వడ్డీల ద్వారా స్థిరమైన ఆదాయం పొందేందుకు అందరూ ఫిక్స్‌డ్ డిపాజిట్లు(Fixed deposit) చేస్తుంటారు. ఇలాంటి పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అనేక బ్యాంకులు అధిక వడ్డీరేట్లను ఇస్తుంటాయి. కొన్ని బ్యాంకులు గరిష్ఠంగా 9 శాతం వడ్డీ రేటు కూడా ఇస్తాయి. 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు Fixed deposit చేస్తే గరిష్ఠంగా 9 శాతం వడ్డీ వస్తుంది. అయితే 15 నెలలు, 12 నెలలు వంటి లో టైమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కి కూడా కొన్ని బ్యాంకులు 9 శాతం వడ్డీ రేటు ఇస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ (FD) పథకాల ద్వారానే స్థిరమైన రాబడిని పొందవచ్చు. తక్కువ వ్యవధిలో పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందాలనుకుంటే ఎస్బీఐ 400 రోజుల పథకం మీకు చక్కని ఎంపిక.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 400 రోజుల ప్రత్యేక FD పథకాన్ని 7.60 % వడ్డీతో అందిస్తోంది. మార్చి 31, 2025 వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి గాను మీరు మాక్సిమం రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు.
ఎస్బీఐ అమృత్ కలాష్ పథకం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేకమైన ఫిక్సడ్ డిపాజిట్ (FD) పథకం. ఇది కేవలం పరిమిత కాలానికి అందుబాటులో ఉంటుంది. అమృత్ కలాష్ పథకాన్ని ఏప్రిల్ 12, 2023న ప్రారంభించారు. జూన్ 30, 2023 వరకు పెట్టుబడికి గడువు ఉండేది. తర్వాత డిసెంబర్ 31, 2023 వరకు, ఆపై సెప్టెంబర్ 30, 2024 వరకు పొడిగించారు. మంచి ఆదరణ లభించడంతో మార్చి 31, 2024 వరకు గడువు పొడిగించారు. మళ్లీ దీన్ని కొనసాగించడానికి ప్రస్తుతం ఈ పథకం 2025 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.
ఎస్బీఐ అమృత్ కలాష్ పథకంలో పెట్టుబడి పెట్టిన సాధారణ ఖాతాదారులకు 7.10 % వార్షిక వడ్డీ లభిస్తుంది. ఇదే పథకంలో పెట్టుబడి పెట్టిన సీనియర్ సిటిజన్లకు 7.60 % వార్షిక వడ్డీ లభిస్తుంది.
ఈ స్కీమ్ లో ఉన్న మరో ముఖ్యమైన బెనిఫిట్ ఏమిటంటే లోన్ సౌకర్యం. అంటే మీరు పెట్టుబడిగా పెట్టిన డిపాజిట్‌పై రుణం పొందే అవకాశం ఈ స్కీమ్ లో ఉంది.
మీరు గాని ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే నేరుగా ఎస్బీఐ బ్రాంచ్‌లకు వెళ్లి వివరాలు తెలుసుకొని ఇన్వెస్ట్ చేయవచ్చు. లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరే స్వయంగా ఈ స్కీమ్ లో చేరవచ్చు. మరో అవకాశం ఏంటంటే.. YONO యాప్ ద్వారా కూడా మీరు ఎస్బీఐ అమృత్ కలాష్ పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఎస్బీఐ అమృత్ కలాష్ పథకానికి కాలపరిమితి కేవలం 400 రోజులు మాత్రమే. ఇతర FD పథకాలతో పోల్చితే ఇందులో ఎక్కువ వడ్డీ రేటు వస్తుంది. ఇందులో మీరు ఎంత పెట్టుబడి పెట్టగలిగితే అంత పెట్టడానికి అవకాశం ఉంటుంది. దానికి 7.10% వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి ₹5 లక్షల వరకు DICGC ఇన్సూరెన్స్ కలదు. డిపాజిట్‌పై రుణం పొందే సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
అమృత్ కలాష్ పథకంలో చేరే సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.5% వడ్డీ లభిస్తుంది. వారికి 7.60% వడ్డీ లభిస్తుంది. ఎస్బీఐ అమృత్ కలాష్ FD పథకంలో చేరడానికి సమీపంలోని ఎస్బీఐ బ్యాంక్ శాఖను సంప్రదించవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి ధ్రువపత్రాలతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను జత చేయాలి.