నెట్‌ ఫ్లిక్స్ చేతిలో నాగచైతన్య, శోభితా మ్యారేజ్‌ ఓటీటీ రైట్స్, ఎంతనో తెలిస్తే మతిపోవాల్సిందే

First Published | Nov 26, 2024, 11:51 AM IST

నాగచైతన్య, శోభితా దూళిపాళ పెళ్లి త్వరలో జరగబోతుంది. అయితే వీరి మ్యారేజ్‌కి ఓటీటీ స్ట్రీమింగ్‌ రైట్స్ ని నెట్‌ ఫ్లిక్స్ దక్కించుకుందట. ఎంతనో తెలిస్తే మాత్రం షాకే. 

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల

అక్కినేని ఫ్యామిలీ వారసుడిగా రాణిస్తున్న నాగచైతన్య. యువ సామ్రాట్‌గా మెప్పిస్తున్న ఆయన 2017లో నటి సమంతను వివాహం చేసుకున్న విసయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట, నాలుగేళ్లలో విడాకులు తీసుకుని విడిపోయారు. సమంతతో విడాకుల తర్వాత నటి శోభిత ధూళిపాళ్లను ప్రేమించారు నాగ చైతన్య.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

నాగ చైతన్య ప్రియురాలు శోభిత

ఈ ఇద్దరు సీక్రెట్‌గా లవ్‌ ట్రాక్‌ని నడిపించారు. అయితే ఎంత రహస్యంగా ఉన్నా, విదేశాల్లో మాత్రం దొరికిపోయారు. వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు లీక్‌ అయ్యాయి. అంతేకాదు వీరు కూడా పంచుకోగా, నెటిజన్లు పట్టేశారు. రూమర్లు స్టార్ట్ అయ్యాయి. అయినా దీనిపై స్పందించలేదు. ఏం తెలియనట్టుగానే వ్యవహరించారు. కానీ సడెన్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని అందరిని సర్‌ప్రైజ్‌ చేశారు. తమ సీక్రెట్‌ డేటింగ్‌ని అఫీషియల్‌ చేసేశారు. ఇక ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారు. 


నాగార్జున, నాగ చైతన్య, శోభిత

నిశ్చితార్థం సింపుల్‌గా ముగించినా, పెళ్లిని ఘనంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు నాగార్జున. డిసెంబర్ 4న నాగ చైతన్య - శోభిత జంట వివాహం జరగనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ఊపందుకున్నాయి. అన్నపూర్ణ స్టూడియోలోనే వీరి పెళ్లి నిర్వహించబోతున్నారు నాగ్‌. ఈ పెళ్లికి తమిళం, తెలుగు, హిందీ, కన్నడ ఇలా పలు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని  తెలుస్తుంది. 

నాగ చైతన్య-శోభిత పెళ్లి

ఇటీవలి కాలంలో పెళ్లి అనేది వ్యాపారంగా మారిపోయింది. ముఖ్యంగా నటులు, నటీమణుల పెళ్లి అంటే దాన్ని చూడటానికి అభిమానులు ఆసక్తి చూపుతారని గ్రహించి, దాన్ని వ్యాపారంగా మార్చి కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఇటీవలే నయనతార పెళ్లి వీడియో నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీగా విడుదలైంది. దీనికోసం నయనతార - విఘ్నేష్ శివన్ జంటకు రూ.25 కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు.

నాగ చైతన్య పెళ్లి స్ట్రీమింగ్ హక్కులు

ఈ నేపథ్యంలో, నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల జంట వివాహాన్ని ప్రసారం చేసే హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుందని తెలుస్తుంది. అది కూడా రూ.50 కోట్లు ఇచ్చి వీరి పెళ్లిని ప్రసారం చేసే హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. దీంతో నాగ చైతన్య - శోభిత జంట వివాహంలో కూడా కఠిన ఆంక్షలు ఉంటాయని తెలుస్తోంది. ఈ వార్త సినీ వర్గాల్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

read more:కీర్తిసురేష్‌ పెళ్లికి ముందు మతం మారుతుందా?

also read: ప్రభాస్‌కి అల్లు అర్జున్‌ ఊహించని గిఫ్ట్.. ఒక్క మాటలో డార్లింగ్‌ గురించి బన్నీ ఏం చెప్పాడంటే?

Latest Videos

click me!