సెక్స్ అంటే కేవలం సరదా మాత్రమే కాదు. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీకు తెలుసా? ప్రతి ఉద్వేగం మీ శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ నుు విడుదల చేస్తుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు సెక్స్ లో క్రమం తప్పకుండా పాల్గొనడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. ఒత్తిడి, నిరాశ, యాంగ్జైటీ తగ్గుతాయి. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే బాగా నిద్రపోవడానికి కూడా మీకు సహాయపడుతుంది. అలాగే మీ బంధం మరింత బలపడుతుంది. మంచి సెక్స్ కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ భాగస్వామితో కమ్యూనికేట్ చేయండి
కోరికలు, కలల గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకునే జంటలు మంచి సెక్స్, ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉంటారని పరిశోధనలో తేలింది. మీకు ఏది ఇష్టం, ఏది నచ్చదో మీ భాగస్వామికి చెప్పండి. మీకు ఇష్టమైన సెక్స్ ఫాంటసీలు, కోరికల గురించి మీ భాగస్వామితో చెప్పండి. ఒకవేళ మీ భాగస్వామితో వీటిని చెప్పడానికి సిగ్గుపడితే పేపర్ లో రాసి ఇవ్వండి.
Sex
ఏదైనా భిన్నంగా ప్రయత్నించండి
భిన్నంగా ప్రయత్నిస్తేనే సెక్స్ లైఫ్ బోరింగ్ గా అనిపించదు. అలాగే ఇది మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. డైరెక్ట్ సెక్స్ లో పాల్గొనకుండా ముందు ఫోర్ ప్లే లో పాల్గొనండి. ఒకరినొకరు కొత్త మార్గాల్లో తాకండి. అలాగే కొత్త కొత్త సెక్స్ పొజీషన్స్ ను ట్రై చేయండి. అవసరమైతే సెక్స్ టాయ్స్ ను కూడా ఉపయోగించండి. ఇవి మీకు మంచి ఆనందాన్ని కలిగిస్తాయి.
వ్యాయామం
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బెడ్ రూం లో స్టామినా పెరుగుతుంది. అంతేకాదు మిమ్మల్ని మంచి మూడ్ లో ఉంచుతుంది. వ్యాయామం మీ శరీరాన్ని బలంగా చేస్తుంది. ఇది ఆత్మగౌరవాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మీకు సెక్సీ అనుభూతిని కలిగిస్తుంది. లైంగిక జీవితాన్ని మెరుగుపరచడానికి ఎంత వ్యాయామం అవసరమో స్పష్టంగా తెలియదు. అందుకే ప్రామాణిక సిఫార్సులతో ప్రారంభించండి. 150 నిమిషాల ఏరోబిక్ కార్యాచరణ, వారానికి రెండు రోజుల బలం శిక్షణలో పాల్గొనండి.
Image: Getty
కావలసినంత సమయం తీసుకోండి
మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ సెక్స్ మీ రోజులో ఒక భాగం. అందుకే దీనికి తొందరపడకూడదు. ముందు ఫోర్ ప్లేలో పాల్గొనండి. ఒకరినొకరు తాకడం, ముద్దు పెట్టుకోవడం వంటి పనులను చేయండి. ఇవి సెక్స్ ను మరింత ఆహ్లాదకరంగా మార్చడానికి సహాయపడతాయి. వీటివల్ల మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. ఇది మీ బంధానికి చాలా మంచిది.
లూబ్రికేషన్ ఉపయోగించండి
మహిళల శరీరాలు సహజంగా వారి స్వంత కందెనను తయారు చేస్తాయి. కానీ కొన్నిసార్లు ఇది తక్కువగా ఉంటుంది. రుతువిరతి సమయంలో హార్మోన్ల మార్పులు యోని పొడిబారడానికి కారణమవుతాయి. దీనివల్ల సెక్స్ లో నొప్పి కలుగుతుంది. వాటర్ ఆధారిత కందెన కండోమ్లను ఉపయోగించడం సురక్షితం. కానీ సిలికాన్ ఆధారిత ల్యూబ్స్ ఆనల్ సెక్స్ కు తక్కువ చికాకు కలిగిస్తాయి.
డాక్టర్ ను సంప్రదించండి
కొన్ని అనారోగ్య సమస్యలు, మందులు కూడా శృంగారానికి మిమ్మల్ని దూరం చేస్తాయి. యాంటి డిప్రెసెంట్స్, రక్తపోటు మందులు వంటి కొన్ని మందులు మీ సెక్స్ కోరికలను తగ్గిస్తాయి. గుండె జబ్బులు, యోని పొడిబారడం, మల్టిపుల్ స్క్లెరోసిస్ లేదా నిరాశ వంటి అనారోగ్య సమస్యలు కూడా ఇందుకు కారణమవుతాయి. ఆరోగ్య సమస్యలు మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి చెకప్ లు ఖచ్చితంగా చేయించుకోవాలి.