అల్లు అర్జున్ తీరని కోరిక ఏంటో తెలుసా..? బాలయ్యతో సీక్రెట్ పంచుకున్న బన్నీ.

First Published | Nov 24, 2024, 6:07 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే పాన్ఇండియా స్టార్ గా మారిపోయాడు. పుష్ప2తో అంతకు మించి సాధించడానికి రెడీగా ఉన్న అల్లు అర్జున్ కు తీరని కోరిక ఒకటి ఉండిపోయిందట. అదేంటో తెలుసా..? 

Allu Arjun

పాన్ ఇండియా స్టార్  అల్లు అర్జున్ రీసెంట్ గా  బాలకృష్ణ హోస్ట్ గా రన్ అవుతున్న  అన్‌స్టాపబుల్ సీజన్ 4  షోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ అద్భుతంగా రావడం.. బన్నీతో పాటు మధ్యలో ఆయన పిల్లలు, తల్లిగారు కూడా కొంత పార్ట్ వరకూ ఇంటర్వ్యూలో పాల్గొనడంతో.. ఈ ఎపిసోడ్ ను  రెండు పార్టులుగా స్ట్రీమింగ్ చేస్తున్నారు.  

Alao Read:  రెహమాన్‌ మంచివాడు.. తప్పుగా రాయకండి... విడాకుల పై సైరాబాను ఏమన్నారంటే..
 

photo credit-aha unstoppable4 promo

అయితే ఇప్పటికే పార్ట్ 1 స్ట్రీమింగ్ అయ్యింది. ఆహా ఓటీటీలో బాలయ్య – అల్లు అర్జున్ ఎపిసోడ్ దూసుకుపోతుంది. ఫస్ట్ పార్ట్ దూసుకుపోతుండగానే  తాజాగా పార్ట్ 2 ని కూడా  రిలీజ్ చేశారు. ఇందులో కూడా ఐకాన్ స్టార్ తనకు సబంధించని  బోలెడన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.     పంచుకున్నారు.

Alao Read: కొరియన్ సిరీస్‌లు చూడటం మానసిక ఆరోగ్యానికి మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారు..?


Allu Arjun

అందులో మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ లైఫ్ లో తీరని ఓ కోరిక గురించి వెల్లడించారు. జీవితంలో  అల్లు అర్జున్ కి ఓ కోరిక మాత్రం మిగిలిపోయిందట. అది ఇక ముందు కూడా తీనేది కాదట. తను ఎంతగానో అనుకున్న ఆ కోరక తీరలేదని అప్పుడప్పుడు బాధపడతారట. ఇంతకీ  అది ఏంటో తెలుసా.. అల్లు అర్జున్ తాతగారు అల్లు రామలింగయ్యతో కలిసి నటించలేకపోవడం. 

అవును ఇంటర్వ్యూలో ఓ సందర్భంలో  బాలయ్య అల్లు అర్జున్ ని వాళ్ళ తాతయ్య అల్లు రామలింగయ్య  గురించి అడిగారు. దీనికి అల్లు అర్జున్ సమాధానమిస్తూ.. అయన ఎప్పుడూ గుర్తొస్తుంటారు. తాతయ్యతో కలిసి నటించలేదనే బాధ ఉంది. నేను గంగోత్రి, ఆర్య చేసినప్పుడు ఆయన ఉన్నారు. అప్పటికీ మేము అనుకున్నాము.. ఆర్యలో ఆయనతో ఓ  చిన్న రోల్ అయినా చేయించాలి అని. 

Alao Read: కృష్ణలో విజయనిర్మలకు నచ్చని విషయం ఏంటో తెలుసా..? సాయంత్రం అయితే అదే పనంట..

Allu Arjun

అలా అనుకున్నప్పుడే  చేయిస్తే బాగుండేది. కాని అప్పుడు ఎలా మిస్ అయ్యిందో తెలియదు.. కాని  ఇప్పటికి ఆ విషయంలో ఫీల్ అవుతాను. అంతే కాదు నాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా అనిపించింది.  ఉండి ఉంటే ఇంకా బాగుండేది.. ఇది చూసి ఆయన ఎంత సంతోషించేవారో అని  అనిపించింది. 

మా నాన్న ఎంత గర్వించినా, మా తాతయ్య ఆయన వారసత్వం నటుడిగా అని గర్వించేవాడు అంటూ తాతయ్యని తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు ఐకాన్ స్టార్. సో అలా షోలో తన తీరని తాత కోరికను గురించి వివరించాడు బన్నీ. ఇది ఇలా ఉంటే.. ప్రస్తుతం పుష్ప2 తో రిలీజ్ కు రెడీ అయిపోయాడు అల్లు అర్జున్. 

Alao Read: బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం, రిపబ్లిక్ డే కు రంగం సిద్ధం.

Allu Arjun, #Pushpa2, sukumar

పాన్ఇండియా వ్యాప్తంగా ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ పూనకాలు లోడింగ్ చేస్తన్నారు. సినిమా రిలీజ్ రోజు రెస్ట్ లెస్ గా ఊగిపోడానికి రెడీగా ఉన్నారు. రిలీజ్ కు ముందే వెయ్యికోట్లకు పైగా బిజినెస్ చేసింది పుష్ప2.. ఇక బాక్సాఫీస్ దగ్గర 2000ట్ల కలెక్షన్ మార్క్ దాటడం ఖాయం అంటున్నారు టీమ్. ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్ కు భయంకరమైన రెస్పాన్స్ వచ్చింది. 
 

ఇక ఈ సినిమాను ఆస్కార్ కు తీసుకెళ్ళే ఆలోచన కూడా చేస్తున్నారట టీమ్. మరి పుష్ప2 రిలీజ్ తరువాత అల్లు అర్జున్ రేంజ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈసినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ హైలెట్ కాబోతున్నట్టు సమాచారం. 

Latest Videos

click me!