అన్నపూర్ణ స్టూడియో అక్కినేని కుటుంబానికి చాలా ప్రత్యేకం. అక్కడ ఉన్న తాత(ఏఎన్నార్) విగ్రహం ఎదుట పెళ్లి జరగనుంది. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. రెండు కుటుంబాలు కలిసి అక్కడ వివాహం జరగాలని నిర్ణయం తీసుకున్నాం. శోభితతో కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఆశగా ఎదురు చూస్తున్నాను. ఆమె నాకు చాలా కనెక్ట్ అయ్యింది. నన్ను బాగా అర్థం చేసుకుంది. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని నింపేందుకు ఈ వివాహం చేసుకుంటున్నాను.. అన్నారు.
నాగ చైతన్య కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శోభిత-నాగ చైతన్య స్క్రీన్ షేర్ చేసుకుంది లేదు. అయినప్పటికీ వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తెలుగు అమ్మాయి అయిన శోభిత ముంబైలో మోడలింగ్ చేసింది. కెరీర్ బిగినింగ్ లో హిందీ చిత్రాలు చేసింది. తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాల్లో నటించింది.