ఎంజీఆర్ భార్య, తమిళనాడు మొదటి మహిళా ముఖ్యమంత్రి జానకి అమ్మ నూరేళ్ల వేడుక ఈరోజు చెన్నైలో జరిగింది. ఈ వేడుకకి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వం వహించారు. జానకి అమ్మ నూరేళ్ల వేడుక పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఎంజీఆర్ పెంపుడు కూతురు సుధా విజయకుమార్ పుస్తకాన్ని స్వీకరించారు.జానకితో కలిసి పనిచేసిన నటీనటులు రాజశ్రీ, వెన్నీరాడై నిర్మల, సచ్చు, కుట్టి పద్మిని లాంటి వారిని ఈ వేడుకలో సత్కరించారు.
Also Read: అల్లు అర్జున్ తీరని కోరిక ఏంటో తెలుసా..? బాలయ్యతో సీక్రెట్ పంచుకున్న బన్నీ.
ఈ వేడుకలో జానకి అమ్మ గురించి రజినీకాంత్ మాట్లాడిన వీడియోని ప్రదర్శించారు. ఎంజీఆర్ కోసం సినిమా జీవితాన్ని త్యాగం చేసి, ఆయనకు తోడుగా నిలబడ్డారు జానకి అమ్మ. రామావరం తోటకి ఎవరు వెళ్ళినా ఘనంగా ఆతిథ్యం ఇచ్చేవారు. పార్టీ కోసం పార్టీనే వదులుకున్నారు. అని అన్నారు రజినీ.
నేను ఆమెని మూడు సార్లు కలిశాను. రాఘవేంద్ర సినిమా సమయంలో ఒకసారి, ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి కలిశాను. మూడోసారి నేను షూటింగ్ లో ఉన్నప్పుడు నన్ను పిలిపించుకుని కలిశారు. స్వయంగా కాఫీ పెట్టి ఇచ్చారు అని గుర్తు చేసుకున్నారుతలైవా.
Also Read:రెహమాన్ మంచివాడు.. తప్పుగా రాయకండి... విడాకుల పై సైరాబాను ఏమన్నారంటే..
సినిమాల్లో నేను సిగరెట్ తాగడం మానేయాలని జానకి అమ్మ దగ్గర ఎంజీఆర్ చెప్పారట. ఆ విషయం ఆమె నాతో చెప్పారు. ఆమె రాజకీయాల్లోకి రావడం అనుకోకుండా జరిగింది. నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు చాలా మందితో మాట్లాడాను. అందరూ రకరకాలుగా చెప్పారు.
అవన్నీ విన్నాక నాకు చాలా ఆలోచనలు వచ్చాయి. అసలు వాళ్ళకి రాజకీయాలు తెలుసా లేదా అని నేను అనుకున్నా. రామకృష్ణ పరమహంస అంటారు, ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది నీకు మాత్రమే సంతోషాన్ని ఇస్తే ఆ నిర్ణయం తీసుకోకు. మిగతా వాళ్ళకి కూడా సంతోషాన్ని ఇస్తుందా అని ఆలోచించి నిర్ణయం తీసుకో.
జానకి ఎంజీఆర్
కార్యకర్తల సంతోషమే ముఖ్యం అనుకుని, అన్నాడీఎంకే కి ప్రధాన ఆయుధం అయిన రెండు ఆకుల గుర్తుతో సహా పార్టీ బాధ్యతలన్నీ జయలలితకు అప్పగించారు జానకి అమ్మ. అది ఆమె గొప్పతనం. ఆమె పరిణతికి నిదర్శనం. ఈరోజు ఆమె నూరేళ్ల వేడుక చేస్తున్న పార్టీకి, ఎడప్పాడి పళనిస్వామికి ధన్యవాదాలు అని రజినీకాంత్ అన్నారు.