శృంగారం అంటే తనువుల దాహం తీరితే సరిపోదు. అంతకు మించి.. ఒకరిమీద ఒకరికి నమ్మకం, విశ్వాసం, స్పాంటేనిటీ, సంతోషం, భావోద్వేగపరమైన బంధం.. ఇలా అన్నీ ముడిపడి ఉంటాయి.
undefined
కాపురంలో సెక్స్ అంటే కేవలం మీ భాగస్వామికి తృప్తి పరచడం మాత్రమే కాదు. మానసికంగా ఇద్దరి మధ్యా గాఢమైన అనుబంధం ఏర్పడడానికి దోహదపడుతుంది.
undefined
అందుకే పెళ్లైన కొత్తలో ఉన్న ఆకర్షణ, ఇద్దరి మధ్య అనుబంధం మెల్లగా పలుచబడుతుంది. ఇద్దరిమధ్య విశ్వాసం లేకపోవడం, ఆత్మగౌరవ సమస్యలు మొదలవుతాయి. దీంతో అనివార్యంగా, సెక్స్ మందకొడిగా మారుతుంది.
undefined
అయితే స్త్రీలు అస్సలు ఊహించని విషయం ఏంటంటే.. పెళ్లి, సెక్స్ విషయంలో భర్తలు తమ భార్యలు కొన్ని విషయాలు తెలిసి ఉండాలనుకుంటారు. శృంగారం విషయంలో కొన్నింట్లో క్లారిటీ ఉండాలని ఆశపడతారు.
undefined
శృంగారం సమయంలో తమ భార్యలు మిగతా అన్నీ వదిలేసి సరదాగా ఉండాలని ప్రతీ భర్తా కోరుకుంటాడు. శృంగారాన్ని కూడా ముందుగా ప్లాన్ చేసుకోవడం నచ్చదు. దీనివల్ల అందులోని మజా కోల్పోతారని భావిస్తారు.
undefined
అంతేకాదు సెక్స్ కు మొదటి అడుగు స్త్రీలు వేస్తే బాగా నచ్చుతుంది. అంతేకాదు హాయిగా పడుకుని.. ఆమె తనను రెచ్చగొడుతుంటే ఎంజాయ్ చేస్తారట.
undefined
సెక్స్ వల్ల తమిద్దరి మధ్య అనుబంధంలో గాఢతను స్త్రీలు తెలుసుకోవాలని అనుకుంటారు. దీనివల్ల తమిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని బావిస్తారు. అంతేకాదు అపోహలు లేని, ఒకరిమీద ఒకరికి సానుకూలంగా ఆలోచనలు కలగడానికి వీలు కలుగుతుంది. ఇది వైవాహిక బంధాన్ని బలపరుస్తుంది.
undefined
ఒక కౌగిలి, ఒక ఇంటర్ కోర్స్ ఇద్దరి మధ్య సన్నిహిత అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల పూర్తి విశ్వాసంతో, ప్రేమతో సెక్స్ లో పాల్గొంటారు.
undefined
అందంగా , ఫిజికల్ గా ఫిట్ గా ఉన్న స్త్రీలను పురుషులు ఇష్టపడతారు. కాదనలేం.. అయితే దీనికంటే ఎక్కువగా స్త్రీలలో ఆత్మవిశ్వాసాన్ని వారు ప్రేమిస్తారు. పొట్టదగ్గర ఫ్యాట్ పెరిగిందా? చేతులు లావుగా కనిపిస్తున్నాయా? బరువు పెరిగారా? ఇవన్నీ వారి దృష్టికి రావు.
undefined
మెచ్యూర్డ్ స్త్రీలంటే బాగా ఇష్టపడతారు. తనను తాను చూసుకుంటూ, కుటుంబాన్ని, భాగస్వామిని, పిల్లల్ని బాధ్యతగా చూసుకునే స్త్రీలంటే పురుషులు పడిచచ్చిపోతారు. అంతేకాదు ఆత్మవిశ్వాసంతో ఉండే స్త్రీల విషయంలో శృంగారం నిర్వచనమే మారిపోతుందని నమ్ముతారు.
undefined
కలయికలో ఇద్దరూ భావప్రాప్తి పొందాలనుకుంటారు. భావప్రాప్తి పొందకున్నా తృప్తి పడ్డట్టు నటించేవాళ్లంటే ఇష్టపడరు. శృంగారంలో తనకు ఎలా చేస్తే తనకు ఇష్టమో మనసు విప్పి చెప్పేవాళ్లంటే బాగా ఇస్టం.
undefined
అంతేకాదు శృంగారాన్ని హృదయపూర్వకంగా ఆస్వాదించగలిగితే ఇష్టపడతారు. అది జంటల మధ్య మరింత గాఢతను పెంచుతుంది. ఇక సెక్స్ లో అడ్వెంచర్లు కోరుకునేవారంటే అది భోనస్ అన్నట్టే.
undefined
సెక్స్ విషయంలో స్త్రీలు ఎక్కువగా ఆలోచించడం మానేసి, శృంగారాన్ని ఎంజాయ్ చేయాలి. తనను తృప్తి పరచగలడా అనే అనుమానాన్ని వదిలేసి.. పూర్తిగా, స్వేచ్ఛగా కలయికలో పాల్గొంటే బాగా నచ్చుతుంది. ఫ్లర్ట్ చేస్తూ, రొమాంటిక్ గా మాట్లాడుతూ, రెచ్చగొట్టేలా బట్టలు వేసుకుని ఇలా పడకగదిలో స్త్రీలు పురుషులతో ఉంటే బాగా నచ్చుతుంది.
undefined