తాతయ్య పక్కన హీరోయిన్ గానా.. ఎన్టీఆర్ తో మొదటి సినిమాపై శ్రీదేవి షాకింగ్ రియాక్షన్! ఏం జరిగిదంటే?

First Published | Nov 26, 2024, 9:57 AM IST

ఎన్టీఆర్ కి శ్రీదేవి మనవరాలిగా చేసింది. ఆ తర్వాత ఆయన పక్కన హీరోయిన్ గా నటించింది. ఎన్టీఆర్ తో హీరోయిన్ గా మొదటి సినిమా ఆఫర్ వచ్చినప్పుడు, శ్రీదేవి రియాక్షన్ ఏమిటో తెలుసా?
 

Actress Sridevi

అతిలోక సుందరి శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టింది. అనంతరం హీరోయిన్ గా మారి.. ఇండియన్ సినిమాను ఆమె ఏలింది. సౌత్ లో దున్నేసిన శ్రీదేవి, బాలీవుడ్ కి వెళ్లి నెంబర్ వన్ హీరోయిన్ కావడం ఆమె ప్రతిభకు నిదర్శనం. అందానికి చిరునామాగా శ్రీదేవిని చెప్పుకునేవారు. 

NTR


ఇక ఎన్టీఆర్-శ్రీదేవిలది హిట్ కాంబినేషన్. వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, కొండవీటి సింహం, గజదొంగ వంటి సూపర్ హిట్స్ వీరి కాంబోలో వచ్చాయి. ఎన్టీఆర్ కి హీరోయిన్ గా శ్రీదేవి నటించిన మొదటి చిత్రం వేటగాడు. కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1979లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం అందుకుంది. ఎన్టీఆర్ తో హీరోయిన్ గా మొదటి ఛాన్స్ అందుకున్న శ్రీదేవి... షాక్ అయ్యారట. 
 


NTR

శ్రీదేవి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ''రాఘవేంద్రరావు దర్శకత్వంలో పనిచేయడం గొప్ప అనుభూతి. ఆయన సినిమాల్లో నటించిన ప్రతి హీరోయిన్ డ్రీమ్ గర్ల్ అయిపోయింది. ఆయనతో నేను చేసిన ప్రతి సినిమా, ప్రతి పాట హిట్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నేను చేసిన ఫస్ట్ మూవీ పదహారేళ్ళ వయసు.

ఒకరోజు రాఘవేంద్రరావు నా దగ్గరకు వచ్చారు. శ్రీదేవి... నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను, అన్నారు. ఏంటి సర్ అన్నాను నేను. మనం మళ్ళీ కలిసి వర్క్ చేయబోతున్నాం , అన్నారు. ఇది గుడ్ న్యూస్ అవుతుంది. షాకింగ్ న్యూస్ ఎలా అవుతుంది సర్, అన్నాను నేను . లేదు, నువ్వు ఒక పెద్ద స్టార్ హీరో పక్కన నటించబోతున్నావ్.. అన్నారు. 

NTR

ఎవరు ఆ హీరో అన్నాను. ఎన్టీఆర్ అని రాఘవేంద్రరావు అన్నారు. అప్పుడు నేను నిజంగా షాక్ అయ్యాను. సర్, నేను ఆయనకు మనవరాలిగా నటించాను. ఇప్పుడు హీరోయిన్ గా ఎలా చేయగలను సర్, అన్నాను. నువ్వేమి భయపడకు. నేను ఉన్నాను. నేను ఎన్టీఆర్ తో మాట్లాడాను. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు, అన్నారు. దాంతో నేను చాలా ఆనందపడ్డాను... '' అని అన్నారు.    

NTR

శ్రీదేవి-ఎన్టీఆర్ మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ, ఆమె గతంలో మనవరాలిగా నటించినప్పటికీ ప్రేక్షకులు అంగీకరించారు. దాంతో శ్రీదేవి, ఎన్టీఆర్ కలిసి అనేక చిత్రాలు చేశారు. 1972లో విడుదలైన బడిపంతులు చిత్రంలో ఎన్టీఆర్ తాతగా, శ్రీదేవి మనవరాలిగా నటించారు. ఇక ఎన్టీఆర్ తో జతకట్టిన అంజలి దేవి అనంతరం ఆయనకు తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలో ఇలాంటి విచిత్రమైన కంబోలు సహజమే. 

Latest Videos

click me!