుతాయి.. ఇక్కడ కాదు. ఇక నుంచి మంచి కథలు ఎంచుకో అని సలహా ఇచ్చారు. మొదటి రెండు వారాల వరకు ఫ్లాప్ టాక్ కొసాగుతూనే ఉంది. మూడో వారం నుంచి టాక్ కాస్త మారింది. హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాల గురించి జనాలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.
నాలుగో వారం వచ్చేసరికి బ్లాక్ బస్టర్ టాక్ అన్ని ఏరియాల్లో స్ప్రెడ్ అయిపోయింది. నాగార్జున కెరీర్ లో గీతాంజలి ఒక క్లాసిక్ మూవీగా మిగిలిపోయింది. మణిరత్నం జడ్జిమెంట్ తప్పు కాలేదు. నాగార్జున కూడా సూపర్ హ్యాపీ. ఇదే సినిమా ఇప్పుడు రిలీజ్ అయి మొదటి రెండు వారాలు ఫ్లాప్ టాక్ వస్తే ఏం జరుగుతుంది.. వెంటనే ఓటిటిలో పడేసి డిజాస్టర్ మూవీ అని ముద్ర వేస్తారు. ఓటిటిలో సక్సెస్ అయితే అండర్ రేటెడ్ మూవీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడతారు.