ఈ వ్యాధులుంటే సెక్స్ లో పాల్గొనడం కష్టమే..!

First Published | May 21, 2023, 10:40 AM IST

సెక్స్ కూడా ఒక పనిగా అనిపిస్తోందా? మీ భాగస్వామితో సెక్స్ చేయడానికి కష్టంగా ఉందా? అయితే మీకు ఆ సమస్యలున్నట్టేనంటున్నారు నిపుణులు. అవును లైంగిక ఆసక్తి తగ్గడం, సెక్స్ లో పాల్గొనడానికి మొత్తమే ఇంట్రెస్ట్ లేకపోవడం వంటివి కొన్ని రోగాల వల్ల అనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. 
 

మీరు నమ్మినా నమ్మకపోయినా లైంగిక ఆరోగ్యం మీ మొత్తం ఆరోగ్యంతో నేరుగా సంబంధం కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ ఎన్నో రోగాలను దూరం చేస్తుంది. అయితే సెక్స్ చేయడంలో ఇబ్బంది ఉన్నవారికి హృదయ సంబంధ, జీవక్రియ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. పేలవమైన లైంగిక ఆరోగ్యం రెండింటిని ప్రభావితం చేస్తుంది. ఒకటి పునరుత్పత్తి. రెండు సంతానోత్పత్తి సామర్థ్యం. అయితే మీకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటే మీకు సెక్స్ పై ఇంట్రెస్ట్ ఉండదు. 
 

స్థూలకాయం, డయాబెటిస్ మెల్లిటస్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, హార్మోన్ల అసమతుల్యత, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు, ఆందోళన నిరాశ లేదా అపరాధం, మద్యం, ధూమపానం, మాదకద్రవ్యాలు వంటి మానసిక, ఆరోగ్య సమస్యలు స్త్రీపురుషులలో లైంగిక పనితీరును తగ్గిస్తాయి. మానసిక వ్యాధులు, అధిక రక్తపోటు కోసం తీసుకునే కొన్ని మందులు కూడా లైంగికంగా పనిచేయకపోవడానికి కారణమవుతాయి.
 

Latest Videos


లైంగికంగా పనిచేయకపోవడం రకాలు

కోరిక రుగ్మత: సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడం
ఉద్వేగ రుగ్మత: ప్రేరేపించలేకపోవడం
భావప్రాప్తి రుగ్మత: ఉద్వేగం లేకపోవడం లేదా ఆలస్యం
నొప్పి రుగ్మత: సంభోగం సమయంలో నొప్పి

అయితే 40 ఏండ్లు పైబడిన పురుషులు, మహిళల్లో లైంగిక పనిచేయకపోవడం సర్వసాధారణం.
 

లైంగిక పనిచేయకపోవడాన్ని ఎలా గుర్తించాలి?

లక్షణాలు ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి అలాగే ఒక లింగానికి మరొక లింగానికి మారొచ్చు. లైంగిక పనిచేయకపోవడం లక్షణాలు ఎలా ఉంటాయంటే.. 

పురుషులలో లక్షణాలు:

అంగస్తంభన ఉండదు లేదా కొద్దిగానే ఉంది. దీనిని అంగస్తంభన లోపం అంటారు. 
స్ఖలనం లేకపోవడం లేదా ఆలస్యం కావడం
అకాల స్ఖలనం

మహిళల్లో లక్షణాలు:

భావప్రాప్తి లేకపోవడం
సంభోగం సమయంలో యోని పొడిబారడం
ఫ్రిజిడిటీ - బిగుతు యోని కండరాల కారణంగా సంభోగం చేయలేకపోవడం

పురుషులు,మహిళలు ఇద్దరిలో సాధారణ లక్షణాలు

సెక్స్ కోరిక లేకపోవడం
ఉద్వేగం ఉండకపోవడం
నొప్పి
 

ఊబకాయం

 శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. స్థూలకాయ పురుషుల్లో తక్కువ టెస్టోస్టెరాన్, అంగస్తంభన, కోరికలు తగ్గడం, పేలవమైన భావప్రాప్తి వంటి సమస్యలు వస్తాయి. ఊబకాయం మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది సెక్స్ పై కోరికను తగ్గిస్తుంది. అలాగే సంభోగం సమయంలో అసౌకర్యాన్ని పెంచుతుంది. 
 

హృదయ సంబంధ వ్యాధులు

అధిక రక్తపోటు, గుండె జబ్బులు లైంగిక పనితీరును తగ్గిస్తాయి. ఇవి అంగస్తంభన లోపానికి కారణమయ్యే పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి. మహిళల్లో అయితే జననేంద్రియ అవయవాలకు ప్రవాహం తగ్గి యోని పొడిబారుతుంది. ఉద్వేగం ఉండదు. ఇది లైంగిక అసంతృప్తికి దారితీస్తుంది.

డయాబెటిస్

డయాబెటిస్ రక్త నాళాలు, నరాలను దెబ్బతీస్తుంది. ఇది అంగస్తంభన, పురుషులలో సెక్స్ కోరికలు తగ్గడం, మహిళల్లో భావప్రాప్తి తగ్గడానికి దారితీస్తుంది.
 

మానసిక ఆరోగ్య సమస్యలు

నిరాశ, ఆందోళన, ఒత్తిడి వంటివన్నీ లైంగిక కోరికలను తగ్గిస్తాయి. ఇది లైంగిక పనితీరును ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఉద్రేకం తగ్గడం, తక్కువ ఆత్మ విశ్వాసం, సంబంధాలు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి. ప్రొఫెషనల్ కౌన్సిలింగ్, రిలాక్సేషన్ టెక్నిక్స్, తగిన మందులు లైంగిక పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి.
 

జీవనశైలి వ్యాధులను ముందుగానే గుర్తించి ఆ రోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, ఒత్తిడిని తగ్గించడం, వ్యాధులకు తగిన చికిత్స తీసుకోవడం ద్వారా లైంగిక పనితీరును మెరుగుపర్చుకోవచ్చు. 

click me!