నగ్మాతో పాట కోసం బాబుమోహన్ పట్టుబట్టడం వెనుక కథేంటి?

First Published | Nov 26, 2024, 10:27 AM IST

నటి నగ్మా తన సరసన ఒక పాటలో నటించాలని బాబుమోహన్ పట్టుబట్టారు. రాజేంద్ర ప్రసాద్ తో విబేధాల కారణంగా మాయలోడు చిత్రంలో సౌందర్యతో బాబుమోహన్ పాట చిత్రీకరించబడింది. ఈ సంఘటన తర్వాత, బాబుమోహన్ తన సినిమాల్లో ఒక పాట ఉండాలని పట్టుబట్టేవారు.

Nagma


నటి నగ్మా ఇప్పుడు సినిమాలు చెయ్యకపోయినా ...ఈ తరంవారు కూడా వెంటనే గుర్తు పడతారు. ఒకప్పుడు తెలుగులో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ ల సరసన నటించింది. అంతే కాకుండా.. అప్పట్లో గ్లామర్ లో నగ్మాకు ఎవరు కూడా పోటీ వచ్చేవారు కారు.

ఆమె డేట్స్  కోసం నెలల తరబడి వెయిట్ చేసేవారు. ఆ స్దాయిలో వెలుగుతున్న నగ్మా తన సరసన ఓ పాట చెయ్యాల్సిందే అని అప్పట్లో కమిడియన్ గా వెలుగుతున్న బాబు మోహన్ పట్టుపట్టారట. ఈ విషయం ఇప్పటికీ అప్పుడప్పుడూ ఫిల్మ్ నగర్ క్లబ్ లో సరదా కబుర్లులలో చెప్పుకుంటారు. అసలేం జరిగిందో చూద్దాం. 

Nagma


తెలుగు  సినీ ఇండస్ట్రీలో స్టార్.. హీరోలు అందరి సరసన నటించి తనకంటూ మంచి పేరు సొంతం చేసుకున్న హీరోయిన్ నగ్మా.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.   తన అందచందాలతో, యాక్టింగ్‌తో అప్పట్లో సౌతిండియాను ఓ ఊపు ఊపేసింది నగ్మా నైన్టీస్‌లో యువతకు ఆమే కలలరాణి. అంతలా వెండితెరపై మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ తన సరసన నటించాలని హీరోలంతా కోరుకునేవారు. 


Nagma


నగ్మా 1990లో వచ్చిన బాగి: ఎ రెబెల్ ఫర్ లవ్ సినిమాతో పరిచయమయ్యింది. ఆ తర్వాత 1994లో వచ్చిన సుహాగ్ సినిమాలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ సరసన నటించింది. 1991లో పెద్దింటి అల్లుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, ఘరానా మొగుడు, అశ్వమేధం,  మేజర్ చంద్రకాంత్, వారసుడు, కొండపల్లి రాజ, అల్లరి అల్లుడు, రిక్షావోడు, సరదా బుల్లోడు, లాంటి సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యింది.

Nagma

నగ్మా  తన కెరీర్లో తెలుగు, తమిళ్, హిందీ, భోజ్ పూరి భాషల్లో కలిపి మొత్తం 73 సినిమాల్లో నటించింది. 2004లో పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన నగ్మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది 2014 లోక్ సభ ఎన్నికల్లో మీరట్ నుంచి లోక్ సభకు పోటి సి కొద్ది వోట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 

n nagma


ఇవన్నీ ప్రక్కన పెడితే... రాజేంద్రప్రసాద్ ఏర్పడ్డ విబేధాలవల్ల మాయలోడు చిత్రంలో సౌందర్యతో బాబూమోహన్ని పెట్టి ఒక పాట చిత్రీకరించారు ఎస్వీకృష్ణారెడ్డి. ఆ పాట రాజేంద్రప్రసాద్ తో తియ్యాలి. కాని అతడితో సరిపడక కృష్ణారెడ్డి "బాబూమోహన్ కంటే నువ్వేమీ గొప్పకాదు" అని రాజేంద్రప్రసాద్ చెప్పడానికి బాబూమోహన్తో పాట తీసాడు. ఆ పాట జనాన్ని ఆకర్షించింది. అప్పటి నించి తను నటించిన సినిమాల్లో ఒక పాట వుండాలని నిర్మాతల మీద ఒత్తిడి తెచ్చారట బాబూ మోహన్. 

Nagma


దానికి తోడు సానా యాదిరెడ్డి చిత్రం పిట్టలదొరలో ఇంత ముద్దంటే వెయ్యమ్మా అనే  పాట కూడా హిట్టవడంతో బాబూమోహన్ ఎక్కడా ఆగడంలేదు. తను హీరోగా నటించిన చిత్రాలు దారుణంగా ఫెయిలైనా తనకు ఒక పాట వుండాలని అడుగేవారట. ఆ క్రమంలో నవ్వులాట అనే చిత్రంలో తన ప్రక్కన నగ్మాను పెట్టి పాట తియ్యమని నిర్మాతను కోరాడు బాబూమోహన్.

బడ్జెట్ రీత్యా అది సాధ్యపడదని చెప్పడంతో అలిగి షూటింగ్ ఎగ్గొట్టాటర. ఇలా చేస్తే నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేస్తానని నిర్మాత బెదిరించడంతో దారిలోకి వచ్చాడట బాబూమోహన్, అప్పట్లో సక్సెస్ తో బాబూమోహన్  ఎవర్నీ లెక్కచేయడం లేదని పరిశ్రమలో  చెప్పుకున్నారు. అందులో నిజమెంత ఉన్నా ఇప్పటికీ అది ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడే టాపిక్ అవ్వటం విశేషం. 

బడ్జెట్ రీత్యా అది సాధ్యపడదని చెప్పడంతో అలిగి షూటింగ్ ఎగ్గొట్టాటర. ఇలా చేస్తే నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేస్తానని నిర్మాత బెదిరించడంతో దారిలోకి వచ్చాడట బాబూమోహన్, అప్పట్లో సక్సెస్ తో బాబూమోహన్  ఎవర్నీ లెక్కచేయడం లేదని పరిశ్రమలో  చెప్పుకున్నారు. అందులో నిజమెంత ఉన్నా ఇప్పటికీ అది ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడే టాపిక్ అవ్వటం విశేషం. 

Latest Videos

click me!