పెళ్లి తర్వాత ఆడవారికి సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ పోవడానికి కారణాలు ఇవే..!

First Published Apr 26, 2023, 9:42 AM IST

పెళ్లైన తర్వాత చాలా మంది ఆడవారికి సెక్స్ కోరికలు తగ్గిపోతుంటాయి. దీనివల్ల రిలేషన్ షిప్ కూడా రిస్క్ లో పడే అవకాశం ఉంది. అసలు ఆడవారికి సెక్స్ కోరికలు ఎందుకు తగ్గుతాయో తెలుసా? 
 

వివాహం అంటే కలిసి నిండు నూరేళ్లు జీవించడమే కాదు.. భావోద్వేగ, మానసిక, ఆధ్యాత్మిక, శారీరక, లైంగిక కోరికలను తీర్చే బాధ్యత కూడా. అయితే కొంతమందికి పెళ్లి అయిన కొన్నాళ్లకే బోర్ కొట్టడం మొదలవుతుంది. అలాంటి వారే తమ దాంపత్య జీవితంలో సెక్స్ అయిపోయిందని వాపోతుంటారు. దాంపత్య జీవితంలో సెక్స్ ఒక ఎమోషనల్ కనెక్షన్ గా పనిచేస్తుంది.  మీ సంబంధం ఆరోగ్యంగా ఉంటేనే మీ ఇద్దరు కలిసి ఆనందంగా ఉంటారు. కానీ మీ రిలేషన్ షిప్ లో చిన్నపాటి విభేదాలు వచ్చినా.. వారితో సెక్స్ అంటే ఒక టార్చర్ లా అనిపించే అవకాశం ఉంది. అసలు విషయానికొస్తే  పెళ్లి తర్వాత ఆడవారికి సెక్స్ పట్ల ఎందుకు కోరికలు తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

సెక్స్ కు సంబంధించి అపోహలు 

రతిక్రీడకు సంబంధించిన అపోహలు, అవగాహన లేకపోవడం, దానికి గురించి మాట్లాడటం నిషిద్ధం కారణంగా తమకు నచ్చింది దొరకదు కాబట్టి శృంగారంలో పాల్గొనాలనే కోరిక తగ్గిపోతోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల బెడ్ మీద తమ భాగస్వామితో సరదాగా శృంగారంలో పాల్గొనడం వారికి అసౌకర్యంగా అనిపిస్తుందట. ఏదేమైనా శృంగారంలో ఆనందం పొందడం కేవలం పురుషుల పని మాత్రమే అని వారు భావిస్తారట. దీనిలో పురుషుల ఆనందాన్ని మాత్రమే చూస్తారు కానీ.. ఆడవారికి ఇది ఆనందాన్ని కలిగించిందా లేదా? అనేది తెలుసుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. 
 

Latest Videos


భయం

సెక్స్ కావాలని అడగటం, దాని గురించి మాట్లాడటం తప్పుగా భావించేవారు చాలా మందే ఉన్నారు. ఇలా అడిగితే తప్పు చేశామన్నట్టుగా వేరేవాళ్లు చూస్తారని భావిస్తుంటారు. అందుకే చాలా మంది మహిళలకు తమకు ఇష్టం ఉన్నా, లేకున్నా.. సెక్స్ లో పాల్గొంటారు. దీనివల్ల కూడా ఆడవారికి సెక్స్ పట్ల కోరికలు తగ్గుతాయి. 
 

బాధ్యతలు 

పెళ్లి తర్వాత చాలా మంది మహిళలు ఇల్లు, పిల్లలు, వృత్తి బాధ్యతలతో చాలా బిజీ బిజీగా ఉంటారు. ఈ పనుల్లో ఎక్కువ సేపు గడపడం వల్ల వారికి సెక్స్ గురించి ఆలోచనలు తగ్గుతాయి. ముఖ్యంగా పని అలసట వల్ల చాలా మంది మహిళలు సెక్స్ లో ఆనందాన్ని పొందలేకపోతున్నారు. దీనిని పురుషులు కూడా అర్థం చేసుకోవాలి. 
 

హార్మోన్ల అసమతుల్యత

మహిళలు తమ జీవితంలోని అన్ని దశలలో హార్మోన్ల మార్పులకు లోనవుతారు. ముఖ్యంగా గర్భం, ఒత్తిడి లేదా జీవనశైలి కారణంగా హార్మోన్ల అసమతుల్యతకు గురవుతారు.  ఆడవారు సెక్స్ పట్ల ఆసక్తిని కోల్పోవడానికి ఇదే ప్రధాన కారణం. 

గర్భధారణ తర్వాత శరీరం గురించి అభద్రతా భావం

ప్రసవం తర్వాత మహిళలు భావోద్వేగ, శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. బిడ్డను చూసుకోవడం, తమ అవసరాలను తీర్చడం, ఇంటిని బాధ్యతను నిర్వహించడం అన్ని ఆడవారికి కష్టంగా ఉంటుంది. అందుకే ఇలాంటి బాధ్యతలున్న ఆడవారు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపరు. 
 

sex

మంచి సంబంధాలు లేకపోవడం

శృంగారంలో ఆనందం పొందడానికి మహిళలకు మరింత భావోద్వేగ సంబంధం, పరస్పర చర్య, దగ్గరి బంధాలు అవసరం. దంపతుల బంధం సవ్యంగా సాగకపోతే మహిళలు తమ భాగస్వామితో శృంగారంలో పాల్గొనడానికి ఇబ్బంది పడతారు.
 

click me!