సెక్స్ లేని మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?

First Published | Aug 19, 2021, 1:52 PM IST


చాలా మంది ఇంటి పనికీ, ఆఫీసు పనికి ప్రాధాన్యత ఇచ్చి.. సెక్స్ లైఫ్ ని పట్టించుకోరు. అలాంటప్పుడు.. ఒకరిపై మరొకరికి కోపం, అసహనం లాంటివి పెరిగిపోతాయి.


మ్యారేజ్ లైఫ్  లో శృంగారం చాలా ముఖ్యం.  సెక్స్ లైఫ్ ఆనందంగా ఉన్నంత వరకు  మ్యారేజ్ లైఫ్ అద్భుతంగానే ఉంటుంది.  చాలా మంది ఈ విషయాన్ని నమ్మరు. కానీ  సెక్స్ లైఫ్ లేని జీవితం ఊహించడం కష్టమని చెబుతున్నారు.  అలా కాకుండా..  ఒక్కసారి భార్య భర్తల మధ్య సెక్స్ లైఫ్ దూరమైతే ఎలా ఉంటుందో.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
 

సెక్స్ ని ఆస్వాదించాలని భర్తకి ఉన్నా.. భార్య దూరంగా పెట్టడం లేదంటే.. భార్యకు కావాలని ఉన్నా.. భర్త దూరంగా ఉండటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు.. వివాహేతర సంబంధాలు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారు కోరుకున్నవి తమ పార్ట్ నర్ తీర్చని సమయంలో.. వారు దానిని వేరేవారి దగ్గర కోరుకుంటారు. వేరేవారికి దగ్గరౌతారు. అలా వారి కోరికలు తీర్చుకుంటారు. దీని వల్ల కుటుంబాలు చిన్నా భిన్నామైన సందర్భాలు చాలా నే ఉన్నాయి.
 

Latest Videos


చాలా మంది ఇంటి పనికీ, ఆఫీసు పనికి ప్రాధాన్యత ఇచ్చి.. సెక్స్ లైఫ్ ని పట్టించుకోరు. అలాంటప్పుడు.. ఒకరిపై మరొకరికి కోపం, అసహనం లాంటివి పెరిగిపోతాయి. చిరాకు కూడా పెరుగుతుంది. దీంతో.. ఇద్దరి మధ్యా బేధాభిప్రాయాలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి..  వారానికి ఒక్కసారైనా సెక్స్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి.  నిద్రతోపాటు.. సెక్స్  పట్ల కూడా ఇంట్రస్ట్ చూపించాలి.

దంపతుల మధ్య శృంగారం అనే బాండింగ్ లేకపోతే... వారిద్దరి మధ్య మానసికంగా బాండింగ్  కూడా తగ్గిపోతుంది. వివాహంలో సెక్స్, ప్రేమ అన్నీ.. ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. వివాహ బంధాన్ని కొనసాగించడానికి ప్రేమ, శృంగారం రెండింటికీ ప్రాధాన్యం ఇవ్వాలి. రెండింటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వకున్నా వారి బంధం సునాయాసంగా కొనసాగదు.

సెక్స్ లైఫ్ సాఫీగా సాగకుంటే... వారిలో ఒత్తిడి బాగా పెరుగుతుంది. దీంతో.. అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. దేనినీ పూర్తిగా ఆస్వాదించలేరు. కోపం, చిరాకు పెరిగిపోతాయి. వాటన్నింటినీ..  తగ్గించే శక్తి కేవలం సెక్స్ లోనే ఉందనే విషయం గుర్తించాలి.

click me!