హస్త ప్రయోగం ఎక్కువగా చేసారో ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త

First Published | Jul 24, 2023, 9:46 AM IST

హస్త ప్రయోగంతో బోలెడు లాభాలున్నాయి. దీనివల్ల ఎలాంటి హానికూడా జరగదు. కానీ కొన్ని సార్లు మాత్రం ఇది ప్రయోజనాలకు బదులుగా నష్టాలను కలిగిస్తుంది తెలుసా? 
 

Climax for women getting from Pegasm


యోని ఉద్దీపన లేదా హస్త ప్రయోగం మంచి లైంగిక ఆనందాన్ని కలిగిస్తుంది. దీనికి భాగస్వామితో సంబంధం లేదు. అయితే ఈ హస్త ప్రయోగం మీ లైంగిక ప్రతిస్పందనను కూడా పెంచుతుంది. నిజానికి హస్త ప్రయోగం ఒత్తిడిని తగ్గించడం నుంచి ఎన్నో ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. క్లిటోరిస్ అత్యంత సున్నితమైన, ఉత్తేజపరిచే అవయవం. మిమ్మల్ని ఉత్తేజపరచడమే ఈ అవయవం  పని. నిపుణుల అభిప్రాయం ప్రకారం..దీని సహాయంతో మిమ్మల్ని మీరు లైంగికంగా ప్రేరేపించొచ్చు. అలాగే భావప్రాప్తిని పొందొచ్చు. అయితే దీనితో పాటు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమొకటుంది.ఏంటంటే.. ఈ భాగం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. అందుకే ఆడవాళ్లు హస్త ప్రయోగం ఎక్కువగా చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

masturbation

యోని ఇన్ఫెక్షన్

వైబ్రేటర్స్ వంటి పరికరాలతో అతిగా ప్రేరేపించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది యోని చుట్టూ గాయాలు అయ్యే అవకాశాలను పెంచుతుంది. గాయం వల్ల వాపు కూడా వస్తుంది. ముఖ్యంగా గాయాల కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. 
 

Latest Videos



యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్

మురికి చేతులు లేదా నీట్ గా లేని వైబ్రేటర్లను ఉపయోగించడం వల్ల కూడా మూత్ర మార్గ సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. ఇది మీ మూత్రాశయనికి దగ్గరగా ఉంటుంది. అందుకే బ్యాక్టీరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి సమయంలో మీరు మూత్ర విసర్జన చేసేటప్పుడు చికాకు, నొప్పి కలుగుతాయి. 
 

యోని పొడిబారడం

నిపుణుల ప్రకారం.. మీరు యోనిని మరీ ఎక్కువగా రుద్దినప్పుడు ఆ భాగంలోని చెమట గ్రంథులు పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇలా పదేపదే చేయడం వల్ల ఈ రంధ్రాలు మూసుకుపోయి యోని పొడిబారుతుంది. ఇది వాపుకు కూడా కారణమవుతుంది.

లైంగికంగా పనిచేయకపోవడం

అయితే మీరు ఒక అవయవంపై ఎక్కువ ఒత్తిడి పెట్టినప్పుడు అది పనిచేయడం ఆగిపోతుంది. హస్తప్రయోగంలోనూ ఇదే జరుగుతుంది. హస్తప్రయోగం ఎక్కువగా చేసినప్పుడు ఈ అవయవం మరింత సున్నితంగా మారుతుంది. అయితే ఇక్కడ ఉండే నరాలు పనిచేయడం మానేస్తాయి. ఇది లిబిడోను తగ్గిస్తుంది. దీంతో మీకు సెక్స్ పై ఇంట్రెస్ట్ తగ్గుతుంది.
 

సెక్స్ సమయంలో నొప్పి

మీరు మిమ్మల్ని అతిగా ప్రేరేపిస్తే మీ యోనికి గాయాలు కావొచ్చు. ఈ పరిస్థితిని డైస్పరేనియా అంటారు. ఇలాంటి పరిస్థితిలో సెక్స్ సమయంలో లేదా ఆ తర్వాత మీ జననేంద్రియాలలో చాలా నొప్పి వస్తుంది. అందుకే ఆడవాళ్లు హస్తప్రయోగం చేసేటప్పుడు మిమ్మల్ని అతిగా ప్రేరేపించకుండా జాగ్రత్త పడాలి. 

click me!