భార్యకు విడాకులు ఇవ్వడానికి వీరు చెప్పిన కారణాలేంటో తెలుసా?

First Published | May 5, 2023, 3:51 PM IST

కొంత మంది పురుషులు తాము తమ భార్యలతో విడాకులు తీసుకోవడానికి గల కారణాలను వివరించారు. ఇలాంటి కారణాలకు కూడా విడాకులు ఇస్తారా అనే సందేహం కలగడం విశేషం.

divorce

ప్రతి ఒక్కరూ జీవితాంతం కలిసి ఉండాలనే పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లి తర్వాత  వారి మధ్య కంపాటబులిటీ లేకపోవడం, లేదా ఇతర కారణాల వల్ల, వారి మధ్య మనస్పర్థలు వచ్చి చివరకు విడాకులకు దారితీస్తున్నాయి. అయితే, కొంత మంది పురుషులు తాము తమ భార్యలతో విడాకులు తీసుకోవడానికి గల కారణాలను వివరించారు. ఇలాంటి కారణాలకు కూడా విడాకులు ఇస్తారా అనే సందేహం కలగడం విశేషం. మరి ఆ కారణాలేంటో మనమూ ఓసారి చూద్దాం...

Divorced Photoshoot

1.అతి శుభ్రత...
మీరు చదివింది నిజమే. భార్యకు అతిశుభ్రత ఉందనే కారణంతో ఓ వ్యక్తి విడాకులు ఇచ్చాడు. పరిశుభ్రత ముఖ్యమని నాకు కూడా తెలుసు. కానీ నా భార్య ది అతి శుభ్రత. దానిని తట్టుకోవడం చాలా కష్టం. ఎప్పుడూ శుభ్రం చేసిన వస్తువులనే మళ్లీ శుభ్రం చేస్తూ ఉంటుంది. మా ఇద్దరి మధ్య గొడవలకు ఆ అతి శుభ్రతే కారణమని నాకు అర్థమైంది. అందుకే విడాకులు తీసుకున్నాం అని ఓ వ్యక్తి చెప్పడం విశేషం.

Latest Videos


divorce court

2.ఆర్థిక సమస్యలు

“నా భార్య పరమ పిసినారి. డబ్బు గురించి ఆందోళన చెందడం అవసరం కానీ మరమ్మతులు అవసరమయ్యే వాటిపై డబ్బు ఖర్చు చేయడానికి ఆమె నిరాకరిస్తుంది! ఎవరైనా జబ్బుపడినా ఆమె డబ్బు ఖర్చు చేయదు. ఆమె ఇంటి  గురించి ఆలోచిస్తుంది. నేను గత ఆరు సంవత్సరాలుగా ఒక్క సెలవులో లేను. జీతం కట్ అవుతుందని ఆమె కనీసం సెలవు  కూడా పెట్టనివ్వదు. అందుకే మూడు నెలల క్రితమే విడాకులకు అప్లై చేశాం.’’ అని ఓ వ్యక్తి చెప్పడం విశేషం

divorce

3.పెంపుడు జంతువులు

“ఎవరైనా వారి భాగస్వామికి విడాకులు ఇవ్వడానికి ఇది చాలా అసాధారణమైన కారణం కావచ్చు-నేను నా భార్యకు ఆమె పిల్లుల కారణంగా విడాకులు ఇచ్చాను! మాకు పెళ్లయినప్పటి నుంచి ఆమె పిల్లులు నాకు ఇబ్బందిగా ఉన్నాయి. అవి నా షర్టులను నాశనం చేశాయి.ఎక్కడ పడితే అక్కడ టాయ్ లెట్ కి వెళతాయి. ఒకసారి కోపంతో నేను కావాలా, పిల్లులు కావాలా తేల్చుకోమన్నాను. ఆమె ఆ పిల్లలను ఎంచుకుంది. నాకు విడాకులు ఇచ్చిది.’’ అని మరో వ్యక్తి చెప్పాడు.

Divorce Case

 4.కెరీర్‌పై దృష్టి పెట్టింది

“నా భార్య చాలా కెరీర్ ఓరియెంటెడ్ పర్సన్. ఆమె కెరీర్‌తో సంబంధం ఉంది, నాతో కాదు. ఆమె తన ఉద్యోగానికి చాలా ప్రాధాన్యతనిస్తుంది, ఆమె మా వివాహం, కుటుంబంపై శ్రద్ధ చూపదు. ఈ నిర్లక్ష్య భావన నన్ను ఆమెతో విడాకులు తీసుకునేలా చేసింది. నేను నిర్లక్ష్యానికి గురికావడాన్ని సహించలేను. నాతో సమయం గడపమని ఆమెను ప్రోత్సహించడం ద్వారా నేను మా మధ్య సరిదిద్దడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమె పట్టించుకోలేదు. అందుకే విడాకులు తప్పలేదు.’’ అని మరో యువకుడు చెప్పాడు. 

click me!