సెక్స్ అంటే కేవలం సరదా కోసం చేసేది కాదు. దాని వల్ల దంపతుల మధ్య ప్రేమ, ఆప్యాతయ, అనుబంధం పెరుగుతాయి. ఒకరికి మరొకరు అనే భావన కూడా కలుగుతుంది. అలాంటి శృంగారాన్ని కూడా ఎలా పడితే అలా చేయకూడదు. టైమ్ పాస్ కోసం అస్సలు చేయకూడదు. చాలా మంది సెక్స్ చేసే సమయంలో.. లేదా సెక్స్ కి ప్రిపేర్ అవుతున్న సమయంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఈ పొరపాట్లు మీ సెక్స్ జీవితాన్ని నాశనం చేస్తాయి. అస్సలు చేయకూడని పొరపాట్లు ఇవే...
కలయిక సమయంలో తాము చేసిందే కరెక్ట్ అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ అస్సలు అలా అనుకోకూడదట. మీకు నచ్చిందే.. మీ పార్ట్ నర్ కి కూడా నచ్చుతుంది అనుకోవడం పొరపాటు. సెక్స్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కాబట్టి.. మీకు నచ్చింది చేయడం కాకుండా.. మీ పార్ట్ నర్ కి మీరు ఏది చేస్తే నచ్చుతుందో తెలుసుకొని చేయడం బెటర్..అలా చేయడం వల్ల మీ శారీరక , మానసిక సంబంధాన్ని బలోపేతమౌతుంది.
ప్రతి ఒక్క దంపతులకు సమస్యలు, బేధాభిప్రాయాలు రావడం సహజం. అయితే.. ఆ సమస్యలను పడక గది వరకు తీసుకురాకూడదు. ఒకవేళ మీ మధ్య సమస్య ఉంటే.. దాని గురించి మాట్లాడకుండా.. మీరు నిద్రపోకూడదు. ముందు.. ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి మీ పార్ట్ నర్ తో మాట్లాడాలి. అంతే కానీ.. పక్క గదిలోకి వెళ్లి పడుకోవడం లాంటివి చేయకూడదు. ఆ తర్వాత కలయికను ఆస్వాదించండి.
ఇది జంటలలో చాలా సాధారణం. ఇద్దరిలో ఎవరైనా కొన్నిసార్లు తమ భాగస్వామి బెడ్ పై ఏమి చేసినా తమకు ఒకే అన్నట్లుగా ప్రవర్తిస్తారు. వారికి ఒకే కాకపోయినా అయినట్లు నటిస్తారు.
SEX
నిజానికి వారికి సెక్స్ చేయాలనే మూడ్ లేకపోయినా.. ఉన్నట్లు నటిస్తారు. దాని వల్ల.. తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి.. నటించకుండా.. నిజంగా సెక్స్ ని ఆస్వాదించాలి. దానికి బదులు.... ముందు.. రొమాన్స్ కి చోటు ఇచ్చి.. తర్వాత కలయికలో పాల్గొనడం బెటర్.
ఇక చాలా మంది సెక్స్ లో పాల్గొనే సమయానికి... లావుగా ఉన్నారని.. పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయని ఆ సమయంలో మాట్లాడుకోవడం మంచిది కాదు.. అది మీ దాంపత్య జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుంది.