లైంగిక జీవితంలో అసంతృప్తిగా ఉన్నారా అయితే ఓసారి ఇలా ట్రై చెయ్యండి!

First Published | Dec 19, 2021, 12:02 PM IST

దాంపత్య జీవితంలో సెక్స్ అనేది చాలా ముఖ్యం. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమను మరింత పెంచేందుకు దోహదపడుతుంది. వయసుతో సంబంధం లేకుండా రోజూ సెక్స్ లో పాల్గొనాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది.
 

 ఒక సంస్థ చేపట్టిన అధ్యయనంలో రోజూ సెక్స్ లో పాల్గొంటే ఆరోగ్యానికి (Health) మంచిదని తేలింది. కానీ ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా వారు రోజూ సెక్స్ లో పాల్గొనడానికి శరీరం అనుకూలించుటలేదు. అయితే లైంగిక శక్తిని (Sexual energy) పెంచే ఆహారపు అలవాట్లను రోజువారీ జీవనశైలిలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుందని శృంగార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
 

అంజీర పండు: అంజీర పండులో (Fig) విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. ఇవి శరీరంలోని కామనాడులను ఉత్తేజపరిచి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. అంజీర పండ్లు శరీరానికి మంచి వయాగ్రాగా (Viagra) పనిచేస్తాయి.
 

Latest Videos


వెల్లుల్లి: వెల్లుల్లిలో (Garlic) ఉండే ఎల్లిసిన్ (Ellisin) సెక్సువల్ ఆర్గాన్స్ కు రక్తప్రసరణ అందించి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. లైంగిక అవయవాల పనితీరును మెరుగుపరిచి రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనడానికి సహాయపడతాయి. కనుక నిత్యం వెల్లుల్లిని తీసుకోవడం లైంగిక జీవితానికి మంచిది. 
 

ఆస్పరాగస్: ఆస్పరాగస్ (Asparagus) ని పిల్లితీగల అని కూడా అంటారు. ఇందులో పొటాషియం (Potassium), థైమిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావల్సిన శక్తిని అందించి కామ కోరికలు పెంచే సహజసిద్ధమైన ఆహార పదార్థంగా ఉపయోగపడుతుంది. ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మీ శృంగార సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఆస్పరాగస్ ను తీసుకోండి.
 

పుచ్చకాయ: పుచ్చకాయలు (Watermelons) అమినో యాసిడ్స్ (Amino acids) పుష్కలంగా ఉంటాయి. ఇవి పురుషులలో, స్త్రీలలో రక్త ప్రసరణను పెంచి లైంగిక వాంఛలను పెంచుతాయి. పుచ్చకాయ లైంగిక వాంఛలను పెంచే మంచి వయాగ్రాగా పనిచేస్తుంది. ఇది పురుషులలో శృంగార సామర్థ్యాన్ని పెంచి వీర్య కణాల వృద్ధిని పెంచుతుంది. 
 

అవోకాడో: అవోకాడో (Avocado) శృంగార సామర్థ్యాన్ని పెంచే మంచి ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది. ఇందులో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్
(Monounsaturated fats) పుష్కలంగా ఉంటాయి. ఇవి మగవారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతాయి. ఇది శరీర హార్మోన్ల ఉత్పత్తిని పెంచి సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది. అవోకాడో తినండి మీ సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయండి.

గుమ్మడికాయ విత్తనాలు: గుమ్మడికాయ విత్తనాలలో (Pumpkin seeds) జింక్‌, మాంగనీస్‌,విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) కూడా ఉంటాయి. ఇవి  ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తికి, పురుషుల్లో టెస్టోస్టెరోన్ లోపం నివారించడానికి సహాయపడతాయి. ప్రతి రోజు గుమ్మడి కాయ విత్తనాలను తినండి మీ సెక్సువల్ లైఫ్ ని ఎంజాయ్ చేయండి.

click me!