బరువు పెరుగుతున్నారా..? సెక్స్ లైఫ్ నాశనం..!

First Published | Sep 22, 2021, 2:27 PM IST

శరీరంలో అదనపు కొవ్వులను నిల్వ చేయడం వివిధ కారణాల వల్ల తక్కువ సెక్స్ డ్రైవ్‌కు దోహదం చేస్తుంది. అధిక బరువు ,ఊబకాయం మీ లైంగిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

మన శరీరంలోనూ అనూహ్య మార్పులు చోటుచేసుకోవడం చాలా సర్వ సాధారణం. హార్మోన్ల సమతుల్యంగా లేనప్పుడు.. కొందరు ఒకే సారి బరువు పెరిగిపోతారు.. కొందరు బలహీనంగా తయారౌతారు.  కొందరికి ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. ఏది ఏమైనా ఇలా శరీరంలో అనూహ్యంగా జరిగే మార్పులు.. తీవ్ర సమస్యలు తీసుకువస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆ సమస్యల్లో సెక్స్ కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా బరువు పెరగడం వల్ల.. శృంగారాన్ని ఆష్వాదించలేరని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos


అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది . వాటిలో కొన్ని మీ సెక్స్ డ్రైవ్‌కు కూడా ఆటంకం కలిగిస్తాయి. పురుషులు ,మహిళలు ఇద్దరికీ, శరీరంలో అదనపు కొవ్వులను నిల్వ చేయడం వివిధ కారణాల వల్ల తక్కువ సెక్స్ డ్రైవ్‌కు దోహదం చేస్తుంది. అధిక బరువు ,ఊబకాయం మీ లైంగిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

అధిక బరువు ఉన్న మహిళలు, పురుషులు సెక్స్ లైఫ్ ని తక్కువగా ఆస్వాదించగలుగుతారట.  స్థూలకాయం టెస్టో స్టెరాన్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది లైంగిక పనితీరుకు కీలకంగా పనిచేస్తుంది. అలాంటిది.. తక్కువగా విడుదల కావడం వల్ల వారిలో కోరికలు తగ్గిపోతాయి.

అధిక స్థాయి కొలెస్ట్రాల్ , ఇన్సులిన్ నిరోధకత మహిళల క్లిటోరిస్‌లో నాళాల నిరోధానికి దారితీస్తుంది. ఇది, యోనికి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. యోని  సున్నితమైన ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని తగ్గిపోవడం వల్ల కలయికలో పాల్గొన్నా.. దానిని పూర్తిగా ఆస్వాదించలేరు.
 

ఇక పురుషుల్లో అధిక బరువుతో బాధపడుతున్న వారిలో అంగస్తంభన సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.   ఈ సమస్య వారిని దీర్ఘకాలంగా వేధించడం గమనార్హం. ఎంత సేపు ప్రయత్నించినా.. అంగస్తంభన సమస్య మాత్రం తలెత్తడం ఖాయమని తేలుతోంది. ఈ సమస్య అధిక కొలిస్ట్రాల్ కారణంగానే జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక.. అధిక బరువు కారణంగా. సెక్స్ ని విభిన్న పొజిషన్స్ లో ఎంజాయ్ చేసే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఒకటే పొజిషన్ లో పాల్గొనాల్సి వస్తుంది. దాని కారణంగా కూడా సెక్స్ లైఫ్ బోర్ కొట్టే అవకాశం ఉంది. ఇక అలా కాదని అధిక బరువుతో ప్రయోగాలు చేస్తే..  గాయాలపాలయ్యే ప్రమాదం ఉంది.

ఇక మీరు అధిక బరువు కలిగి ఉండటం వల్ల.. మీ భాగస్వామికి కూడా అసౌకర్యం కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి.. అధిక బరువును తగ్గించుకునే ప్రయత్నాలు  చేయడమే మంచిది. కేవలం దీని కోసం కాకపోయినా.. అధిక బరువు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి.. ప్రతిరోజూ వ్యాయామం, డైట్ ఫాలో అవ్వడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

click me!