టైటిల్ ఫేవరేట్ కి భారీ షాక్, ఓటింగ్ లో దూసుకుపోతున్న వైల్డ్ కార్డ్, డేంజర్ జోన్లో క్రేజీ కంటెస్టెంట్స్

First Published | Nov 26, 2024, 11:53 AM IST

13వ వారానికి గాను ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. కాగా ఓటింగ్ ట్రెండ్ గమనిస్తే షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వైల్డ్ కార్డ్ టాప్ లో దూసుకుపోతున్నాడు. టైటిల్ ఫేవరేట్ వెనుకబడ్డారు. 
 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశలో ఉంది. ఈ మూడు వారాలు చాలా కీలకం. ఈ వారం యష్మి ఎలిమినేట్ అయ్యింది. ఆమె నిష్క్రమణతో హౌస్లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. మిగతా నలుగురు ఎలిమినేట్ కానున్నారు. వైల్డ్ కార్డు నుండి నలుగురు, రెగ్యులర్ కంటెస్టెంట్స్ ఐదుగురు ఇంకా టైటిల్ రేసులో నిలిచారు.

Bigg boss telugu 8

సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ప్రతి కంటెస్టెంట్ తగు కారణాలు చెప్పి ఇద్దరు హౌస్ మేట్స్ ని నామినేట్ చేయాలి. నామినేట్ చేసిన కంటెస్టెంట్ ముఖం మీద రెడ్ కలర్ స్ప్రే చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ మధ్య వాడివేడి చర్చలు జరిగాయి. వాదోపవాదాలకు దిగారు. నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన అనంతరం బిగ్ బాస్ లిస్ట్ ప్రకటించారు. 
 


Bigg boss telugu 8

13వ వారానికి గాను నబీల్, పృథ్వి, విష్ణుప్రియ, నిఖిల్, ప్రేరణ, అవినాష్, టేస్టీ తేజ, గౌతమ్ నామినేట్ అయ్యారు. రోహిణి మెగా చీఫ్ కావడంతో ఆమెను ఎవరూ నామినేట్ చేయలేదు. రోహిణికి మినహాయింపు దక్కింది. ఈ వారం ఇంటిని వీడేది ఎవరనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పటి వరకు ఓటింగ్ ట్రెండ్ గమనిస్తే.. గౌతమ్ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడట. ఏకంగా 33 శాతం ఓట్లతో దూసుకుపోతున్నాడట. 
 

Bigg boss telugu 8

గౌతమ్ అనంతరం రెండో స్థానంలో ప్రేరణ ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె నిఖిల్ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం అనూహ్య పరిణామం. వీరిద్దరి మధ్య దాదాపు 8 శాతం ఓట్లు తేడా ఉన్నాయట. మూడో స్థానంలో నిఖిల్ ఉన్నాడట. కాగా టేస్టీ తేజ నాలుగో స్థానంలో ఉన్నాడట. బుల్లితెర స్టార్స్ ని కూడా టేస్టీ తేజా వెనక్కి నెట్టడం గమనించాల్సిన విషయం.

Bigg boss telugu 8

ఐదో స్థానంలో అవినాష్, ఆరో స్థానంలో నబీల్, ఏడో స్థానంలో పృథ్వి, ఎనిమిదో స్థానంలో విష్ణుప్రియ ఉన్నారట. ఈ నలుగురి మధ్య స్వల్ప ఓటింగ్ మాత్రమే తేడా ఉంది. ఓటింగ్ కి శుక్రవారం వరకు సమయం ఉన్న నేపథ్యంలో సమీకరణాలు మారవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితం ప్రకారం విష్ణుప్రియ, పృథ్విలలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. 

టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన విష్ణుప్రియ గ్రాఫ్ ఎంత దారుణంగా పడిపోయిందో ఓటింగ్ ట్రెండ్ చూస్తే అర్థం అవుతుంది. ప్రేమ మైకంలో పడిన విష్ణుప్రియ గేమ్ వదిలేయడం ఆమెకు మైనస్ అయ్యింది. కేవలం పాప్యులర్ యాంకర్ కావడంతో ఆమెకు ఓట్లు పడుతున్నాయి. ఏదో నెట్టుకొస్తోంది. ఫైనల్ కి వెళ్లకపోయినా ఆశ్చర్యం లేదు. 

Latest Videos

click me!